Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పేదేముంది..? రష్మిక లెంపలేసుకుని ఫ్యాన్స్‌కు సారీ చెప్పింది..!

May 28, 2022 by M S R

మీడియా ఒక కత్తి… దానికి బహుముఖ పదును… సోషల్ మీడియా ఓ కృపాణం… అది మరీ లోతుకు దిగుతుంది… చీల్చేస్తుంది… ప్రత్యేకించి సెలెబ్రిటీలకు సంబంధించి ప్రచారానికి, పాపులారిటీకి ఈ రెండూ ఎలా ఉపయోగపడతాయో… జాగ్రత్తగా లేకపోతే అవే చీరేస్తాయి… మరీ సోషల్ మీడియా విజృంభణ పెరిగాక సెలబ్రిటీలు ‘‘ఒళ్లు దగ్గర’’ పెట్టుకుని వ్యవహరించాల్సిన అనివార్యత ఏర్పడింది… ఏ ఇష్యూ లేకపోతే సోషల్ మీడియా పాతవి తవ్వి మరీ కొత్తగా పెట్రోల్ పోసి, మంటలు రాజేస్తాయి…

ప్రత్యేకించి మీడియా చిట్‌చాట్… టీవీ గేమ్‌షోలతో హఠాత్తుగా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి… హోస్ట్ ఇరుకునపెడదామని ప్రయత్నిస్తాడు… అక్కడే జాగ్రత్తగా ఉండాలి… నాలుక అదుపులో ఉండాలి… జవాబు కచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, నచ్చకపోతే, ఇబ్బంది అనిపిస్తే, తెలివిగా సమాధానం చెప్పలేకపోతే ప్రశ్న అవాయిడ్ చేయొచ్చు… కానీ నోటికొచ్చింది కూస్తే అదెప్పుడో రివర్స్ కొట్టే ప్రమాదముంటుంది…

ఈటీవీలో సుమ హోస్ట్ చేసే క్యాష్ చూస్తారుగా… అందులో గెస్టులను సుమ రకరకాల ప్రశ్నలు ఇలాగే వేస్తుంటుంది… అవి సరదా కోసమే అయినా, కొన్నిసార్లు చిక్కుల్లో పడేస్తాయి… తాజా ఉదాహరణ రష్మిక మంథన… అప్పుడెప్పుడో 2017లో… రష్మిక ఇంత పెద్ద స్టారేమీ కాదు… అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటోంది… కేజీఎఫ్ యశ్ కూడా అప్పట్లో సాదాసీదా కన్నడ హీరో… అప్పట్లో కిరిక్ పార్టీ అనే సినిమా వచ్చింది… రష్మిక హీరోయిన్, రక్షిత్ శెట్టి హీరో… 4 కోట్ల ఖర్చుకు 50 కోట్లు సంపాదించి పెట్టిన సినిమా… రక్షిత్ తెలుసు కదా… రష్మికతో ప్రేమాయణం, ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యాక బ్రేకప్ అయ్యింది…

Ads

దాని ప్రమోషన్ వర్క్ సాగుతున్నప్పుడు… ఏదో టీవీ షోలో ర్యాపిడ్ ఫైర్ పార్ట్ ఉంటుంది కదా… మీ ఉద్దేశంలో కన్నడ ఇండస్ట్రీకి సంబంధించి ‘‘మిస్టర్ షోఆఫ్’’ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది… (నెగెటివ్ సెన్స్‌లోనే… పెద్ద షో చేస్తుంటాడురా అంటుంటాం కదా… అలాంటి పదం)… అసలే హీరోయిన్ల పరిస్థితి ఇండస్ట్రీలో సెన్సిటివ్ కదా… ఈమె వెంటనే అవేమీ ఆలోచించకుండా యశ్ పేరు చెప్పింది… అది మళ్లీ సోషల్ మీడియా చర్చల్లోకి వచ్చింది ఇప్పుడు… భీకరమైన ట్రోలింగ్ మొదలైంది…

తప్పేదేముంది..? సోషల్ మీడియాలోనే పెద్ద వివరణ ఇచ్చుకుంది రష్మిక… ‘‘బాబ్బాబు, అదేదో తనను కించపరచాలని కాదు… ఆ ర్యాపిడ్ ఫైర్‌లో నిజంగా నేనేం చెప్పానో మొత్తం చూడకుండా, చూపకుండా రెండు లైన్లను పట్టుకుని ఇలా తిట్టేయడం బాగా లేదు… నేను ఎన్నోసార్లు యశ్ సార్‌ను పొగిడాను… నా స్పూర్తి అని కూడా చెప్పాను… యశ్ నటించిన ‘‘సంతూ స్ట్రెయిట్ ఫార్వర్డ్’’ సినిమాను కూడా మెచ్చుకున్నాను… ఐనా సరే, మీరు హర్టయితే సారీ’’ అని చెప్పేసింది… (సంతూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనేది యశ్ అప్పట్లో నటించిన సినిమా… అందులో తన భార్య రాధిక పండిట్ హీరోయిన్…)

నిజానికి రష్మిక, యశ్ నడుమ దూరం ఏమీ లేదు… 2019లో కావచ్చు బహుశా… విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరుకు వెళ్తే యశ్ చీఫ్ గెస్టుగా వచ్చి హంగామా చేశాడు… రష్మిక కూడా యాక్టివ్‌గా పాల్గొన్నది… విజయ్, యశ్, రష్మిక చాలా కలివిడిగా కనిపించారు… 2017, 2018 ప్రాంతంలో ఇద్దరూ కలిసి రాణ అనే సినిమా కూడా చేశారు… అయితేనేం… అప్పుడప్పుడూ సోషల్ మీడియా కొండచిలువలా హఠాత్తుగా నోరు తెరిచి, ఇలా కదులుతుంది… అంతే… కేజీఎఫ్ తరువాత యశ్ స్టార్‌డం విపరీతంగా పెరిగింది… వీరాభిమానుల సంఖ్య కూడా పెరిగింది… మరోవైపు రష్మిక కూడా పుష్ప వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిపోయింది… ఆ ఇద్దరి నడుమ చిచ్చుకు సోషల్ మీడియా ప్రయత్నించింది… అదీ సంగతి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…
  • ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…
  • బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
  • అక్షయ్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ ఫెయిల్… విష్ణు, ప్రభాస్ పాస్…
  • సంపూర్ణంగా ఈ కామాఖ్య ఆదిశక్తిపీఠం తరహాయే వేరు… Part-2 …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions