ఎందుకో గానీ… లక్షలాది మంది అభిమానాన్ని పొందిన పునీత్ రాజకుమార్, మొన్న కన్నుమూసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సేమ్ జాతకులే అనిపిస్తుంది… ఇద్దరూ జిమ్ ప్రియులే… దాదాపు సేమ్ ఏజ్… సేమ్ ఫిజిక్… ఫిట్‌నెస్ కోసం ప్రయాస… ఇద్దరూ దాదాపు ఒకేస్థితిలో మరణించారు… చికిత్సకు కూడా టైమ్ లేనంత హడావుడిగా వెళ్లిపోయారు…
అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ఓ వీడియో కంటబడింది… ఏదో సంగీత్ కార్యక్రమంలో తన భార్యతో కలిసి హుషారుగా డాన్స్ చేస్తున్నాడు ఏదో పాటకు… అది చూస్తుంటే కాస్త కలుక్కుమంది… పునీత్ ఓ నటవారసుడు… కానీ మిగతా హీరోల్లాగా పిసినారి కాదు… ఫ్యాన్స్ పిచ్చోడు కాదు… ఎడ్డి వ్యాఖ్యల హిపోక్రాట్ కూడా కాదు… తననుతాను దైవాంశ సంభూతుడిగా చూసుకోలేదు… డౌన్ టు ఎర్త్ ఉన్నాడు… జనం కోసం డబ్బు ఖర్చు చేశాడు…
సేమ్, గౌతమ్… తను రాజకీయ వారసుడు… కానీ ఇతర రాజకీయ నాయకుల్లా లేడు… ఫుల్ ఖద్దరు వేసుకుని, ఎడ్డి మాటలు పేలుతూ సగటు నాయకుడిలా కనిపించేవాడు కాదు… తను స్వతహాగా వ్యాపారి… బాగా చదువుకున్నవాడు… తను నవతరం నాయకుడు… తన భాష, తన మాట, తన ప్రవర్తన, తన డ్రెస్సింగు, తన బిహేవియర్… అన్నీ ఓ సగటు రాజకీయ నాయకుడికి పూర్తిగా భిన్నం… అందుకే కొన్నాళ్లు అలా గుర్తుండిపోతాడు…
Ads
అఫ్‌కోర్స్, పునీత్ తను బతికే సినిమా ప్రపంచంలోని కొన్ని అవలక్షణాలకు అతీతుడిలా ఉండలేకపోవచ్చు… కానీ స్థూలంగా తను ఎలా బతికాడు అనేదే ముఖ్యం… అచ్చు అలాగే గౌతమ్ రెడ్డి కూడా ఈ క్షుద్ర రాజకీయ వాతావరణంలో కొన్ని దుర్వాసనలకు అతీతుడు కాకపోవచ్చు… అందరికీ నచ్చాలని ఏమీ లేదు… కానీ స్థూలంగా తను ఎలా బతికాడనేదే ముఖ్యం… విజ్ఞత, వివేకం, ఉత్సాహం, ముందుచూపు, చదువు, సబ్జెక్ట్ నాలెడ్జి, సంయమనం ఉన్న నాయకులు ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటాం… కానీ అలాంటోళ్లను దేవుడు త్వరగా తీసుకుపోతున్నాడు… అదీ ఐరనీ..!!
Share this Article