Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరి ఈ తప్పుకు ఎవరిని శిక్షించాలి..? హోం మంత్రి చెబితేనే బెటర్…!!

May 3, 2022 by M S R

గత సంవత్సరం జూలై వార్త… అత్యాచార బాధితుల పేర్లు, వివరాలు బయటపడకుండా జాగ్రత్తవహించాలని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది… దిగువ కోర్టులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని హెచ్చరించింది… నేరుగా గానీ, పరోక్షంగా గానీ లైంగిక దాడి బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదని ఐపీసీ 228ఏ చెబుతోందనీ, దాన్ని పాటించాలని సూచించింది… 



228A. Disclosure of identity of the victim of certain offences etc..

Whoever prints or publishes the name or any matter which may make known the identity of any person against whom an offence under section 376, section 376A, section 376B, section 376C or section 376D is alleged or found to have been committed (hereafter in this section referred to as the victim) shall be punished with imprisonment of either description for a term which may extend to two years and shall also be liable to fine.

Ads



అర్థమైంది కదా… బాధితురాలిని గుర్తించేలా ఎలాంటి కంటెంటు పబ్లిష్ చేయకూడదు… చేస్తే చట్టరీత్యా నేరం… సరే, పొద్దున్నే చాలా పత్రికల్లో ఓ వార్త, ఫోటోలు కనిపించాయి… మొన్న రేపల్లెలో జరిగిన దుర్మార్గమైన అత్యాచార ఘటనకు సంబంధించి ఏపీ హోం మంత్రి తానేటి వనిత బాధితురాలి కుటుంబాన్ని కలిసింది… పరామర్శించింది… మంత్రి సురేష్, మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా ఆమెతో ఉన్నారు…

ఫోటోల్లో ఆ కుటుంబసభ్యుల మొహాలు కనిపిస్తున్నాయి… ఆ ప్రాంతమంతా ఇదే చర్చ, ఇదే రచ్చ… లైంగిక దాడి బాధితురాలికి ఇది ఇంకా నరకయాతన… మరి 228ఏ సెక్షన్ ప్రకారం సాక్షి సహా ఈ ఫోటోలు, వార్తలు ప్రచురించిన వాళ్లపై కేసులు పెట్టొచ్చా..? మా తప్పేమిటి..? ఆమె హోం మంత్రి, ఆమెకు తెలియదా..? పైగా వెంట మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ ఉంది, ఆమెకు తెలియదా..? జరిగింది రిపోర్ట్ చేస్తున్నాం అని మీడియా అంటుందేమో… కానీ ఆ ఫోటోలు పబ్లిష్ చేయాలనే సోయి లేకుండా పోయిందా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు..?!

228A

మరిక్కడ ఎవరిని తప్పు పట్టాలి… నైతికంగా, చట్టపరంగా ఓ బాధితురాలి ఉనికిని రహస్యంగా ఉంచాలనే సోయి, బాధ్యత తెలియని ప్రజాప్రతినిధులను ఏమనాలి..? పైగా ఆ ఐపీసీని గౌరవించాల్సిన పోస్టుల్లో ఉన్నవాళ్లు… మహిళ కమిషన్ బాధ్యులు… ఇక్కడ మరో సమస్య… ప్రతిపక్షం దీన్ని కూడా విమర్శించలేదు… ఎందుకంటే… ప్రభుత్వపక్షాన్ని తూర్పారబట్టడానికి ఓ చాన్స్ దొరికింది కదాని అత్యుత్సాహంతో రాజకీయం చేయడానికి ప్రయత్నించింది తెలుగుదేశమే…

ప్రభుత్వపక్షానికి అంతకన్నా సోయిలేదు, దాన్ని కౌంటర్ చేయబోయి, మరింత రచ్చ చేసుకుంటోంది… ఏపీలో అంతే… ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను పరిహారం ఇవ్వడాన్ని ఫోటోలతో ప్రచారం చేసుకోవాలా..? అధికార పటాటోపంతో అక్కడికి వెళ్లి పబ్లిసిటీ కోరుకోవాలా..? వాళ్లకు చట్టప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, కానీ అధికారులు కూడా ఆ పనిచేయగలరు… దానికి ఫోటోలు, వార్తలు అవసరం లేదు… నిజానికి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఆ నీచమైన సంఘటన మీద ఇంకా మెరుగైన స్పందన ప్రభుత్వపక్షం నుంచి ఉందా..?

బాధితురాలి భర్త రైల్వే పోలీసుల దగ్గరకు వెళ్లి బతిమిలాడినా, అరిచినా, మొత్తుకున్నా ఒక్కడూ స్పందించలేదు… ఇది అత్యాచారంకన్నా హేయం… మన దురదృష్టం కొద్దీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోతే, స్పందించకపోతే ఎవరూ శిక్షంచలేరు… అసలు రైల్వే పోలీసుల పనే రక్షణ… అది మరిచి, ఆ క్షణంలో సదరు పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యం శిక్షార్హం… అసలు ముందుగా శిక్షించాల్సింది వాళ్లనే…

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు కనీసం ఫిర్యాదు చేశారా..? పోనీ, ఏదో ఓ సెక్షన్ల కింద ముందుగా వాళ్ల మీద కేసులు పెట్టండి… అలాంటోళ్లను శిక్షిస్తేనే కదా, అన్నిచోట్ల కదలిక, బాధ్యత, భయం కనిపించేది… ఇవన్నీ చేయకుండా… మేం స్పందించాం, నిందితులను పట్టుకున్నాం, ఇదుగో పరిహారం అని బాధితురాలి ఉనికి బయటపడేలా చట్టవిరుద్ధంగా, అనైతికంగా వ్యవహరించడం సరికాదు… తెలుగుదేశం లీడర్లకు బుద్ధిలేదు, నైతికత లేదు, సరే… మరి మనం ఏమైనా భిన్నంగా ఉన్నామా..? అదీ అధికారంలో ఉండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions