Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమెరికా అనగానే వినయంగా చేతులు కట్టుకునే ఆ పాత ఇండియా కాదు..!!

April 16, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి ………… EAM జై శంకర్ ! మన విదేశాంగ శాఖ మంత్రి ! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ని చూసి నేర్చుకోవాలి అనేంతగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి జై శంకర్ గారు. చైనా, రష్యా, అమెరికా, యూరోపు ఇలా అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా తన సమాధానాలతో సంతృప్తిపరచగలడు లేదా అదే సమయంలో ధీటుగా సమాధానం ఇవ్వగలడు…

 

రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనవద్దు అంటూ US స్టేట్ ఆఫ్ సెక్రటరీ అయిన అంటోనీ బ్లిన్‌కెన్ ని న్యూడిల్లీ పంపించింది అమరికా ! ముఖాముఖీ చర్చల అనంతరం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించినా మీరు ఎందుకు క్రూడ్ ఆయిల్ కొంటున్నారు అని అడిగాడు… దానికి జవాబుగా జై శంకర్ గారు జవాబు… ‘‘మేము మా అవసరాల కోసం కొనే క్రూడ్ ఆయిల్ రెండు నెలలకి సరిపోతుంది కానీ యూరోపు అదే మొత్తం ఆయిల్ ని ఒక పూటలో కొంటున్నది రష్యా నుండి !’’… విలేఖరితో పాటు అక్కడే ఉన్న బ్లింకెన్ ముఖం మాడిపోయింది. జై శంకర్ నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఊహించని అమెరికన్ విలేఖరి విస్తుపోయాడు ! ఇదివరకు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయి కానీ అమెరికన్ మీడియాకి మన ప్రతినిధులు చాల సౌమ్యంగా సమాధానం ఇచ్చేవారు వినయంగా ఎందుకంటే అది అమెరికా కదా ? యూరోపు మాత్రం తమ అవసరాలని ఒదులుకోలేదు కానీ అవతలి వాళ్ళు వాళ్ళ అవసరాలని ఒదిలేసుకోవాలి వీళ్ళని సంతృప్తి పరచడం కోసం !

Ads

సాధారణంగా మాట వినని దేశాల మీద అమెరికా ప్రయోగించే మరో అస్త్రం పేరు మానవహక్కుల ఉల్లంఘన ! ఆ పేరుతో ఏదో విధంగా ఆంక్షలు విధించడం పరిపాటి ! ఈసారి కూడా అంటోని బ్లిన్కెన్ అదే అస్త్రాన్ని ప్రయోగించాలని చూశాడు. భారత్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు బ్లింకెన్… కానీ జై శంకర్ గారు బీ ఫిట్టింగ్ రిప్లై ఇచ్చాడు: మానవ హక్కులు అనేవి ఏదో కొన్ని దేశాలకి పరిమితం కాదు, అన్ని దేశాలలోనూ జరుగుతున్నాయి, కానీ ఆ సంఘటనల వెనుక వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు, అయితే భారత దేశం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. మానవ హక్కుల మీద భారత్ కి మంచి అవగాహన ఉంది కూడా ! అమెరికాలో కూడా మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి అది మేము గమనిస్తున్నాము అని జవాబు ఇచ్చాడు జై శంకర్ గారు.

usa

జై శంకర్ గారి మాటల వెనక ఉన్న మర్మం ఏమిటో బ్లింకెన్ కి బాగానే అర్ధమయ్యింది… ఎందుకంటే గత 10 రోజుల వ్యవధిలో న్యూయార్క్ నగరంలో వరుసగా ఇద్దరు సిక్కుల మీద దాడులు జరిగాయి. ఇద్దరినీ బాగా కొట్టి వాళ్ళ దగ్గర నుండి డబ్బుతో పాటు ఖరీదయిన వాచీలు దోపిడీ చేసారు ! పరోక్షంగా జై శంకర్ గారు ఈ ఘటనలనే బ్లింకెన్ ముందు ప్రస్తావించారు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ విదేశాంగ మంత్రి కూడా ఈ విధంగా దీటుగా మొఖం మీద కొట్టినట్లు సమాధానం ఇవ్వలేదు అమెరికాకి ! నల్లజాతి వాళ్ళ మీద చూపిస్తున్న జాతి వివక్ష వల్లనే కదా పోయిన సంవత్సరం అమెరికా అట్టుడుకి పోయింది ? వీళ్ళు ఎవరికీ సుద్దులు చెప్తున్నారు ?

