కేంద్రం మీద రాష్ట్రం… రాష్ట్రం మీద కేంద్రం విమర్శలు కురిపిస్తున్నారు… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా ఒకరినొకరు తూర్పారబట్టుకుంటున్నయ్… ఇప్పటికే కేంద్రం వైఖరి మీద రాష్ట్రమంతటా టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది… 11న ఢిల్లీలో ధర్నా అంటోంది… చూసుకుందాం నీ పెతాపమో, నా పెతాపమో అనే రేంజులో గుర్రుగా చూసుకుంటున్నయ్… నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ ధాన్యం విషయంలో తన వైఫల్యాల్ని బీజేపీ మెడకు వేయాలని చూస్తోంది…
మరోవైపు ధాన్యం రైతు దిక్కులు చూస్తున్నాడు ఇక… యాసంగి ధాన్యం రాబోతోంది… రాష్ట్రం నేను కొనేది లేదు అంటోంది… బాయిల్డ్ రైస్ నాకు అక్కరలేదు అని కేంద్రం అంటోంది… మరేం చేయాలి..? రైతుకు దిక్కేమిటి..? ఈ రాజకీయ రచ్చలు, బురద జల్లుకోవడాలు తప్ప ఎవరైనా నిజ పరిష్కార మార్గాలు ఆలోచిస్తున్నారా..? లేదు..! పోనీ, వ్యవసాయ రంగ నిపుణులు మాట్లాడుతున్నారా..? లేదు..! మీడియా గురించి చెప్పుకోవడం దండుగ… అసలు బాయిల్డ్ రైస్, రా రైస్ నడుమ తేడా తెలియదు చాలామందికి…
ఈ నేపథ్యంలో నిన్న ఆంధ్రజ్యోతి బ్యానర్ స్టోరీ నిజంగా అభినందనీయం… ఆమధ్య ఈ ధాన్యం విషయంలో మూడునాలుగు మంచి స్టోరీలు వేసిన ఈ పత్రిక ఇప్పుడు మరింత సమగ్ర కథనాన్ని పబ్లిష్ చేసింది… మెయిన్ స్ట్రీమ్ చేయాల్సిన పని ఏమిటో సాక్షి, ఈనాడు చూసి నేర్చుకోవాలి… ‘‘వరి… వరమయ్యేదిలా’’ పేరిట పలు మార్గాల్ని, అవకాశాల్ని రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి… ఎంతసేపూ పైపైన ఏవో కథనాలు రాసేయడం గాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లాలి…
Ads
ఇదీ ఆ వార్త లింక్… https://www.andhrajyothy.com/telugunews/the-solution-to-the-yasangi-problem-ngts-telangana-182204050145347… అసలు ఎలాంటి వరి రకాల్ని వేస్తే బెటర్ అనే అంశం దగ్గర నుంచి… ఇథనాల్, ఎగుమతులు, ఫోర్టిఫైడ్ రైస్, బియ్యప్పిండి, ఇడ్లీ రవ్వ దాకా పలు అంశాల్ని స్పృశించింది… బ్రూవరీస్ అంశాన్ని టచ్ చేసినట్టు అనిపించలేదు… కానీ వీలైన మార్గాల్ని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయవచ్చుననే సూచనల్ని కూడా వివరించింది… అఫ్‌కోర్స్, కొన్ని అంశాలతో కొందరు విభేదించవచ్చుగాక… కానీ ధాన్యం విషయంలో నిర్మాణాత్మకంగా జరగాల్సిన చర్చ మాత్రం ఇలాగే…
ఏ రాష్ట్రంలోనూ రాని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తోంది..? ఇది ప్రధానమైన ప్రశ్న… మరి ఇప్పుడేం చేయాలి..? ఇది జవాబు అవసరమైన ప్రశ్న… ఇదే కాదు, రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ముందుగా కేసీయార్ వైపే చూస్తారు… రైతులకు గానీ, వేరే సెక్షన్‌కు గానీ ప్రభుత్వం అంటే కేసీయారే… వాళ్లకు మోడీ తెలియదు… పీయూష్ గోయల్ ఎవరో తెలియదు… ఈ నేపథ్యంలో ఈ సమస్యకు సరైన పరిష్కార ప్రయత్నం కేసీయార్ వైపు నుంచే జరగాలి…
రాజకీయాలే ప్రధానమైపోయినప్పుడు… నిజాలు మరుగునపడతాయి… దృష్టి పరిష్కారం మీద నిలవదు… ఆంధ్రజ్యోతి కథనంలో కొన్ని మాత్రమే మార్గాలు ఉండవచ్చుగాక… కానీ నిజంగా మిల్లర్లు, ఉన్నతాధికారులు భేటీలు వేస్తే అంతకుమించిన పరిష్కార మార్గాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు… అదిప్పటికే జరగాల్సి ఉండింది… బాయిల్డ్ రైస్ అనే సమస్య ఇక ముందు కూడా ఉండబోతోంది… అది ఈ ఒక్క యాసంగి సమస్య కాదు… రైతుల్ని కొత్త డైరెక్షన్‌లోకి తీసుకుపోవాలి… అదెలా అనేదే ఇప్పుడు చర్చ సాగాలి…! ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు వచ్చిన మరో మంచి స్టోరీ ఇదుగో… (ఏపీ అనేసరికి ఎందుకంత pollute అయిపోతుంది పత్రిక…? అడక్కండి… అది అంతే)
Share this Article