ఫేస్ఋక్‌లో మిత్రురాలు తులసి చందు పెట్టిన ఓ వీడియో పోస్టు ఓ కొత్త విషయాన్ని చెప్పింది… అదేమిటీ అంటే… గద్దర్ జీవితం ప్రశాంతంగా ఏమీ లేదు… రాజ్యం, ప్రభుత్వం తననేమీ నిశ్చింతంగా ఉండనివ్వడం లేదు… అంతేకాదు, కర్నాటకలో రెండుమూడేళ్లుగా నడుస్తున్న ఓ కేసులో తనకు ఏ శిక్షయినా పడవచ్చునని ఆయన సందేహిస్తున్నాడు… చివరకు ఉరిశిక్ష లేదా జీవితఖైదు కూడా పడవచ్చునని అంటున్నాడు…
‘‘అది బెగంపల్లి కేసు… 28 ఏళ్ల క్రితం పెట్టబడిన కేసు… అదే అమ్ముగూడ రైల్వే స్టేషన్ కేసు… రెండున్నరేళ్లుగా కర్నాటకలో ఈ కేసును ఫేస్ చేస్తున్నాను… అందరూ అనుకుంటున్నట్టుగా ప్రశాంతంగా ఏమీ లేదు మా కుటుంబం… రాజ్యంతో కొట్లాట నడుస్తూనే ఉంది… నిజానికి ఆ కేసుతో నిజానికి నాకేమీ సంబంధం లేదు, ఏ తప్పూ లేదు…
కేసు నడుస్తోంది… తీర్పు ఏమొస్తుందో చూద్దాం… ఏ శిక్షయినా పడుతుందీ అని ఎందుకు చెబుతున్నానంటే… జీవితఖైదు కావచ్చు, ఉరిశిక్ష కూడా కావచ్చునని ఎందుకు చెబుతున్నానంటే… అన్నిరకాల సెక్షన్లు పెట్టబడ్డయ్ ఆ కేసులో… పర్లేదు, అలవాటైపోయింది… జీవితమంతా ఇదే కదా… రాజనీతే అన్యాయమైపోయి నాకు తీవ్ర శిక్ష పడితే ఏం చేయాలి..? వెళ్తా.,. హైకోర్టుకు వెళ్తా… సుప్రీంకు వెళ్తా…
Ads
తప్పదు కదా… ప్రజల కోసమే పాడుతున్నా… పాట ఆగేట్టు లేదు, ఆపేట్టు లేదు… జీవితమెప్పుడూ ప్రశాంతంగా ఏమీ ఉండదు, పోరాటమూ తప్పదు… మీకు తెలుసు కదా… దేహంలో తూటా దిగినా 25 ఏళ్లుగా పాడుతూనే ఉన్నాను కదా… చనిపోతూ పాడుతా, చనిపోయేదాకా పాడుతా… నాపాట వింటావా, నామాట వింటావా..? గాతె గాతె మరుంగా, ఏ గీత్ సున్‌లో భయ్, మర్తె మర్తె గావుంగా, ఏ గానా సున్‌లో భయ్…’’ అంటున్నాడు గద్దర్…
అసలు ఆయన మాటలెలా ఉన్నా సరే… తన సహచరి మాటలు బాగా బాధను వెల్లడిస్తున్నయ్… తాము ఏ పార్టీ కోసమైతే శ్రమించామో, పాటుపడ్డామో వాళ్ల నుంచి కూడా ఏ స్పందన లేదనేది ఆమె మాటల ఆంతర్యం… (గతంలో పీపుల్స్‌వార్, ఇప్పుడు మావోయిస్టు)… వయస్సుడిగిన గద్దర్ ఇప్పటికీ రాజ్యానికి శత్రువులాగే కనిపిస్తున్నాడా..? రాజ్యాన్ని కూలదోసే శక్తిలాగే కనిపిస్తున్నాడా..? అసలు తనకు పార్టీతో సంబంధాలే లేవు కదా… మరి ఈ వయస్సులో తన మీద కక్షసాధింపుతో కేంద్రం సాధించదలిచిన లక్ష్యం ఏమిటి..? ఏమో…!! ఐనా వరవరరావు తదితరులపై కేసుల గురించి చూస్తూనే ఉన్నాం కదా… గద్దర్ మీదా అదే ధోరణి…!!
నిజానికి కోరెగావ్ కుట్ర కేసులో వరవరరావుకు కండిషన్ బెయిల్ లభించింది… ఒకవేళ పూర్తి బెయిల్ లభిస్తే తనను తిరిగి అరెస్టు చేయాలని కర్నాటక పోలీసులు ఆలోచిస్తున్నారని టాక్… ఇప్పుడు గద్దర్ ప్రస్తావిస్తున్న కర్నాటక కేసులో వీవీ కూడా ఉన్నాడు… మావోయిస్ట్ పార్టీ బలహీనపడే కొద్దీ లీగల్ సపోర్ట్ వింగ్ కూడా బలహీనపడి, పాతబడిపోయిన కేసులు కూడా ఇప్పుడు తరుముకొస్తున్నయ్…!!
Share this Article