ఎన్‌కౌంటర్లు… యూపీలో యోగి జరిపిన ఎన్‌కౌంటర్లు అన్నీఇన్నీ కావు… వందలు కాదు, వేలల్లో… లీగల్ ప్రాసెస్‌ను విస్మరించి, న్యాయసమీక్ష అధికారాన్ని కూడా పోలీసులకే అప్పగించడం రాను రాను ఎలా దుష్ఫలితాలకు దారితీస్తుంది..? డైనమిక్ న్యాయవ్యవస్థ వైపు, చట్టాల వైపు ఆలోచించకుండా ఎన్‌కౌంటర్ల మార్గం పట్టడం శ్రేయోదాయకమేనా..? మొన్నటి ఎన్నికల్లో యోగి గెలుపు స్థూలంగా జనామోదంగా భావించాలా..? ఇవన్నీ చిక్కు ప్రశ్నలు… అయితే యోగిని చూసి, అస్సాం సీఎం కూడా అదే బాటపట్టడం గురించి కూడా చెప్పుకోవాలి…
ఓ గ్యాంగ్ రేప్ కేసు… నిందితులంతా పరారీలో ఉన్నారు… సహరన్‌పూర్ జిల్లా… నిందితులు దొరకడం లేదు… దాంతో బుల్‌డోజర్లు రంగంలోకి దిగాయి… లొంగిపోకపోతే ఇళ్లను కూల్చేస్తామని హెచ్చరికలు జారీ… ఐనా వినకపోతే, ఒకవేళ దొరికితే ఎన్‌కౌంటరే అనే సంకేతాలు జారీ.,. ఇంకేముంది..? గంటల్లో నిందితులు లొంగిపోయారు… ఇది ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ రోడ్డెక్కిన సర్కారీ బుల్‌డోజర్ల తాజా కథ…
అస్సాం… గోల్‌పార జిల్లా… మర్డర్లు, కిడ్నాప్ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చిచంపారు… ఇది శుక్రవారం రాత్రి జరిగిన సంఘటన… సింపుల్‌గా ఎప్పటిలాగే చెప్పారు పోలీసులు… ఓ ట్రక్కులో దాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారు, లొంగిపొమ్మన్నాం, వినలేదు, తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ మాపై కాల్పులు జరిపారు, ఎదురకాల్పుల్లో మరణించారు… దాదాపుగా పోలీసులు చెప్పే కథ ఇదే కదా… అదే చెప్పారు…
Ads
అస్సాం హిమంత విశ్వశర్మ గత ఏడాది మేలో కుర్చీ ఎక్కిన తరువాత ఇప్పటివరకు పోలీస్ కస్టడీలో 35 మంది మరణించినట్టు మీడియా లెక్క… మొన్నటి మార్చిలో బికీ అలీ, రాజేష్ ముండా అనే ఇద్దరు రేప్ కేసు నిందితులు ఇలాగే హతమారిపోయారు… అరెస్టు జరిగిన మరుసటిరోజే సంఘటన జరిగింది… అంటే అరెస్టు జరిగినా, లొంగిపోయినా ప్రాణాలు ఉంటాయనే గ్యారంటీ ఏమీ లేదన్నమాట…
మొన్నటి ఎన్నికల్లో యోగి బహిరంగంగానే… ‘‘త్వరలో మళ్లీ బుల్‌డోజర్లు రోడ్డెక్కుతాయి’’ అంటూ వెల్లడించిన సంగతి తెలుసు కదా… అన్నట్టుగానే అవి డ్యూటీలోకి దిగాయి… మొన్నమొన్ననే కదా మళ్లీ ప్రమాణస్వీకారాల హడావుడి ముగిసింది, ఈలోపు ఇంకా ఎన్‌కౌంటర్లు స్టార్ట్ కానట్టున్నయ్… యోగీలాగే హిమంతది కూడా దూకుడు కేరక్టర్… బుల్‌డోజర్ పాలన, తుపాకీ న్యాయాన్ని నమ్ముతున్నట్టున్నాడు… ఈ ‘‘ఇన్‌స్టంట్ జస్టిస్’’ కథ ఎక్కడి వరకో…!!
Share this Article