చౌక ధరలకు సినిమాలు కొనడం, టీవీలో ప్రసారం చేయడం, సరిపడా యాడ్స్ సమీకరించడం అనే పనికి ఆ అభిరుచితోపాటు మంచి మార్కెటింగ్ మెళకువలు అవసరం… తెలుగు వినోద చానెళ్ల విషయానికొస్తే ఉన్నవే నాలుగు చానెళ్లు… జెమిని వాళ్లు ఏ సినిమాను ఏ రేటుకు కొంటారో ఎవరికీ తెలియదు… దాని రీచ్ చాలా తక్కువ… కొత్త సినిమాలు కొని ప్రసారం చేసినా చూసేవాళ్లు కూడా తక్కువే, రేటింగులూ తక్కువే… జీటీవీ, మాటీవీ కొత్త సినిమాల్ని ఆచితూచి సెలెక్టివ్‌గా కొని ప్రసారం చేస్తుంటాయి…
ఎటొచ్చీ ఈటీవీదే ఓ వింత వైఖరి… అప్పట్లో టీవీ ప్రసారాలకు పెద్ద గిరాకీ లేని రోజుల్లో అప్పటి సినిమాలను అడ్డగోలు తక్కువ ధరలకు కొని పడేసింది… ఇక తిప్పీ తిప్పీ వాటినే ప్రసారం చేస్తుంటుంది… కొత్త సినిమాలను పెద్దగా కొనదు… దానికన్నా చౌక కార్యక్రమాలు కావాలి… క్యాష్, వావ్ వంటి కారుచౌక ఖర్చుండే ప్రోగ్రాములన్నమాట… ఆలీతో సరదాగా కూడా అంతే… జబర్దస్త్, ఢీ షోలలో కమెడియన్లు, డాన్సర్ల ఖర్చు… ఖర్చుతో కూడిన ఈవెంట్లు కూడా ఆర్గనైజ్ చేయదు…
అలాంటిది ఈమధ్య ఒకటీ అరా సినిమాల్ని కొంటోంది… గీసిగీసి బేరమాడి, ఏవో చిన్న సినిమాలను కొంటోంది… రేటింగ్స్ వస్తే వచ్చినయ్, రాకపోయినా పర్లేదు అనే స్థాయిలో… అది మొన్నామధ్య ఆదివారం… 13.2.2022… సాయంత్రం 6.30 గంటల నుంచి 9 గంటలు… అంటే అత్యంత విలువైన ప్రైమ్ టైమ్‌లో… డియర్ మేఘ అనే సినిమాను ప్రసారం చేసింది… మేఘా ఆకాశ్ హీరోయిన్… ఇంకో ఇద్దరు పెద్దగా పేరు తెలియని లీడ్ యాక్టర్స్… ఆ సినిమా మీద ‘ముచ్చట’ రివ్యూ చదవండి ఈ లింకులో ఓసారి…
Ads
డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…
ఈ సినిమా ప్రసారానికి గాను ఈటీవీకి దక్కిన రేటింగ్స్ తెలుసా..? 1.28 టీఆర్పీలు మాత్రమే… సినిమా ఫీల్డులో డిజాస్టర్ అనే పదాన్ని వాడతారు కదా… ఆ రేంజ్ ఫ్లాప్ అన్నమాట… ఆ సినిమా ఒరిజినల్ ఏదో పెద్ద మిస్టరీ… ఓ సినిమా, దానికి కాపీ, దానికి తెలుగు డబ్బింగ్, మళ్లీ రీమేక్ హక్కుల విక్రయం… ఇలా నానా కథలూ పడ్డది ఆ సినిమా… తీరా చూస్తే ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్… అప్పటికి ఇంకా కరోనా భయం ఉంది కాబట్టి థియేటర్లకు జనం రాలేదు అనుకుందాం… అలాంటప్పుడు టీవీల్లో కాస్త వ్యూయర్షిప్ దక్కాలి కదా… టీవీల్లో దాన్ని పట్టించుకున్నవారే లేరు… 1.28 రేటింగ్స్ అనేది మరీ దయనీయం…
టీవీ మార్కెటింగ్ వ్యూహాల్లో దూకుడు అవసరం… పెద్దవి, కొత్త సినిమాల్ని కాస్త ఖర్చెక్కువైనా సరే, కొంటే, ప్రసారం చేస్తే… అది ఓ రేంజ్… రీచ్, రేటింగ్స్, యాడ్స్, డబ్బు… ఫుల్ యాక్టివిటీ… ఈటీవీ ఏ సాహసమూ చేయడానికి సిద్ధంగా లేదు ఎందుకో మరి…!! మరీ చీప్ రేట్లకు వచ్చే సినిమాలే కొంటాం, లేకపోతే లేదు అనే ధోరణి అస్సలు పనికిరాదు… డియర్ మేఘ ప్రసారమే పెద్ద ఉదాహరణ…
Share this Article