దళపతి విజయ్… అనగా కమాండర్ విజయ్ కొత్త సినిమా పేరు బీస్ట్… అనగా మృగం… ఐనా ఈమధ్య తమిళ సినిమాలకు గమ్మతి పేర్లు పెడుతున్నారుగా… వలిమై, బిగిలు, ఈటీ, బీస్ట్… ఎన్నన్ని కొత్త ఆప్ట్ పేర్లు దొరుకుతయ్, కానివ్వండి… విషయం ఏమిటంటే… అలాంటి పేరే ఉన్న మరో సినిమా… కేజీఎఫ్-2 తో పోటీ… ఢీ… ఒకటి తమిళం, మరొకటి కన్నడం… ఇప్పుడు ప్రతిదీ పాన్ ఇండియాయే కదా… తెలుగులో కూడా డబ్ చేసి వదులుతున్నారు…
కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ గ్రాండ్ హిట్… డౌట్ లేదు… సేమ్, అదే పోకడతో సెకండ్ పార్ట్… అనగా సీక్వెల్ వస్తోంది… యష్ ఇప్పుడు కన్నడంలో కొత్తతరం హీరో… బీస్ట్ హీరో విజయ్ కూడా తమిళంలో సేమ్ రేంజ్ టాప్ హీరో… ఇద్దరూ తెలుగులో ఢీకొట్టడానికి వస్తున్నారు, అది వేరే కథ… అయితే చాన్నాళ్లుగా బీస్ట్‌లో ఓ పాట గురించి ఊరిస్తున్నారు… దాని పేరు అరబిక్ కుత్తు…
తమిళంలో ఆ పాట బంపర్ హిట్… యూట్యూబ్‌లో ఎక్కడికో వెళ్లిపోయింది… తెలుగులోకి డబ్బింగ్ అన్నప్పుడు మరి తెలుగులో రాయక తప్పదుగా… ఎలా రాశారనే ఆసక్తి ఉండేది… అసలు అరబిక్ కుత్తు అని ఎందుకు పాపులరైందో తెలియదు… తీరా తెలుగు సాంగ్ రిలీజ్ చేశారుగా… పల్లవిని యథాతథంగా ఉంచేశారు… అంతేమరి, అదే అట్రాక్షన్ అట… ఆ ట్యూన్‌కు ప్రాణం అదేనట… ‘‘హలమిత్తి హబీబో… మలమ్మ పిత్తా పిత్తాదే…’’ అని ఏవో మనకు తెలియని పదాలు వినిపిస్తుంటయ్… అవి నిజంగా అరబిక్ పదాలేనా..?
Ads
సరే, వాటి అర్థాల జోలికి వెళ్లడం దేనికిలే గానీ… చరణాల్లో మాత్రం కాస్త హుషారైన తేలిక పదాల్ని అల్లేశాడు లిరిక్ రైటర్ శ్రీసాయికిరణ్… కాకపోతే వీడియో చూస్తుంటే పూజా హెగ్డే కనిపిస్తూ, రాధేశ్యాం గుర్తొచ్చి హడలగొడుతోంది… ఆ పాటలో చరణాలు ఇలా వండబడ్డాయి…
హోళీ హోళీ… పక్కనుంటే సక్కని రంగోళీ
డోలీ డోలీ… కొత్తగుంది మనసున డోలీ
గాలీ గాలీ… మత్తుగుంది తగిలిన గాలీ
జాలీ జాలీ గడపాలీ… ఓ క్యూటీ నా స్వీటీ
నీ బ్యూటీ అది నాటీ…
నను మెల్లగ మెల్లగ లాగీ
తెగ ఊహల ఊయలలాగీ
పొగబెట్టి పడగొట్టి… కన్నుగొట్టి కొల్లగొట్టి
లవ్ కొంచెం కొంచెం తాకీ
చిట్టి గుండెను గట్టిగ కొరికి
……. ఇలా సాగిపోతుంది… సాహిత్యం, అర్థం వంటి పెద్ద పెద్ద పదాల జోలికి పోకండి, ఈ చరణం కాగానే మళ్లీ అదేదో భాషలోకి వెళ్లిపోతాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్… పాడింది కూడా తనే… సిధ్ శ్రీరాం తాత…
బీదా బల్లిహబీ
బల్లిబాదీ బల్లిహబీ
బల్లి హబీదా
వల్లే వల్లే బల్లిహబీ
…. తన గురించి వదిలేస్తే ఫిమేల్ సింగర్ గురించి చెప్పాలి… టోన్ కొత్తగా ఉంది పేరులాగే… జొనితా గాంధీ…
ఢిల్లీలోని ఓ పంజాబీ ఫ్యామిలీలో పుట్టింది… ఏడాదిలోపు వయస్సులోనే ఆ ఫ్యామిలీ కెనడాకు వలసపోయింది… ఈమె అక్కడే పెరిగింది, చదివింది… మ్యూజిక్ అవకాశాలు అన్వేషణలో ఇండియాకు వస్తోంది, పోతోంది… ఎక్కువగా హిందీ, తమిళంలో పాడింది… క్లాసికల్, వెస్టరన్, పాప్, జాజ్… ఏదయినా సరే దంచేస్తుంది… ఒకటీరెండు కన్నడం, మలయాళం, పంజాబీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా పాడింది… తొమ్మిదేళ్లుగా ఫీల్డులో ఉన్నా సరే, మన డీఎస్పీలకు ఎందుకు కనిపించలేదో మరి…!? కిక్2 లో రెండు పాటలు పాడినట్టుంది… ఇక ఇలాంటి కొత్తతరం పాటలు, ప్రేక్షకుడికి సాహిత్యం తొక్కాతోలూ ఏమీ పట్టవ్… సరిగ్గా కనెక్టయ్యే ఓ మాస్ బీట్ ట్యూన్ పట్టుకోవడం, నాలుగు అల్లరి పదాలేవో ఇరికించడం, కుమ్మేయడం… రాబోయేవి ఇలాంటి పాటలే ఇక…!!
Share this Article