Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నువ్వు అసాధ్యుడివిరా బాబూ… ఆ కొత్త మెరుపులూ ఉన్నాయా బుర్రలో..?!

April 16, 2022 by M S R

నో డౌట్… కేజీఎఫ్ తరంగ ఉధృతి ఇప్పట్లో తగ్గదు… లేకపోతే ఓ కన్నడ హీరో డబ్బింగ్ సినిమా తమిళనాట అర్ధరాత్రి దాటాక కూడా ప్రత్యేక షోలు వేయించుకోవడం ఏమిటి..? ఇక తెలుగులోనైతే స్ట్రెయిట్ సినిమాలాగే నడుస్తోంది… కన్నడం వదిలేయండి… హిందీలో కూడా హిట్… అనేక రికార్డులు బద్దలయ్యేట్టుగానే ఉంది… మొన్న మనం చెప్పుకున్నాం కదా… ప్రశాంత్ నీల్ సింపుల్‌గా చెప్పాలంటే ఓ పది తలల రాజమౌళి…

మరొకటీ చెప్పుకున్నాం… కేజీఎఫ్-2ను మించి ఒక హీరోను ఇంకా ఇంకా సూపర్ డూపర్ హీరోయిజంతో చూపించడం ఎలా..? కేజీఎఫ్-2లోనే ఓ రేంజుకు తీసుకుపోయాడు… సినిమా ప్రేమికులకు ఈ అతిమీరినతనం కొంత నచ్చకపోవచ్చు… కానీ సగటు ప్రేక్షకుడు విజిల్స్ వేశాడా, చప్పట్లు కొట్టాడా, టికెట్లు తెగాయా, వందల కోట్లతో బాక్సాఫీసు బద్ధలైపోయిందా… ఇదే ముఖ్యం సినిమాలకు… ఎందుకంటే, సినిమా అనేది అతి పెద్ద దందా…

kgf

Ads

ఓ ప్రచారం స్టార్టయింది… కేజీఎఫ్-2 చివరలో కేజీఎఫ్-3 సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు దర్శకుడు… సో, అదెలా ఉంటుందనేది తాజా ఊహాగానాలు… రాధేశ్యామ్‌తో బాదించుకున్న, బాధించుకున్న ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తీసే ‘సలార్’ మీద ఆశలు పెట్టుకున్నాడు… తనకూ ఓ అల్టిమేట్ రేంజ్ హీరోయిజం బాపతు సినిమా కావాలిప్పుడు… కానీ కేజీఎఫ్-2ను మించి ఏం చూపించాలి..? ప్రభాస్‌ను ఎలా చూపించాలి..? సరే, ఏదో తీస్తాడు… సలార్ సీక్వెల్ కూడా తీస్తాడు సరే…

మరి కేజీఎఫ్-3 ఎలా ఉండాలి..? మార్వెల్స్ ఎవెంజర్స్: ఎండ్‌గేమ్, ఇన్ఫినిటీ వార్… అంటే విశ్వంలోని సూపర్ హీరోలందరూ కలిసి థానోస్‌తో పోరాడతారు కదా… అలా మరో సూపర్ శక్తిని క్రియేట్ చేసి.., ప్రభాస్, యశ్‌ కథలను కలిపేసి, కబడ్డీ ఆడించాలా..? ఆ క్రాసోవర్ ఆచరణ సాధ్యమేనా..? మరి మధ్యలో జూనియర్ సినిమా ఏమైపోవాలి..? ఆల్‌రెడీ ప్రశాంత్ మదిలో ఏదో కథ ఉంది… అందుకే కేజీఎఫ్-2 చివరలో రాకీ షిప్పులను అమెరికన్, ఇండోనేషియన్ అధికారులు వేటాడుతున్నట్టు, అమెరికా ఏకంగా ఇండియా ప్రధానికి ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తుంది… సరే, ఇదంతా కాసేపు వదిలేస్తే…

kgf

టెక్నికల్ టీంతో హైస్టాండర్డ్స్ తీసుకోవడం ఎలాగో కేజీఎఫ్-2 చూపించింది… బీజీఎం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఎట్సెట్రా… అలాగే టెక్నాలజీని ఎలా వాడుకోవాలో కూడా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు… అదే డీసీటీ… హాలీవుడ్‌లో కొంతమేరకు వాడుతున్నదే… డార్క్ సెంట్రిక్ థీమ్… ఇప్పటివరకూ ఇండియన్ సినిమా అడాప్ట్ చేసుకోలేదు… ఈ టెక్నాలజీతో తెర మీద ఆవిష్కృతమయ్యే డార్క్ షేడ్ విజువల్స్ సీన్ల ఇంటెన్సిటీని మరింత పెంచుతాయి… హారర్, క్రైమ్, యాక్షన్ సినిమాలకు సూపర్…

సోషల్ మిత్రుడు Gopi G Vihari ఏమంటాడంటే..? ‘‘కె.జి.ఎఫ్-2 నిజానికి టెక్నికల్‌గా హాలీవుడ్ సినిమా… రాకీ భాయ్ పాత్ర జంజీర్‌లో అమితాబ్ చేసిన డెభ్బైల నాటి angry young man విజయ్ లాంటి పాత్రే… కథ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అంతర్గత కలహాల్లోకి అండర్ డాగ్ గా ఎంటరైన హీరో అండర్ వరల్డ్ డాన్ గా ఎలా ఎదుగుతాడో చెప్పే పాత కథే… కాకపోతే కేజీఎఫ్ ఆ పాత కథకే ప్రజెంట్ ప్రజెంటేషన్… ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్ కి ఇవి పాన్ ఇండియా వెర్షన్స్…

సాధారణంగా మోనోటోన్‌లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు వున్న కె.జి.ఎఫ్ లాంటి సినిమాలు బోర్ కొట్టే అవకాశం వుంది… కానీ ప్రశాంత్ నీల్ తన స్క్రీన్ ప్లేని multiple point of views తో parallel voice over narratives తో నడపడం ద్వారా ఆ ప్రమాదాన్ని తప్పించాడు… దీంతో అరాచకం uninterrupted adrenaline rush కి దారితీసింది… నాచురల్ లైటింగ్ తో పాటు shaky hand held camera movements విజువల్స్ ని రియలిస్టిక్ గా మార్చాయి.. పాత్రల అంతరంగాల్ని, సంధర్బాల వైరుద్యాల్ని brevity of dialogue తో బుల్లెట్ పాయింట్స్ లా పేల్చారు. ఫిల్మ్ మేకింగ్ మీద ఇంత పట్టు సాధించిన ప్రశాంత్ నీల్ ఈసారి సరికొత్త వైరుధ్యాలున్న భిన్నమైన కధలు ఎంపిక చేసుకుంటే చూడాలని ఆశ…’’

ప్రశాంత్ ఇండియన్ సినిమాను ఏదో కొత్తలోకాల వైపు తీసుకుపోతున్నట్టున్నాడు… నువ్వు అసాధ్యుడివిరా బాబూ…!! చెప్పనే లేదు కదూ… KGF లో మాటలు తూటాల్లాగే పేలాయి కదా… అందులో చాలావరకు యశ్ రాసుకున్నవే అట… దర్శకుడే చెప్పాడు… అంతే కాదు, పెగ్గేస్తే తప్ప తన కలం కదలదు అని కూడా చెప్పాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions