నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది ఈ సినిమా… పేరు దస్వీ… అంటే పదో తరగతి… టెన్త్ క్లాస్… ఇప్పుడు తాజాగా చర్చల్లో నలుగుతోంది… ఎందుకు..? సినిమా గురించి కాదు… సినిమాపై రివ్యూల గురించి కూడా కాదు… పర్టిక్యులర్‌గా ఆ సినిమాలో హీరోయిన్ యామీ గౌతమ్ నటన గురించిన రివ్యూలపై… నిజానికి ఆ సినిమాలో ఆమె హీరోయినే కాదు… కాకపోతే ఓ ముఖ్యమైన పాత్ర… దీనికన్నా ముందు మరో నటి గురించి చెప్పాలి…
నిమ్రత్ కౌర్… వయస్సు నలభై ఏళ్లు… రాజస్థాన్‌లో ఓ సిక్కు కుటుంబంలో పుట్టింది… తండ్రి ఆర్మీ ఆఫీసర్… పాతికేళ్ల క్రితం ఆయన కశ్మీరీ ఉగ్రవాదుల చేతుల్లో మరణించాడు… తరువాత ఈ కుటుంబం ఢిల్లీకి షిఫ్టయిపోయింది… ఇదీ నేపథ్యం… మోడల్‌గా కొన్నాళ్లు పనిచేసిన ఈమె 2005 నుంచీ ప్రయత్నిస్తున్నా పెద్దగా సినిమాలేవీ లేవు… మహా అయితే అయిదు సినిమాలు… అంతే… వెబ్ సీరీస్, టీవీ సీరియళ్లు చేసుకుంటుంది…
ఈమెకు అభిషేక్ బచ్చన్ హీరోగా చేసిన దస్వీలో తన సరసన తన భార్యగా నటించే పాత్ర దొరికింది… ఫుల్ ఖుష్… సినిమా మొత్తమ్మీద కాస్త ఆసక్తిగా చూడబుద్దయిన పాత్ర, నటన ఆమెదే… భర్త చాటు భార్యకు హఠాత్తుగా ముఖ్యమంత్రి యోగం పడుతుంది… నడమంత్రపు అధికారం మెదడుకెక్కిన లేడీ పాత్రలో ఏమాత్రం ఓవర్ యాక్షన్ లేకుండా, తక్కువ గాకుండా నటించి మెప్పించింది… అయితే హిందీ క్రిటిక్స్ ఎందుకో గానీ పర్టిక్యులర్‌గా యామీ గౌతమ్ మీద పడ్డారు…
Ads
ఈ సినిమాలో యామీ పాత్ర ఓ జైలు సూపరింటిండెంట్… స్ట్రిక్ట్ ఆఫీసర్… జైలులో ఉన్నది ముఖ్యమంత్రి అయితేనేం, టఫ్‌గానే ట్రీట్ చేస్తుంది… ఓ దశ వచ్చాక అభిషేక్‌కు తనే టీచర్ అవుతుంది, శ్రేయోభిలాషి అవుతుంది… పర్లేదు, మంచి పాత్రే… కానీ కేరక్టరైజేషన్ లోపాలుండి, ఆమె పెద్దగా హైలైట్ కాలేదు… ఆమె తప్పేమీ లేదు… ఆమె కనిపిస్తున్నంతసేపూ ప్లజెంటుగా ఉంటుంది… ప్రత్యేకించి ఆమె నవ్వు… సినిమా చివరలో కొన్ని సీన్లలో మొహంలో ఉద్వేగాల్ని మరీ ఓవర్‌గా గాకుండా, నేచురల్‌గా ప్రదర్శించింది… కానీ హిందీ సైట్లు కొన్ని ఆమె నటనను వెక్కిరించాయి…
దాంతో ఆమె హర్టయ్యింది… అనుపమ్ చోప్రాకు చెందిన ఫిలిమ్ కంపానియన్ రివ్యూల్ని బాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియాలో ఫిలిమ్ పర్సనాలిటీలు సీరియస్‌గా చదువుతారు… అందులో నెగెటివ్ రివ్యూకు షాక్ తిన్న యామీ తన అసంతృప్తిని బాహటంగానే వెళ్లగక్కింది… (దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్, నటుడు వినోద్ చోప్రా మూడో భార్య ఈ అనుపమ్ చోప్రా… రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ఏజ్, తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఏజ్‌ను పోలుస్తూ, ప్రస్తావిస్తూ చెండాడింది ఈమె తన రివ్యూలో…)…
ఇక యామీకి మద్దతుగా కశ్మీరీ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రితోపాటు పలువురు నెగెటివ్ రివ్యూలను ఖండించారు… క్రిటిక్స్ మాఫియా అని తూలనాడుతున్నారు… ఉద్దేశపూర్వక నెగెటివ్ రివ్యూలు వెలువడుతున్నాయనే హిందీలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది… పొలిటికల్, కేస్ట్ బేస్డ్ ఇంటెన్షనల్ రివ్యూలు ఈమధ్య పాపులర్ తెలుగు వెబ్సైట్లలో చూస్తున్నాం కదా… ప్రత్యేకించి ఆర్ఆర్ఆర్ మీద రీసెంటుగా ఓ సైట్ వరుస నెగెటివ్ స్టోరీలను కుమ్మేస్తోంది…
కాసేపు నిమ్రత్‌ను, యామీని వదిలేస్తే… నిజంగానే సినిమా అంత ఇంప్రెసివ్ ఏమీ కాదు… తీసిపారేసేదీ కాదు… కాకపోతే రొటీన్ తలతిక్క ఫార్ములా సినిమా కాదు… పదవి కోల్పోయిన ముఖ్యమంత్రి పాత్రలో అభిషేక్ బాగానే చేశాడు… కథ కూడా బాగానే ఉంది… ఎటొచ్చీ ఆ దర్శకుడెవరో గానీ (తుషార్ జలోటా..?) ఆసక్తికరంగా ప్రజెంట్ చేయలేకపోయాడు… సరిగ్గా కాన్సంట్రేట్ చేస్తే మున్నాభాయ్ తరహాలో పేలాల్సిన సినిమా ఇది… పలుచోట్ల సిల్లీ ట్రీట్మెంట్తో సినిమా నవ్వులపాలైంది తప్ప, ప్రేక్షకుల్ని పెద్దగా నవ్వించలేకపోయింది… ఓ పర్టిక్యులర్ యాస బాగుంది… మసాలా, వెకిలితనం జోలికి పోలేదు దర్శకుడు, అదీ రిలీఫ్… ఏమోలే… యామీ మీద నెగెటివ్ పబ్లిసిటీ ఏమైనా ఉపయోగపడుతుందేమో..!!
Share this Article