hermaphroditism… వైద్యపరిభాషలో ఇదే సరైన పదం… తెలుగులో ఏమంటారో… ఉభయలింగ అని పిలవాలేమో… అంటే, అర్థమైంది కదా… ఒక వ్యక్తిలో స్త్రీ, పురుష జననాంగాలు ఉండటం..! ప్రపంచంలో ఇదేమీ వింత కాదు, ఇప్పుడు వినడం కూడా కొత్తేమీ కాదు… కానీ ఓ కేసు సుప్రీం దాకా వచ్చింది…. అందుకే మళ్లీ కాస్త చర్చ… (ఈ స్థితిని congenital adrenal hyperplasia అని కూడా అంటారట…)
హడావుడిగా చదివితే అంత తేలికగా జీర్ణం కాదు… సున్నితంగా ఉంటుంది, అబ్బురంగానూ ఉంటుంది… రేర్ కేసు కాబట్టి…! ఒక వ్యక్తి తన భార్య ఆడది కాదు, మగాడు అని కోర్టుకు వెళ్లాడు… అంతేకాదు, ఆడదిగా నమ్మించి, తనను మోసం చేసి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు గాను తనను పెళ్లిచేసుకున్న ఆ మనిషినీ, ఆమె తండ్రినీ శిక్షించాలని కోరాడు… ఇది మధ్యప్రదేశ్‌లో జరిగింది… దాదాపు ఏడేళ్లుగా సాగుతోంది కేసు…
వివరాలేమిటంటే… గ్వాలియర్‌కు చెందిన ఒకాయనకు పెళ్లయింది… 2016లో… కొన్నాళ్లు కాపురానికి రాలేదు భార్య… ఎలాగోలా బండి పట్టాల మీదికెక్కింది… ఆ భర్త తన భార్యగా చెప్పబడుతున్న మనిషికి పురుష లైంగిక అవయవాలు కూడా ఉండటంతో మొదట షాక్ తిన్నాడు… తనను మోసగించారని కోపమొచ్చింది… మొదట డాక్టర్లకు చూపిస్తే ఆమెకు పురుషాంగం చిన్నగా ఓ పిల్లాడికి ఉన్నట్టుగా ఉన్నందున సర్జరీ చేసి, తీసేయవచ్చునని కూడా ఆ డాక్టర్లు చెప్పారట… కానీ ఆయన ఆమెను పేరెంట్స్ దగ్గరకు పంపించేశాడు…
Ads
రెండు కుటుంబాల నడుమ కొన్నాళ్లు పంచాయితీ సాగింది… ఆ భార్య ఈలోపు ఏం చేసిందో తెలుసా..? తన భర్త కట్నం కోసం హింసిస్తున్నాడు, ఈ ప్రచారం కూడా అందులో భాగమేనని ఆరోపించింది… ఫిర్యాదు చేసింది… దాంతో ఆ భర్త మేజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లి తన భార్య, ఆమె తండ్రి తనను మోసగించారని కేసు పెట్టాడు… మొదట్లో ఈ కేసు తీసుకోవడానికి సందేహించినా తరువాత విచారణకు తీసుకున్నారు…
‘‘లోకల్ డాక్టర్లు చెబుతున్నారు, ఆమెకు పెళ్లికి మూడేళ్ల ముందే డాక్టర్లకు చూపించారుట, కాపురానికీ, పిల్లల్ని కనడానికి ఆమెకు వీలుకాదు అని డాక్టర్లు చెబుతున్నారుట, మరి ఆమె స్థితిని చెప్పకుండా నాతో పెళ్లిచేయడం మోసమే కదా…’’ అని భర్త వాదన… దాంతో అధికారికంగా వైద్యపరీక్షలకు ఆదేశించింది ట్రయల్ కోర్టు… ఆమె మొదట మొరాయించింది… కోర్టు ఈ పరీక్షలు తప్పవని స్పష్టం చేయడంతో హైకోర్టుకు కూడా వెళ్లింది ఆమె… చివరకు తప్పలేదు… వాటిని పరీక్షించిన హైకోర్టు… ‘స్త్రీ సంబంధ అవయవాలు పర్‌ఫెక్టుగా ఉన్నాయి కాబట్టి ఆమె భర్తను మోసం చేసింది అని చెప్పలేం’’ అని చెప్పింది…
భర్త సుప్రీంకోర్టు తలుపుతట్టాడు… తన భార్యకు పురుషాంగంతో పాటు ఆమె కన్నెపొర (హైమెన్) అసంపూర్తిగా ఉందని నిర్ధారించే వైద్య నివేదికను సమర్పించాడు… హైమెన్ అసంపూర్ణంగా ఉన్నంత మాత్రాన ఆమె స్త్రీ కాదని చెప్పగలరా అని ప్రశ్నించింది సుప్రీం భర్త న్యాయవాదిని… వైద్య నివేదిక ప్రకారం ఆమె అండాశయాలు సాధారణంగా ఉన్నాయన్నాయి కదాని గుర్తుచేసింది… ‘‘అసంపూర్తి హైమెన్ మాత్రమే కాదు, పురుషాంగం కూడా ఉంది, అంటే స్త్రీ ఎలా అవుతుంది యువరానర్’’ అన్నాడు ఆ లాయర్… సో, ప్రస్తుతానికి భార్యకు, తండ్రికి నోటీసులు జారీ అయ్యాయి… కేసు ఇప్పుడప్పుడే తెగేట్టు లేదు..!!
Share this Article