ఇంతకీ EAM జై శంకర్ గారు ఎవరు ? ఎందుకింత ప్రాముఖ్యత ఇస్తున్నారు మోదీ ? Dr. జై శంకర్ గారు జపాన్ దేశానికి చెందిన క్యోకో [Kyoko] అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి ధ్రువ మరియు అర్జున్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు మరియు మేధా అనే కుమార్తె ఉన్నది… జై శంకర్ గారు K.సుబ్రహ్మణ్యం అనే మాజీ IAS ఆఫీసర్ కుమారుడు. సుబ్రహ్మణ్యం గారు మన దేశ అణు విధానానికి రూపకర్త, సిద్ధాంత కర్త… అణు విద్యుత్ రంగానికి మన దేశం తరుపున రాయబారిగా వ్యవహరించిన మేధావి. తన బాచ్ లో టాపర్ కూడా !

jaisankar

జై శంకర్ గారికి తమిళ, హిందీ, ఇంగ్లీష్, రష్యన్, జపనీస్, చైనీస్ భాషలలో ప్రావీణ్యం ఉంది. హంగేరియన్ భాషలో ప్రవేశం ఉంది. IFS ఆఫీసర్ అయిన జై శంకర్ గారు మొదటగా 1977 లో సర్వీసులో జాయిన్ అయ్యారు. 1979 నుండి 1981 వరకు అప్పటి సోవియట్ యూనియన్ లో ‘‘indian మిషన్ to సోవియట్ యూనియన్’’లో మొదట మూడవ సెక్రటరీగా తరువాత రెండవ సెక్రటరీ గా పనిచేసారు.. భారత్ తరుపున.ఆ కాలంలోనే రష్యన్ భాష నేర్చుకున్నారు జై శంకర్ గారు.

తరువాత న్యూ డిల్లీ వచ్చి అప్పటి ప్రముఖ దౌతవేత్త అయిన గోపాలస్వామి పార్ధసారధి గారి దగ్గర అండర్ సెక్రటరీగా పనిచేసారు అదీ అమెరికా డివిజన్ ఆఫ్ ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టేర్నల్ అఫైర్స్ [Americas division of India’s Ministry of External Affairs] లో… నేరుగా అమెరికా వ్యవహారాల మీద అన్నమాట… గోపాలస్వామి పార్ధసారధి గారి టీమ్ లో ఉంటూ అమెరికా మన దేశంలోని తారాపూర్ అణు విద్యుత్ కేంద్రానికి కావాల్సిన అణు ఇంధనాన్ని సప్లై చేయడానికి గాను జరిగిన ఒప్పందంలో పనిచేసారు.

1985 to 1988 వరకు అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో first సెక్రటరీ గా పనిచేసారు. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత జై శంకర్ గారి పని తీరు మరియు అతనికి ఉన్న బహు భాషా పరిజ్ఞానం దగ్గర నుండి చూసిన తరువాత ఒక indian ఫారిన్ సర్వీస్ అధికారిని నేరుగా భారత విదేశాంగ మంత్రిగా నియమించారు మోడీ గారు. మోదీ నిర్ణయం వమ్ము కాలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జై శంకర్ గారి పేరు దౌత్య వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది అంటే దాని వెనుక జై శంకర్ గారికి మోదీజీ ఇచ్చిన స్వేచ్చ కూడా ఒక కారణం…. అయితే ఇచ్చిన బాధ్యతని తన శక్తి మేరకు నిర్వహిస్తున్న జై శంకర్ గారి నిర్విరామ కృషి కూడా ఉంది.

ఇప్పుడు అర్ధమవుతున్నదా ? పుతిన్ తో నేరుగా రష్యన్ భాషలోనే మాట్లాడగలరు జై శంకర్ గారు, అలాగే చైనా విదేశాంగ మంత్రితో మాండరిన్ భాషలో మాట్లాడగలరు, అలాగే జపాన్ ప్రధాని లేదా జపాన్ విదేశాంగ మంత్రితో నేరుగా జపనీస్ భాషలో మాట్లాడగలరు… సుదీర్ఘకాలం భారత్ తరుపున వివిధ దేశాలలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవంకి తోడు తన తండ్రి అయిన మాజీ IAS అధికారి సుబ్రహ్మణ్యం గారి శిక్షణతో పాటు అప్పట్లో ప్రముఖ దౌత్యవేత్త అయిన గోపాలస్వామి పార్థసారథి గారి శిష్యరికం… వెరసి నేటి జై శంకర్ గారు అన్నమాట !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions