తనకు కో-హోస్టుగా హఠాత్తుగా శ్రావణభార్గవిని తెచ్చిపెట్టారని అలిగి శ్రీరామచంద్ర తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి నిష్క్రమించాడా..? అందుకే కో-హోస్టు కాస్తా అకస్మాత్తుగా ఫుల్ టైమ్ హోస్టు అయిపోయిందా..? లేక శ్రీరామచంద్రను తప్పించడానికే ప్లాన్ చేసి, ముందస్తు ప్లాన్‌తో శ్రావణభార్గవిని కో-హోస్టుగా తీసుకొచ్చారా..? ఏమో… మొత్తానికి శ్రీరామచంద్ర సడెన్‌గా ఆదివారం ఎపిసోడ్ సీన్ నుంచి మాయమయ్యాడు…
సరే, ఇవేవీ కారణాలు కావు, ఏదో పని ఉండి షూటింగుకు రాలేకపోయాడు అనే అనుకుందాం… కానీ దానికి ఓ చీప్ కారణం చెప్పడం దేనికి..? అదీ చిల్లరగా ఉంది… స్ట్రెయిట్‌గా చెప్పొచ్చు కదా… తను నిజానికి బాగానే చేస్తున్నాడు… థమన్, కార్తీక్‌తో కూడా మంచి సంబంధాలున్నయ్… ఐనాసరే, ఒక జడ్జి పోవడం మరో జడ్జి రావడం, ఓ యాంకర్ పోవడం, మరో యాంకర్ రావడం… టీవీ షోలలో కామన్… అలాగే ఈ ఓటీటీ రియాలిటీ షోలో కూడా పెద్ద ఆశ్చర్యకరం ఏమీ కాదు…
ఇదే షోకు మొదట్లో రేవంత్‌ను హోస్ట్ అనుకున్నారు… కానీ శ్రీరామచంద్ర వచ్చాడు… నిత్యామేనన్ మధ్యలోనే వెళ్లిపోయింది… ఇప్పుడు శ్రావణభార్గవి వచ్చి చేరింది… ఇది పూర్తయ్యేసరికి షో నిర్వాహకులు ఇంకెన్ని కథలు పడతారో మరి..!! ఇంతకీ శ్రీరామచంద్ర రాకపోవడానికి వాళ్లు చెప్పించిన కారణం తెలుసా..?
Ads
రాగానే థమన్ అడిగాడు, వాడేడీ అని… శ్రావణ జేబులో నుంచి ఓ సీసా తీసి, మీరు చెప్పినట్టే కలిపి తాగించాను… టాయిలెట్‌లో ఉండిపోయాడు… గంట వరకూ రాడు ఇక… మనం లాగించేద్దాం ఈ షోను, ఏం పర్లేదు అని బదులిచ్చింది ఆమె… గంటసేపు టాయిలెట్‌లోనే అంటే క్యారవాన్ నీళ్లు సరిపోవు కదా అని థమన్ ప్రశ్న… పర్లేదు సార్, అరేంజ్ చేస్తామన్నారు అని ఆమె జవాబు… (షో జరుగుతున్నంతసేపు మళ్లీ థమన్ గానీ, కార్తీక్ గానీ శ్రీరామచంద్ర ఏడి అని అడగలేదు… వాళ్లకూ అర్థమైపోయిందేమో తన గాయబ్‌కు కారణం…)
ఓ హోస్ట్ ఏ కారణంచేతో ఒక ఎపిసోడ్‌కు రాకపోతే ఇంత చీప్ కారణం జనానికి చెప్పాలా..? పోనీ, వెళ్లగొట్టి ఉంటే అదే చెప్పేస్తే సరి… అదేమైనా అత్యంత గోప్యత మెయింటెయిన్ చేయాల్సిన విషయమా..? తను ఆహా ఓటీటీలో ప్రదీప్ నిర్వహించే సర్కార్-2 ఎపిసోడ్‌లో కంటెస్టెంటుగా పార్టిసిపేట్ చేశాడు కూడా… మరి ఈ మ్యూజిక్ షోకు వచ్చిన అడ్డంకి ఏమిటో…
ఎపిసోడ్ విషయానికి వస్తే… మారుతి అనే కంటెస్టెంటును ఎలిమినేట్ చేశారు… నిజానికి ఈ రిజల్ట్ ఊహిస్తున్నదే… తను కూడా తన పర్‌ఫామెన్స్ మీద హేపీగా లేడు… అన్నట్టు… ఓసారి శ్రావణ ‘వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజిక్ కాంపిటీషన్ షో’ అని ఏదో అన్నట్టుంది… పెద్ద బ్లండర్… ఆఫ్టరాల్ కేవలం తెలుగు శ్రోతలకు, అదీ ఆహా చూసే చాలా చాలా లిమిటెడ్ సంగీతాభిమానులు మాత్రమే చూసే షో ఇది… మరి బిగ్గెస్ట్ షో ఎప్పుడైంది తల్లీ..?!
Share this Article