తెలుగు టీవీ కామెడీ షోలలో హైపర్ ఆదిని కొట్టినోడు లేడు… అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా వేసే పంచులతో షోను తను హైజాక్ చేయగలడు… అలాంటి హైపర్ ఆదే ఒకామె పర్ఫామెన్స్‌ను తట్టుకోలేక గింగరాలు తిరిగిపోయాడు… సాధారణంగా ఏ సిట్యుయేషన్ వచ్చినా సరే తను హేండిల్ చేయగలడు… కానీ ఓ అత్తగారి పాత్రధారి దూకుడు ఎలా ఆపాలో తెలియక పలుసార్లు ఏం చేయాలో తెలియక నెత్తిన చేతులు పెట్టుకున్నాడు ఆది…
ఆదివారం నాటి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించింది ఈ పరిస్థితి… జబర్దస్త్ మానేశాడు, ఇక రేపోమాపో ఈటీవికి బైబై చెబుతాడు అనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో… దాన్నే కాన్సెప్టుగా తీసుకుని, దాని చుట్టూ ఓ కథ అల్లి, దాదాపు గంటపాటు సాగే సుదీర్ఘమైన స్కిట్ చేశారు… సరే, ఎప్పటిలాగే ఈటీవీ, మల్లెమాల అతి ఉత్తమాభిరుచి మేరకు వెగటు వాసన తప్పదు కదా…
ఆదిని ఓ ఇంపొటెంట్ కేరక్టర్‌గా చూపిస్తూ, మిగతా పాత్రలు ఆడుకుంటాయి… తనకు అత్త కాబోయి తప్పిపోయిన ఓ పాత్రలో ఆ నటి రెచ్చిపోయింది… ఆ టైమింగు, ఆ డైలాగ్ డిక్షన్‌తో మొత్తం అంత పెద్ద స్కిట్‌ను ఆది చేతుల్లో నుంచి పూర్తిగా హైజాక్ చేసిపారేసింది… నిజానికి స్కిట్ స్క్రిప్టు ప్రకారమే నడుస్తుంది… కానీ స్కిట్ నడుస్తున్న మూడ్‌ను బట్టి కమెడియన్లు అప్పటికప్పుడు కొన్ని పంచులు వేస్తుంటారు, ఆది అందులో సిద్ధహస్తుడు…
Ads
ఆమె మొత్తం జీవించేసింది… కామెడీలో టైమింగ్ ఎంత ప్రధానమో తెలుసు కదా… పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసింది… పంచ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, నూకరాజు, ఇమాన్యుయెల్, ఆటో రాంప్రసాద్ తదితరులు కూడా ఆమె ఆది మీద వేస్తున్న పంచులు చూస్తూ సైలెంటుగా ఉండిపోయారు… ఇక ఇంద్రజ అయితే పొట్ట చేత్తో పట్టుకుని, నవ్వడానికి కూడా నానా కష్టాలూ పడింది… ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఆమె పేరు మలక్‌పేట శైలజ… చిన్నాచితకా పాత్రలు చేస్తుంటుంది… హైదరాబాదులోనే పుట్టి పెరిగిన ఈ 54 ఏళ్ల అత్తగారు మల్లెమాల టీం తమ షోలలో రెగ్యులర్‌గా తీసుకున్నా తప్పులేదు…
అప్పుడప్పుడూ తెలుగు కామెడీ షోలకు అన్నపూర్ణ, వై.విజయ వంటి వెటరన్ నటులను తీసుకొస్తున్నారు… ఏవో స్కిట్స్‌లో కనిపిస్తారు, నాలుగు డబ్బులు ఇస్తారు… కానీ వాళ్లు కేవలం గెస్ట్ పార్టిసిపెంట్స్ మాత్రమే… ఎలాగూ తెలుగు టీవీ షోలలో లేడీ గెటప్స్ బదులు లేడీ యాక్టర్లను విరివిగా ప్రవేశపెడుతున్నారు… సో, శైలజకు కూడా అవకాశాలిస్తే మంచిదే… మరి కంటెంటులో బూతు, వెగటుతనం మాటేమిటి అంటారా..? ఆ దరిద్రం ఎలాగూ తప్పదు..!! సరయు వీడియోలు, శ్రీనివాసరెడ్డి ప్రాంక్ వీడియోల్లాగా..!!
Share this Article