వారణాసి జ్ఞానవాపి ప్రాంగణంలో ముస్లింలు నమాజు చేస్తున్న ప్రాంతంలో… ఓ తటాకంలో శివలింగం కనిపించిందనీ… అది అధికారికంగా జరిగిన సర్వేలోనే బయటపడిందనీ నిన్న జోరుగా మీడియా, సోషల్ మీడియా కథనాలు… అసలు సర్వే వివరాలు బయటికి, మీడియాకు లీకైనందుకు బాధ్యుడిగా కోర్టు ఓ ఉద్యోగిపై వేటు వేసింది… నిజంగా శివలింగం బయటపడిందా లేదానేది కోర్టే చట్టబద్ధంగా తేల్చనుందన్నమాట.,. తనకు ఏ నివేదిక అందిందో, అందులో ఏముందో కూడా ఇక కోర్టే చెప్పాల్సి ఉంది… నిజానికి ఇతర మతాలకు చెందిన ప్రార్థనస్థలాలను కూలగొట్టి మసీదులుగా మార్చడం అప్పట్లో చాలా సాధారణ విషయం…
గుళ్లపై దాడులు చేయడం, ఏమైనా సంపద ఉంటే హస్తగతం చేసుకోవడం, శిల్పాలను విరగ్గొట్టడం ఓ ఉద్యమంలా సాగించారు అప్పట్లో ముస్లిం పాలకులు… అలాంటివన్నీ తిరిగి ఇస్లామేతర మతాలు స్వాధీనం చేసుకోవడం అతి పెద్ద టాస్క్, అసాధ్యం కూడా… పైగా జాతుల అంతర్యుద్ధానికి దారితీసే ప్రమాదముంది… పరివార్ మూడో నాలుగో ప్రధాన గుళ్లను తమకు సుహృద్భావంతో అప్పగించాలనీ, ఇక మిగతావన్నీ వదిలేస్తామనీ ఎన్నాళ్లుగానో కోరుతుందంటారు… కానీ అవేవీ ఫలించలేదు… ఎప్పుడైతే అయోధ్యలో కట్టడం నేలమట్టమైందో అప్పటి పీవీ ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది… వర్షిప్ యాక్ట్-1991… అయోధ్య అనంతరం హిందూ సమాజం ఇంకేమీ అడక్కుండా చేయడం కోసం…
చాలామంది పీవీ హిందువుల పట్ల పక్షపాతం ప్రదర్శించాడు అంటారు… పరోక్షంగా అయోధ్య కట్టడం నేలకూలడానికి తనే కారణం అంటారు గానీ… ఇకపై ఎవరూ ఏ ప్రార్థన స్థలం మీద ఏ క్లెయిమ్ చేయకుండా ఉండేందుకు ఆ చట్టం తీసుకొచ్చాడు… బీజేపీకి ముకుతాడు వేసి, ఈ తగాదాలకు, మత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్నాడు… ఆ యాక్ట్ ఏం చెబుతున్నదీ అంటే… 15 ఆగస్టు 1947 నాటికి ఏ కట్టడం ఏ మతం ఆధీనంలో ఉంటే వాళ్లకే సొంతం… ఇక ఎవరూ లీగల్ వివాదానికి దిగేది లేదు, దిగినా చెల్లదు… సరిగ్గా ఇప్పుడు అది చర్చల్లోకి వచ్చింది…
Ads
వారణాసిలో శివుడు బయటపడినా సరే, అది ఆల్‌రెడీ ముస్లింల ఆధీనంలో ఉంది కాబట్టి, అక్కడ రెగ్యులర్‌గా ప్రార్థనలు సాగుతున్నాయి కాబట్టి ఇక ఎవరూ తమ ఓనర్‌షిప్ క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు… అందుకే మజ్లిస్ ఒవైసీ వారణాసి జ్ఞానవాపి ప్రాంగణాన్ని మరో బాబ్రీ కానివ్వబోమని అంటున్నాడు… జరుగుతున్నదంతా ఆ చట్టానికి వ్యతిరేకమే అంటున్నాడు… మరోవైపు ఆ చట్టాన్నే రద్దు చేసేయాలని కొందరు ఆల్‌రెడీ డిమాండ్లు ప్రారంభించారు… ఆల్‌రెడీ మధురలో కూడా ఒక ఈద్‌గా సర్వే చేయడానికి కోర్టు అనుమతించింది కాబట్టి… అందరి దృష్టీ ఇక దానిపై పడింది… హిందూ సమాజం నుంచి తేజోమహల్, వారణాసి, మధుర, విష్ణుస్తంభం తదితర డిమాండ్లు వచ్చిపడుతున్నాయి…
అయితే వర్షిప్ యాక్ట్… అంటే ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం వారణాసి వివాదాన్ని చట్టపరంగా విచారించడానికి నిజంగానే వీల్లేదా..? దాని ఓనర్ షిప్ వివాదాన్ని తేల్చడానికి అవకాశం లేదా..? ఇదీ ప్రశ్న… ఆ చట్టం అన్నిరకాల లీగల్ ప్రొసీడింగ్స్‌ను తోసిరాజంటున్నా సరే… కొన్ని మినహాయింపులు ఉన్నాయి… 1947, ఆగస్టు 15 నాటికి… అంటే స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఏ కట్టడం ఏ మతం ఆధీనంలో ఉంటే వాళ్లదే… ఇంకెవరూ ఓనర్ షిప్ క్లెయిమ్ చేయడానికి లేదు… కానీ చారిత్రిక, పురాతన కట్టడాలకు… పురావస్తు శాఖ పరిధిలో ఉన్న కట్టడాలకు మినహాయింపు ఉంది…
వందేళ్లకులోపు కట్టడమైతే పురాతన కట్టడం… ancient monument… ఎలాగూ జ్ఞానవాపి ప్రాంగణానికి, ఆ కట్టడాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది… మధురలోని కృష్ణ జన్మస్థానానికీ అంతే… అందుకని కోర్టు విచారించడానికి వీల్లేదు, ఆ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు అనే వాదన చెల్లదు… ఇప్పటికే రెండు మతాల నడుమ విద్వేషం, దూరం పెరుగుతున్న నేపథ్యంలో… రెండు మతాల విజ్ఞులు కోర్టు బయట ఓ శాశ్వత పరిష్కార ప్రయత్నం చేయడమే శరణ్యం… తప్పులేదు… కానీ అదెంత వరకూ సాధ్యం, ఎవరు సారథ్యం వహించాలి అనేదే పెద్ద ప్రశ్న…!!
Share this Article