‘‘డాక్టర్ కాబోయి యాక్టరయ్యాను… ఏదో డాన్స్ ప్రోగ్రాంలో చూసి ఆ దర్శకుడు తన సినిమాలో హీరోయిన్‌గా చేయాలని వెంటబడ్డాడు… మా ఫ్యామిలీ ఫోటో ఎక్కడో చూసి ఆ నిర్మాత నేరుగా ఇంటికొచ్చి, సినిమా చేస్తావా అనడిగాడు…’’ ఇలాంటి డాంబికాలు చాలామంది హీరోయిన్లు చెప్పినవే… మనం నవ్వుకున్నవే… సినిమా చాన్సుల కోసం ఒక్కొక్కరూ ఏం చేస్తారో, అవన్నీ పాకుడురాళ్లు… సరే, పోనీ… కేజీఎఫ్‌లో ప్రధాని పాత్ర పోషించిన, అలనాటి దిల్ దా ధడ్కన్ రవీనా టాండన్ మాత్రం నిజాయితీగా తన పాత వృత్తి ఏమిటో చెప్పుకొచ్చింది… నచ్చింది… ఆమె చెప్పడంలో తప్పేముంది..?
‘‘నేను ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్‌గా చేశాను… స్టూడియో ఫ్లోర్స్ క్లీన్ చేసేదాన్ని… ఎవరైనా వాంతులు చేసుకున్నా సరే కడిగాను, తుడిచాను… అసలు సినిమాల్లోకి రావాలని లేదు… నాకు అంత సీన్ లేదు కూడా… కానీ అనుకోకుండా మోడల్ అయ్యాను, సినిమాల్లో చాన్సులు వచ్చాయి…’’ అని చెప్పుకొచ్చింది… భేష్…
Ads
నిజానికి ఈమె గురించి కాసేపు పక్కన పెడితే… రాఖీభాయ్ తల్లిగా చేసిన అర్చన్ జూయీస్ పేరు మారుమోగిపోతోంది… ఆ పాత్రే కేజీఎఫ్ సినిమాకు కీలకం… ఆమె బాగా నటించింది కూడా… యశ్‌లాగే ఆమె పుట్టింది కూడా హసన్‌లోనే… సేమ్.., యశ్, ఆయన భార్య రాధికా పండిట్‌లాగే అర్చన కూడా సీరియల్ నటి ఒకప్పుడు… చాలామంది ఆమె గురించి చాలా వివరాలు రాసుకొచ్చారు… కానీ ఈనాడు వసుంధరలో ఆమెకు మరో కోణం రాశారు… బాగుంది…
అర్చన స్వతహాగా నాట్యకారిణి… చిన్నప్పటి నుంచే నాట్యంలో శిక్షణ తీసుకుంది, ఇంటర్ చదివేనాటికే బోలెడన్ని ప్రదర్శనలు ఇచ్చింది… మామూలు డిగ్రీ చదివితే తన నాట్యశిక్షణకు, సాధనకు అడ్డంకి అని భావించి బెంగళూరులోనే నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది… మూడేళ్ల గ్రాడ్యుయేట్ కోర్సు అది…
మహాదేవి సీరియల్ కోసం ప్రొడక్షన్ టీం ఈ కాలేజీకి వచ్చింది… ఆడిషన్స్ జరిగాయి… అర్చన డైలాగులను సరిగ్గా చెప్పడంతో ఆమెను తీసుకున్నారు… సీరియల్స్ చేస్తోంది… కానీ ఆమె అందులోనే పూర్తిగా మునిగిపోలేదు… చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ చేసింది… సీరియల్స్ వరకూ వోకే, కానీ సినిమాల మీద పెద్దగా ఇంట్రస్టు లేదు… నా దృష్టి, నా లక్ష్యం వేరు… అందుకే మొహమాటంతోనే కేజీఎఫ్ పాత్ర అంగీకరించాను…
టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద అధ్యయనం చేస్తున్నా… ఆ శిల్పాలు, ఆ భంగిమలు, వాటి ప్రత్యేకత, ఇవన్నీ టచ్ చేస్తూ ఓ నృత్యరూపకం చేయాలని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీ ప్రయత్నం… అసలు కేజీఎఫ్‌కన్నా ముందే నాకు మా చుట్టం శ్రేయస్‌తో పెళ్లయిపోయింది… కానీ నా నాట్యం ఏమీ ఆగలేదు… డాన్స్ నా ఫస్ట్ ప్రయారిటీ… అఫ్‌కోర్స్, మంచి పాత్రలు అనేవి కూడా నా టార్గెట్స్ ఇప్పుడు…’’…. ఇలా చెబుతోంది ఆమె… బాగుంది… తన ఒరిజినల్ ఇంట్రస్టును ఆమె పణంగా పెట్టలేదు… తన టార్గెట్స్ లిస్టు నుండి తీసిపారేయలేదు… నాట్యం మీద తన ప్రేమను, తన వర్క్‌ను చక్కగా ఎక్స్‌ప్రెస్ చేసింది..!! కేజీఎఫ్ టీంలోకి ఎంపిక, ఆ కేరక్టర్లు, ఆ మనుషులు అందరూ డిఫరెంటే సుమీ…!!
Share this Article