ఈ స్టోరీకి ముందుగా చిన్న డిస్‌క్లెయిమర్… బిగ్‌బాస్ అనే తెలుగు రియాలిటీ ఓటీటీ 24 అవర్స్ షో ఓ డిజాస్టర్ ప్రోగ్రామ్… ఇక చదవండి… బిందుమాధవి గెలిచిందట… అరియానా మధ్యలోనే 10 లక్షలు తీసుకుని పోటీ నుంచి స్పిరిట్ రాహిత్యంతో ఎగిరిపోయిందట… గత సీజన్‌లో సొహెల్ స్పూర్తి అనుకుంటా… అఖిల్ సార్థక్ రెండో ప్లేసులో నిలిచాడట… ఇవీ వస్తున్న వార్తలు… నిజమే అనుకుందాం… అయితే..?
ఒక్కటి బాగా నచ్చింది… బాగా నచ్చింది… నటరాజ్ మాస్టర్ అనబడు ఓ తిక్క కేరక్టర్ ‘‘నాన్సెన్స్, బిందు గెలిస్తే పెయిడ్ మీడియా గెలిచినట్టు… బజారుకు లాగుతా, వదిలేదు లేదు’’ అని అరుస్తున్నాడట… నవ్వొచ్చింది… నటరాజ్ మాస్టర్ (సారీ, మాస్టర్ అంటున్నందుకు…) ఓ గందరగోళం కేరక్టర్… అంతకుముందు టీవీలో వచ్చిన అయిదో సీజన్ బిగ్‌బాస్‌లోనే తెగవిసిగించాడు… ఆ షో దెబ్బతినడానికి సగం కారణం తనే… తన తిక్కకు జవాబు చెబుతూ, బిందు మాధవి గెలవడం బాగుంది… తెలుగులో బిగ్‌బాస్ గెలిచిన తొలి లేడీ కంటెస్టెంట్ కావడం బాగుంది…
సో వాట్..? పెయిడ్ మీడియా అయితే ఏమిటట..? అసలు బిగ్‌బాస్ రియాలిటీ షో అంటేనే పక్కా మేనేజ్డ్ యవ్వారం… అంతా స్క్రిప్టెడ్… రకరకాల బాగోతాలు… ముందస్తు ఒప్పందాలు… వోటింగు కోసం బయట స్పెషల్‌గా సోషల్ మీడియా టీమ్స్, వాళ్లకు డబ్బులు, ఇదంతా ఓ టాస్క్… హౌజులో గెలవడం కాదు, ఈ ప్లానింగులో గెలవాలి… బిగ్‌బాస్ తెలుగు మాత్రమే కాదు… అన్ని భాషల్లోనూ ఇదే దందా… విజేతలందరూ ప్రేక్షకుల మనస్సులు గెలిచి విజేతలు కాలేదోయ్ నటరాజూ… అపజయాన్ని హుందాగా స్వీకరించడం అనేది ఓ మంచి వ్యక్తిత్వ లక్షణం… అఫ్‌కోర్స్, దానికి నీకు అర్థం తెలుసని ఏ తెలుగు ప్రేక్షకుడూ అనుకోడు…
Ads
అంతకుముందు బిగ్‌బాస్ సీజన్లలో ఫెయిలైనవాళ్లను తీసుకోవడం ఈ షోకు పెద్ద మైనస్… ఓటీటీలో మాత్రమే ప్రసారం మరో మైనస్… 24 గంటలూ అనడం ఇంకో మైనస్… పైగా అశ్లీలం వెగటు వాసన గుప్పుమంది… వెరసి ఎవడూ దేకలేదు ఆ షోను… అంతకుముందు బిగ్‌బాస్ షోలకు సోషల్ మీడియాలో దక్కిన మైలేజీలో అయిదారు శాతం కూడా ఈ షోకు దక్కలేదు… ఫినాలేకు ఫలానావాడు గెస్టుగా వస్తాడట వంటి వార్తలు ఎవరికీ పెద్దగా పట్టలేదు ఈసారి… ఈ బూతు సినిమాకు హోస్టింగ్ చేసిన నాగార్జునకు మరో ఫ్లాప్… అఫ్‌కోర్స్, ఈ సీజన్ ప్లానింగ్, కాన్సెప్టే పెద్ద లోపభూయిష్టం…
అరియానా మళ్లీ టాప్ ఫైవ్‌లో ఉండటం నిజంగా లక్కీ… నిజానికి ఆమెకు అంత సీన్ లేదు… బాబా భాస్కర్ మరో మైనస్… అసలు ఈ డాన్స్ మాస్టర్లందరూ వేరే పనులేమీ లేక… టీవీ షోల మీద పడ్డారు… పడితేపడ్డారు… ఓవరాక్షన్… ఎవరో శివ అట… తన ఓవరాక్షన్ మీద పలు వార్తలు చదివినట్టు గుర్తు… సరే, అవన్నీ వదిలేయండి… ఎవరీ బిందుమాధవి…
చాలామందికి గుర్తొచ్చేది పిల్ల జమీందార్ సినిమా… తరువాత తెలుగు సినిమాల మొహం చూడలేదు… నిజానికి ఆమెది మదనపల్లి… తండ్రి ఉద్యోగరీత్యా రకరకాల ప్రాంతాలు తిరిగీ తిరిగీ చివరకు చెన్నై తీరం చేరుకుంది ఈ కెరటం… 2008 నుంచీ తిప్పలు పడుతున్నా మంచి బ్రేక్ రాలేదు… తమిళ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది ఓ సీజన్‌లో… ఫిఫ్త్ ప్లేసు దక్కింది… సో, ఏదయితేనేం… తెలుగులో ఓ విజయం దక్కింది… కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోని రియాలిటీ షోలో…!! పోనీలెండి… ఎలాగూ తెలుగు మహిళ అంటేనే తెలుగు ఇండస్ట్రీ ఆమడ దూరం ఉంచుతుంది… ఈ విజయమైనా ఒకింత ఊరడింపు ఇచ్చుగాక..!!
Share this Article