‘నీరవ్ మోడీ ఎన్ని కోట్ల బ్యాంకు రుణాలకు ఎసరు పెట్టాడు… 6 వేల కోట్లు… ఆయన గారి అంకుల్ గారు మోహుల్ చోస్కీ ఎసరు విలువ ఎంత..? 7080 కోట్లు… మన డెక్కన్ వెంకట్రామయ్య, కన్నడ విజయ మల్లయ్య ఎట్సెట్రా ఈ రేంజ్‌కు ఎదగలేదు… వాళ్లను మించిపోయాడు మన రాయపాటి వారు… మరేమనుకున్నారు..? ఆయన రేంజ్ అదీ… సీబీఐ ప్రాథమిక అంచనా మేరకు అయ్యగారు 7926 కోట్ల మేరకు ఫసాక్ అనిపించేశాడట…
సీబీఐ ఆయన కంపెనీ ట్రాన్స్ట్రాయ్ ఆఫీసులు, నివాసాలపై దాడులు చేసి, సోదాలు చేసి, ఏవో కొన్ని ఆధారాలు చేజిక్కించుకుని లెక్కలు వేస్తే ప్రాథమికంగా తేలిన మొత్తం అంతేనట… మొత్తం లెక్క తేల్చేసరికి ఇంకెంతో… ఇప్పటికైతే దేశంలో బయటపడిన పెద్ద బ్యాంక్ ఫ్రాడ్ ఇదేనట…
Ads
సీబీఐ అధికారికంగానే చెబుతోంది కంపెనీ సీఎండీ చెరుకూరి శ్రీధర్, అదనపు డైరెక్టర్లు రాయపాటి సాంబశివరావు, అక్కినేని సతీష్ తదితరులు ప్రధాన బాధ్యులు అని… ఎఫ్ఐఆర్లో కూడా అదే రాసింది…
‘‘కెనరా బ్యాంకు, ఇతర బ్యాంకుల కన్సార్షియం నుంచి వేల కోట్లు రుణం తీసుకున్న ఈ కంపెనీ లెక్కల్ని తారుమారు చేయడం, బ్యాలెన్స్ షీట్లను ట్యాంపర్ చేయడం వంటి నానా అవలక్షణాలను ప్రదర్శించింది’’ అని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ ఆరోపణ… బ్యాంకు రుణాల దుర్వినియోగంపై కేసు నమోదు చేసింది సీబీఐ…
సరే, విషయానికొద్దాం… ఈ కేసులతో ఏమవుతుంది..? ఒక కావూరికి ఏమైంది..? ఒక రాయపాటికి ఏమవుతుంది..? ఐటీ దాడులు, సీబీఐ సోదాలు, డీఆర్ఐ నిఘాలు గట్రా సాగుతూనే ఉంటయ్… ఒక్కరంటే ఒక్క తెలుగు స్కామర్‌కు ఏమైనా శిక్ష పడిందా..? పోనీ, నాలుగు రోజులు జైలుకైనా వెళ్లొచ్చారా..? అనవసరంగా ఈ నీరవ్ మోడీలు, మెహుల్ చోక్సీలు, విజయ్ మాల్యాలు, లలిత్ మోడీలు బెంబేలెత్తిపోయి విదేశాలకు పారిపోయారు…
ప్చ్, మన రాయపాటి వారికున్న ధైర్యం చూడండి… ఆయన రేంజ్ చూడండి… అదీ స్కాములు చేయడానికి కూడా దమ్ముండాలి బాసూ… అది లేనప్పుడు ఎందుకు బ్యాంకు రుణాల జోలికి వెళ్లాలి అసలు..? ఎంతైనా మనవాళ్లే ఘటికులండీ… ఏదైనా చేసేయగలరు…!!
Share this Article