బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం ముగిసింది… ప్రస్తుతం పనిచేస్తున్న సాక్షి టీవీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయాడు… తనే వదిలేశాడు… ప్రస్తుతం గరం గరం వార్తలకు ప్రధాన పాత్రధారి తనే… (చల్లబడిండు)… రాబోయే చిరంజీవి సినిమాలో ఓ పాత్ర దక్కింది, మరికొన్ని సినిమా చాన్సులు కూడా వస్తున్నాయి… ఇక తన అదృష్టాన్ని పూర్తిగా సినిమాల్లోనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు… మరీ నిరాశాజనకంగా ఉంటే సొంత యూట్యూబ్ వీడియోలు…
బిత్తిరి సత్తి… అసలు పేరు చేవెళ్ల రవి… అంతకుముందు ఏవేవో చిన్నాచితకా చానెళ్లలో అనామకపు ప్రోగ్రాముల్లో చేసిన సత్తికి వీ6 తీన్మార్ న్యూస్ లైఫ్ ఇచ్చింది… తనదైన ఓ యాస, అమాయకపు పాత్ర… దాంతో ఇంటింటికీ పరిచయం అయ్యాడు… తరువాత టీవీ9… అక్కడా ఇమడలేక పోయాడు… వదిలేశాడు… లేదా వదిలేయబడ్డాడు… అక్కడి నుంచి సాక్షి టీవీకి వెళ్లాడు…
కానీ ఏ టీవీలో చేరినా, ఏం చేసినా సరే… సత్తి అంటే తీన్మార్… మధ్యలో తుపాకిరాముడు అనే సినిమా కూడా చేసినట్టున్నాడు… కొన్ని సినిమాల్లోనూ చిన్నాచితకా పాత్రలు కూడా చేశాడు… తన దృష్టి అంతా సినిమాలే… టీవీ9, సాక్షి టీవీల్లో చేరేముందు, తన ప్రైవేటు ఫంక్షన్లు, సినిమాలకు ఢోకా లేకుండా ముందే మాట్లాడుకున్నాడు… తన సర్కిల్ పెరిగింది… వచ్చీపోయే సినిమా సెలబ్రిటీలు, పరిచయాలు, మొహమాటాలు సత్తికి కలిసొచ్చాయి…
Ads
ఐతే ఒకరకంగా సత్తి భాష, వేషం, మ్యానరిజం మొనాటనీ అయిపోయింది… ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది… ఇది తనకూ అర్థమైంది… అందుకే దారి మార్చుకున్నాడు… ధైర్యం చేశాడు… జగనన్నకూ బైబై అనేశాడు… అంటే సాక్షి టీవీకి అని అర్థం… ఇకపై సినిమాలే ప్రపంచం అన్నమాట… ఇక తను ఓ ఫిక్స్‌డ్ టీవీ ఫార్మాట్లో ఇమడటం కష్టం… కష్టమైనా, నిష్ఠురమైనా పెద్ద తెర మీదే అటో ఇటో తేల్చేసుకోవడం… ఆల్ ది బెస్ట్ సత్తీ… సినిమాల్లో డిఫరెంట్ కేరక్టర్లు ట్రై చేయి, చేయగలవు… ఆ సత్తి అనే ఆ రొటీన్ ఫార్మాట్ నుంచి అర్జెంటుగా బయటపడితే కమెడియన్‌గానే కాదు, కేరక్టర్ ఆర్టిస్టుగానూ నిలదొక్కుకోగలవ్… అదీ సంగతి…!! శుభాకలెక్షన్లు…!!
Share this Article