ఓ రైతు… విపరీతంగా కష్టపడేవాడు… పెద్ద వ్యవసాయ క్షేత్రం కావాలి తనకు… ఎందుకు..? తన కొడుకులు, మనమలు సంతోషంగా జీవించాలి… అందుకే పఢావు భూముల్ని కొన్నాడు… దాన్ని సారవంతం చేయడానికి బాగా కష్టపడేవాడు… కరువులు, తుపాన్లు, చీడపీడలను తట్టుకుంటూ… ఎదురీదుతూ… పంటల్ని కాపాడుకున్నాడు… అదృష్టం కలిసొచ్చింది… మంచి దిగుబడులు వచ్చినయ్… ధనికుడు అయిపోయాడు…
కాలం ఆగదు కదా… వయస్సు మీద పడుతోంది… మునుపటిలా కష్టపడలేకపోతున్నాడు… ఇక రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసిందని అనుకున్నాడు… ఓరోజు కొడుకును పిలిచి, ఇకపై ఈ పొలం బాధ్యత నీదేరా అన్నాడు… కొడుకు బాధ్యత తీసుకోగానే రిలాక్స్ ఫీలయ్యాడు… ఓ ఈజీ చెయిర్ చేయించుకుని, పొలం దగ్గర వేసుకుని, కూర్చుని తన కష్టఫలాన్ని చూస్తూ , తన రిటైర్‌మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు…
కొడుకు కూడా పొలం బాధ్యత తీసుకున్న మొదట్లో గర్వించాడు, సంతోషించాడు… తనది కూడా బాగా కష్టపడే తత్వమే… రోజులు గడుస్తున్నయ్… మొదట్లో ఉన్న ఉత్సాహం క్రమేపీ చల్లారిపోతోంది… ప్రత్యేకించి తండ్రి ఏ పనీ లేకుండా కూర్చోవడాన్ని సహించలేకపోతున్నాడు… తను ఒళ్లొంచి కండలు కరిగిస్తుంటే తండ్రి ఎంచక్కా కుర్చీలో కూర్చుని అన్నీ చూస్తూ రిలాక్స్ ఫీలవుతున్నాడు… మనమలతో ఆడుకుంటున్నాడు… క్రమేపీ కొడుకులో అసహనం మొదలైంది… పెరిగింది…
Ads
ఆ పెట్టెను అనుకున్నట్టుగానే గుట్ట మీద నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు… లోపల నుంచి తట్టుతున్న సౌండ్ వినిపించింది… కాస్త ఓపెన్ చేశాడు… ఏం కావాలి అనడిగాడు ఉరిమి చూస్తూ… తండ్రి ఏమన్నాడంటే… ‘‘ఒరేయ్, నీ ఉద్దేశం నాకు తెలుసు… నేను ముసలోడిని అయిపోయాను, నన్ను వదిలించుకుందామని చూస్తున్నాను… ఈ పెట్టెను పూర్తిగా తెరువు, నేను బయటికి వస్తాను, నన్ను కిందకు తోసెయ్…’’ అన్నాడు… కొడుకు అర్థం కానట్టు మొహం పెట్టాడు… తండ్రి ఏమంటాడంటే… ‘‘పిచ్చోడా, ఈమాత్రం దానికి ఈ చెక్కపెట్టెను వేస్ట్ చేయడం దేనికి..? ఇలాగే ఉండనివ్వు… భవిష్యత్తులో నీ కొడుకుకైనా ఉపయోగపడుతుంది కదా..’’ (ఎక్కడో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది…)
Share this Article