నిన్న సోషల్ మీడియాలో కనిపించిన ఓ చిన్న వీడియో బిట్ కాస్త విస్మయాన్ని కలిగించిన మాట వాస్తవం… ఈ విస్మయంలో వ్యతిరేక భావన లేదు… కాస్త అభినందన భావనే… వీడియో విషయం ఏమిటంటే..? తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన మాజీ మంత్రివర్గ సహచరుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించాడు… కుటుంబసభ్యులతో కాసేపు గడిపి, బొజ్జల త్వరగా కోలుకోవాలంటూ ధైర్యం చెప్పాడు…
సో వాట్..? ఓ సీనియర్ నాయకుడు, తనతోపాటు నడిచినవాడు, తన కేబినెట్‌లో పనిచేసినవాడు తీవ్ర అస్వస్థతతో ఉంటే, వెళ్లి పరామర్శిస్తే అందులో ఆశ్చర్యం ఏముందీ అంటారా..? ఉంటుంది… సాధారణంగా చంద్రబాబు ప్రతి అడుగుకు, ప్రతి మాటకు, ప్రతి కదలికకు ఓ లెక్క ఉంటుంది… తనతో చాలాకాలం సన్నిహితంగా మెదిలిన వాళ్లు కూడా చెప్పేమాట… ‘‘వాడుకుని వదిలేసేరకం’’…
ఒక మనిషి తనకు ఇక అక్కర్లేదు అనుకుంటే, అప్పటిదాకా తనకెంత సన్నిహితుడైనా సరే వదిలేస్తాడని తనకున్న పేరు… ఇప్పుడు బొజ్జల వయోవృద్ధుడైపోయాడు… మాట లేదు, కదల్లేడు, మనుషుల్ని గుర్తుపట్టలేడు… అప్పట్లో అలిపిరిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో చంద్రబాబుతోపాటు బతికి బయటపడిన వారిలో బొజ్జల కూడా ఉన్నాడు… అప్పట్లో బాగానే గాయాలయ్యాయి కూడా… మొన్నామధ్య కరోనా… ఏదో ఆపరేషన్…
Ads
హాస్పిటల్ వెళ్లి మరీ చంద్రబాబు మొన్నటి మార్చిలో బొజ్జలను పరామర్శించి ధైర్యం చెప్పాడు… చేతులు జోడించిన బొజ్జల మొహాన్ని చూస్తే జాలేసింది… ఈ వీడియో చూడండి…
ఇక్కడ చంద్రబాబును అభినందిస్తున్నాను… తన సహజతత్వానికి భిన్నంగా మొన్నటి మార్చిలో ఒకసారి, నిన్న మరోసారి వెళ్లడం నచ్చింది… బొజ్జల శ్రీకాళహస్తి నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యే… మంత్రి… తండ్రి కూడా అక్కడే ఎమ్మెల్యేగా గెలిచాడు… బొజ్జల భార్య బృంద కూడా కాంగ్రెస్‌కు చెందిన ఓ మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కూతురు… బొజ్జల కొడుకు శ్రీధర్ కూడా టీడీపీ లీడర్… రాష్ట్ర విభజన అనంతరం మంత్రివర్గంలోకి బొజ్జలను తీసుకున్న చంద్రబాబు ఎందుకో వయోభారం, అనారోగ్యం సాకులను చూపి 2017లో మంత్రిగా తొలగించాడు…
https://www.youtube.com/watch?v=oB9t2FQMYKw
దీంతో బొజ్జల హర్టయ్యాడు… చంద్రబాబు తన నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తూ స్పీకర్‌కు లేఖ పంపించాడు… అసలు ఇవన్నీ కాదు చెప్పుకోవల్సింది… నిజానికి బొజ్జల తన బాస్ చంద్రబాబుకన్నా తెలంగాణ సీఎం కేసీయార్‌కు బాగా దగ్గర… చంద్రబాబుతో బొజ్జలకు పార్టీ సంబంధం… పైగా చంద్రబాబు తన క్లోజ్ సర్కిల్‌లోకి ఎవరినీ రానివ్వడు… కానీ బొజ్జల, కేసీయార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మండవ వెంకటేశ్వరరావు తదితరులు సరదాగా సాయంత్రం భేటీలు వేసేవారని చెబుతుంటారు… అంతటి స్నేహితుడు బొజ్జలను కేసీయార్ వెళ్లి పరామర్శించాడా..? ఏమో… ఫోటో, వీడియో, వార్త చూసినట్టయితే గుర్తులేదు… మీరు ఏమంటారు ఆంధ్రజ్యోతి ఆర్కే సాబ్..?!
Share this Article