Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆర్ఆర్ఆర్ Vs కేజీఎఫ్2… ప్లస్సులు, మైనస్సులపై ఓ ఇంట్రస్టింగ్ విశ్లేషణ…

April 15, 2022 by M S R

ఆర్ఆర్ఆర్‌తో పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? ఇప్పుడు దేశమంతా క్యాష్ కొల్లగొడుతున్న సినిమాలు ఇవి… ఆల్‌రెడీ ఆర్ఆర్ఆర్ దున్నేసింది… ఇంకా వసూళ్లు సాగుతూనే ఉన్నాయి… ఇప్పుడు కేజీఎఫ్ దండయాత్ర మొదలైంది… బాక్సాఫీసు షేక్ అయిపోతోంది… నిజానికి రెండింటినీ పోల్చడానికి ఇతరత్రా కారణాలున్నయ్…

రెండూ బాలీవుడ్ ఇగోను, వివక్షను, సుప్రిమసీని బద్ధలు కొడుతున్నయ్… బాలీవుడ్ పెళుసు నాణ్యత, డొల్ల భారీతనాల్ని ఎత్తిచూపుతున్నయ్… సౌత్ ఇండియన్ సినిమా కాలర్ ఎగరేస్తున్నయ్… అంతేకాదు, బాలీవుడ్‌ ముట్టడికి మితిమీరిన హీరోయిజాన్ని ఆశ్రయిస్తున్నాయి… హీరోలను అసాధారణ వ్యక్తులుగా, శక్తులుగా చిత్రీకరిస్తున్నయ్… ఆక్రమంలో లాజిక్కులను పాతాళానికి పాతరేస్తున్నయ్…

ట్రిపుల్ ఆర్ చూశాం కదా… అటు రాంచరణ్, అటు జూనియర్… ఏక్‌సేఏక్… ఇక కేజీఎఫ్… ఇక ఇంతకుమించి ఎలివేషన్ ఏం సాధ్యం..? ఇప్పటికే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఎట్సెట్రా సూపర్ నేచురల్ మ్యాన్లను మిక్సీ చేసి, వడగట్టి, చెక్కారు… మోతాదు మరీ మించిపోయింది… సంతృప్త స్థాయి ఇది… ఇంకా దాటితే విరిగిపోవడమే… మితిమీరడంలోనూ అతిమీరడం అంటే కేజీఎఫ్…

Ads

కాకపోతే ఓ థియేటర్ వద్ద ముగ్గురు నలుగురు మిత్రుల నడుమ ఓ సంభాషణ… సారాంశం ఏమిటంటే..? రాజమౌళి గానీ, ప్రశాంత్ నీల్ గానీ… ప్రతి సీన్‌నూ జాగ్రత్తగా చెక్కుతారు… ఓ సీక్వెన్స్ చెడిపోనివ్వరు… సినిమా చివరివరకూ ప్రేక్షకుడికి ఎంగేజ్ చేస్తారు… భారీతనాన్ని ఆవిష్కరిస్తారు… అయితే యశ్‌కు కొన్ని పరిమితులున్నయ్… జూనియర్, రాంచరణ్ డాన్సులు చేయడంలో దిట్టలు… జూనియర్ కామెడీ కూడా బాగా చేయగలడు… ఫైట్స్‌లో కూడా ఓ రిథమ్ ఉంటుంది…

కానీ యశ్…? పైగా లుక్కుపరంగా కూడా యశ్ తీసికట్టే… ప్రత్యేకించి ఆ గడ్డం లుక్కు చీదరగా ఉన్నా సరే, తన పాత్ర కేరక్టరైజేషన్ గాంభీర్యం, క్రౌర్యం, సీరియస్‌నెస్ ముందు ఆ మైనస్ పాయింట్ కొట్టుకుపోయింది… సేమ్, బన్నీ కూడా స్టెప్పులో నంబర్ వన్… మంచి పాటలు పడాలేగానీ ఎక్కడికో తీసుకెళ్లగలడు… అసలు పుష్పలో రియల్ డాన్సర్ బన్నీని చూడనేలేదుగా… ఐనా మంచి పాటలు పడితే, అంటే దమ్మున్న పాటలు పడితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది… కానీ కేజీఎఫ్‌లో పాటలు పెద్ద మైనస్…

ఈ గడ్డాల పైత్యం మరీ ముదిరి ప్రేక్షకుడికి చిరాకు పుట్టిస్తోంది… మహేశ్ బాబు ఒక్కడే మినహాయింపు కావచ్చు… తను అందగాడు కాబట్టి ఈ వెంట్రుకలేమీ లేకపోవడంతో తన కలర్ గట్రా అందంగా ఎక్స్‌పోజ్ అవుతోంది… మిగతా హీరోలందరూ ఈ గడ్డంగాళ్లే అయిపోయారు… మరీ యశ్ లుక్కు తెలుగు టీవీల్లో ఓంకార్ స్టయిల్లో ఓ ఎలపరం…

ఏమాటకామాట… బాహుబలితో పోలిస్తే ట్రిపుల్‌ఆర్ మీద రాజమౌళి సీరియస్‌నెస్ తగ్గింది… పాటలు, సంగీతం, సినిమాటోగ్రఫీ వోకే… కానీ ఈ రేంజ్ సినిమాలకు పంచ్ డైలాగులు ముఖ్యం… ఉదాహరణకు అఖండ… సినిమా మనకు నచ్చకపోయినా సరే… బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలయ్య ఓ సీన్‌లో డైలాగుల్ని ఇరగ్గొట్టాడు… పలుచోట్ల డైలాగులే సినిమాకు బలంగా నిలిచాయి… ట్రిపుల్ ఆర్‌లో మాటల ప్రాధాన్యమే లేదు… డైలాగుల ఇంపార్టెన్స్, ఇంపాక్ట్ రాజమౌళి పట్టుకోలేకపోతున్నాడు…

neel

కేజీఎఫ్-2లో మాటలు రియల్లీ అదుర్స్… డైలాగుల మీద ఎలాంటి వర్క్ జరగాలో ప్రశాంత్ నీల్ కొత్త పాఠాలు నేర్పిస్తున్నాడు… అఫ్‌కోర్స్, అహం తలకెక్కిన మన తెలుగు దర్శకనిర్మాతలు నేర్చుకుంటారని ఏమీలేదు… ‘‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం… ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే కోరుతుంది…’’నా కొడుకు శవాన్ని ఎవరూ మోయనక్కరలేదు… వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకెళ్తాయి…”ఇక్కడ తలలు శాశ్వతం కాదు. కిరీటాలు మాత్రమే శాశ్వతం…’’నెపోటిజం.. నెపోటిజం… నెపోటిజం… మెరిట్ ను ఎదగనివ్వరా…” “నీళ్లలో నుండి నిప్పు పుట్టినట్టు చరిత్ర లేదు, రాఖీ అమ్మ కన్నీటి నుండి పుట్టిన నిప్పు”

అప్పట్లో ఏదో మహేశ్ బాబు సినిమాలో ‘నేనూ వస్తా, నేనే వస్తా’ అనే డైలాగులు తెలుసు కదా… అంతకుమించిన లోతు, గాఢత ఉన్న ఓ డైలాగ్… కేజీఎఫ్‌లో భార్య తను తల్లి కాబోతున్నాను అని చెప్పే సీన్… ఆ సీన్‌లో భర్తతో భార్య చెప్పే డైలాగ్…. ”అమ్మ వస్తోంది…” రెండే పదాల్లో అనంత అర్థం…

ఆర్ఆర్ఆర్ నిర్మాణ వ్యయం 400 కోట్లపైమాటే… (వాళ్లు చెబుతున్న ఫిగర్)… కానీ కేజీఎఫ్‌ను 100 కోట్లతో అంతకుమించిన ఇంపాక్ట్‌ఫుల్‌గా తీశారు… రెండు సినిమాల్లో మరో సిమిలారిటీ… చిల్లర కామెడీని పెట్టి సినిమాల్లో సీరియస్‌నెస్ చెడగొట్టలేదు… పుష్పలో కొన్ని వెగటు సీన్లున్నయ్… సుకుమార్ రేంజ్, అనగా స్థాయి అది… దాన్నెవడూ మార్చలేడు… విజయం వేరు, అభిరుచి వేరు… అది తెలిస్తే సుకుమార్ అనబడడు… ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ విషయానికొస్తే… మరొకటుంది… వాట్ నెక్స్ట్..?

ఈ అతిమీరిన హీరోయిజం చాన్నాళ్లు నడుస్తుందా..? ఇది అడ్డగోలుగా విరిగిపడుతుందా..? ప్రభాస్‌తో తీయబోయే సాలార్ చెప్పబోతోంది ఆ ఫలితం ఏమిటో… మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా చెప్పబోతోంది… ఎందుకంటే… ఇదే తరహాలో కేవలం సూపర్ హీరోయిజాన్ని నమ్ముకుంటే మాత్రం వలిమై, బీస్ట్ సినిమాల్లాగా బోల్తాకొట్టడమే… రాజమౌళి, ప్రశాంత్ నీల్… ఇద్దరూ సౌత్ సినిమాను ఓ కూడలిలో నిలిపారు… ఇక ఎటువైపో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions