Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవి సరిపోలేదు..! సర్కారువారి పాట తేడా కొట్టేయడానికి ఏమేం కారణాలు..?!

May 12, 2022 by M S R

సరిపోలేదు… మహేష్ బాబు సూపర్ లుక్, గతంకన్నా భిన్నంగా సరదా స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, సరదా డైలాగ్స్ సరిపోలేదు… 46 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలాగా కొత్తకొత్తగా కనిపించడం బాగుంది, కానీ సరిపోలేదు… కీర్తి సురేష్ స్లిమ్‌గా ఉంది, అందంగా ఉంది, మాస్ అప్పీల్ ఉంది, మహేష్‌తో కెమిస్ట్రీ బాగుంది… స్టెప్పుల్ని ఇద్దరూ ఇరగదీశారు… కానీ సరిపోలేదు… కళావతీ, మ మ మహేష్ పాటలు అదరగొట్టాయి, కానీ సరిపోలేదు…

కేవలం ఫార్ములా, ఇమేజ్ వదలని ట్రీట్‌మెంట్ ఈరోజుల్లో సరిపోతాయా..? సరిపోవు… అందుకే సర్కారువారిపాటకు ఇవేవీ సరిపోలేదు… ఐనా సినిమాలన్నీ పుష్ప, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ సినిమాల్లాగా సూపర్ హిట్ కావాలనేముంది..? కానీ కథలో ఇంటెన్సిటీ అవసరం… ఆ ట్రెండ్ పట్టుకోలేదు దర్శకుడు పరుశురాం… ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ సినిమాల్లో రొమాన్స్, లవ్ ట్రాక్స్, కామెడీకి ఇంపార్టెన్స్ లేదు… సీన్ల చిత్రీకరణ, వాటి సీక్వెన్సు వాటిని హిట్ చేశాయి… పుష్ప కూడా అక్కడక్కడా వెగటు సీన్లున్నా సరే, ఓవరాల్‌గా హీరో ఎదిగిన క్రమాన్నే ఫోకస్ చేస్తుంది… అవన్నీ ప్రేక్షకుణ్ని ఇన్వాల్వ్ చేస్తాయి…

keerthy

Ads

సర్కారువారిపాటకు వచ్చేసరికి… దర్శకుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో మరిచిపోయాడు… సందేశం ఇవ్వడానికీ, కమర్షియల్ సూత్రాలకు నడుమ ఇరుక్కుపోయాడు… దెబ్బతినేశాడు… పైగా ఓ స్టార్ హీరోతో మొదటిసారి డీల్ చేయడం ఇది… కీర్తి కేరక్టరైజేషన్ పూర్.., నదియాను పెట్టుకున్నారు కానీ ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు… ఫస్టాఫ్‌లో కాస్త కామెడీతో నెట్టుకొచ్చారు, తీరా క్రూషియల్ సెకండాఫ్‌లో సీరియస్ నెరేషన్ వచ్చేసరికి దర్శకుడు చేతులెత్తేశాడు… అందుకే దర్శకుడి అనుభవం సరిపోలేదు…

థమన్ రెండు పాటలు సూపర్… కానీ ప్రజెంట్ ట్రెండ్ బీజీఎం… ఇక్కడ థమన్ పట్టు వదిలేశాడు… ఆ రేంజ్ సరిపోలేదు… ఫైట్స్ వోకే, గ్రాఫిక్స్ నాసిరకం, దాంతో అవి పేలలేదు, అవీ సరిపోలేదు… సినిమాకు గ్రిప్పింగ్ నెరేషన్ ముఖ్యం… కానీ ఎడిటింగ్ స్థాయి సరిపోలేదు… కమర్షియల్ మసాలాలు విపరీతంగా గుప్పించినా సరే, అసలు కంటెంట్ ప్రధానం… అదే ఇక్కడ సరిపోలేదు… ప్రత్యేకించి మహేష్ బాబు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బాగా చూపించలేకపోయాడు… దాంతో కథలో ఇంటెన్సిటీ దెబ్బతినిపోయింది…

svp

చాలా ఇంపార్టెంట్ ఇష్యూ… బ్యాంకు రుణాలు, స్కాములు, ఈఎంఐలు నిజానికి మంచి సబ్జెక్టు… కానీ కమర్షియల్ ఇమేజీ రొటీన్ ఫార్ములాలో ఇరికించేసరికి, లాజిక్ లేని సీన్లతో కథ చెప్పడానికి ప్రయత్నించడంతో… కథా ప్రాధాన్యం సరిపోలేదు… పైగా డైల్యూట్ అయిపోయింది… అందుకే సెకండాఫ్ లాగ్, బోర్… ఫస్టాఫ్ సరదాగా నడిచిన సినిమా సెకండాఫ్‌తో చతికిలపడింది… టెంపో సరిపోలేదు…

తెలుగు సినిమా అంటేనే తెలుగు టీవీ సీరియల్‌లాగా లాజిక్కులకు దూరంగా ఉండటం వాటి ప్రివిలేజ్… ఆ రచయితల క్రియేటివ్ దరిద్రానికి నిదర్శనాలు… ఎటొచ్చీ నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు నిర్మాతో, హీరోయో కాస్త చూసుకుంటూ ఉండాలి… మహేష్ బాబు కేవలం తన లుక్కు, కామెడీ, పాటలు గట్రా చూసుకున్నాడు గానీ… కథ ఎలా దారితప్పి అసని తుపానులో కొట్టుకుపోతున్నదో గమనించలేదు… పైగా ‘‘నేను విన్నాను, నేను ఉన్నాను’’ అనే జగన్ మార్క్ పాపులర్ డైలాగ్ తనను ఒక్కసారిగా వైసీపీ వ్యతిరేక కేడర్‌కు దూరం చేసేసింది… అది నెగెటివ్ ప్రచారానికి తెరతీసింది…

keerthy

నిజానికి ఆ డైలాగ్ ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు… ఇన్నేళ్ల సినిమా కెరీర్‌లో మహేష్ ఎప్పుడూ ఏ పార్టీకి అనుగుణంగా లేడు… అసలు రాజకీయాలే తను దూరం… కానీ హఠాత్తుగా అందులో ఇరుక్కున్నాడు… అయితే సినిమా మొత్తం తీసిపారేసినట్టేనా..? కాదు… మరీ ఆహా ఓహో సినిమా కాదు, ఓ సాదాసీదా తెలుగు సినిమా… ఇమేజీ, ఫార్ములా, రొటీన్ లక్షణాలు వదల్లేని ఓ సినిమా… సో… రాధేశ్యామ్, ఆచార్య సినిమాల్లాగే దర్శకుడి వల్ల ఓ మామూలు తెలుగు సినిమాగా మారిన మహేష్ బాబు సినిమా…!!

svp

ఈ ఫోటోను యాంటీ-వైసీపీ బ్యాచ్ వైరల్ చేస్తోంది… ఏందట అంటే..? జగన్‌ను ఆమధ్య కలిసొచ్చినవాళ్లలో ప్రభాస్, చిరంజీవి, మహేష్ ఉన్నారు… మూడు సినిమాలు కూడా ఫ్లాపులే అనేది ఆ క్యాంపెయిన్ సారాంశం… కానీ తప్పు… తప్పున్నర… ఎందుకంటే..? ఆరోజు కలిసినవాళ్లలో రాజమౌళి కూడా ఉన్నాడుగా… ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ అయ్యిందిగా… అలాగే చిరంజీవి జగన్ ఎదుట మోకరిల్లిన తీరు జనానికి నచ్చలేదు అనుకుందాం… మహేష్ ‘నేను విన్నాను, నేనున్నాను’ అనే డైలాగ్ విధేయంగా పెట్టుకున్నాడు అనుకుందాం… కానీ ప్రభాస్ అదేమీ చేయలేదుగా… మరెందుకు తన సినిమా ఫెయిలైంది… సో… ఇది నాన్సెన్స్ క్యాంపెయిన్… సినిమా ఫెయిల్‌కూ, ఫ్లాప్‌కూ బోలెడు కారణాలుంటయ్…!!

అవునూ… ‘‘నేను ఉన్నాను, నేను విన్నాను’’ డైలాగ్ ఎలా వచ్చింది ఈ సినిమాలోకి…? ఒకప్పటి స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు వైసీపీ ఎమ్మెల్యే, వాళ్ళ కజిన్ ఈ సినిమా దర్శకుడు పరుశురాం, గతంలో తను కూడా పూరి టీమ్ సభ్యుడే… అలా ఈ సినిమాకు కాస్త వైసీపీ వాసన అంటుకుందా..? మహేష్ ఈ డవిలాగ్ నష్టాన్ని అంచనా వేయలేకపోయాడా…!! హేమిటో మరి..!! ఇద్దరు పెద్ద డైరెక్టర్లు ఇన్వాల్వయ్యాక కొన్ని సీన్లు రీషూట్ చేశారు అనే ప్రచారం ఆమధ్య స్టార్టయింది… అప్పుడే సినిమా ఎక్కడో తేడా కొట్టిందనీ, డైరెక్టర్ పరుశురాం మహేష్ బాబుకు అవసరమైన రీతిలో కథను సరిగ్గా టాకిల్ చేయలేకపోయాడనే ఫీల్ ఇండస్ట్రీలో పాకిపోయింది… నాటి నుంచే నెగెటివ్ టాక్ మొదలై, సినిమా రిలీజ్ నాటికి అది పెరిగిపోయి, ఈరోజు తీరం దాటింది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions