పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్… ఈ సినిమాలతో సౌత్ ఇండియా సినిమాలే కాదు, ఆ హీరోలే పాన్ ఇండియా స్టార్స్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఇన్నేళ్లు ఇండియన్ స్టార్స్ అంటే మేమే అని విర్రవీగుతున్న బాలీవుడ్ స్టార్స్ ఇగో బద్ధలైంది… కడుపులు రగిలిపోతున్నాయి… ఎవడ్రా, ఈ సౌతిండియన్ స్టార్స్, అసలు ఈ పాన్ ఇండియా బాగోతం ఏమిట్రా అని కుతకుతలాడిపోతున్నారు… దీనిమీద వాదోపవాదాలు కూడా నడుస్తున్నాయి కదా… ఓ చిన్న వార్త ఆసక్తికరంగా కనిపించింది…
ఆర్మాక్స్ అనే మీడియా సంస్థ ఉంది… అది ఎప్పటికప్పుడు పలు అంశాల్లో ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది… నీ సర్వే పద్ధతి ఏంట్రా అనడక్కండి… అబ్బో, ఎప్పటికప్పుడు 10 వేల మందిని సర్వే చేస్తాం అని ఏదో కథ చెబుతుంది… అదొక దందా… స్కోచ్ అవార్డులు అనే కమర్షియల్ దందా తెలుసు కదా… ఇది అంతకుమించి..!!
మరి ఎందుకు ఇంట్రస్టింగు అంటారా..? హహహ… మొత్తం జాతీయ స్థాయిలో ఎవడ్రా మీకు నచ్చిన హీరో అని వీళ్లు అడిగారట… సరే, అడుగుతూనే ఉంటారు తెలుసు కదా… టాప్ టెన్‌లో ఒక్క అక్షయ్ కుమార్ తప్ప మిగతా తొమ్మిది మందీ సౌతిండియన్ హీరోలే స్టార్స్ అని తేల్చేశాడు ఆర్మాక్స్ వాడు… అసలే పాన్ ఇండియా హీరోల కుతకుతల నడుమ… బుసబుసలు, రుసరుసల నడుమ ఈ సర్వే రిజల్ట్ కాస్త అట్రాక్ట్ చేసింది…
Ads
ఈ చార్ట్ చూశారుగా… ఫస్ట్ ప్లేస్ విజయ్ అట… బీస్ట్ అట్టర్ ఫ్లాప్ తరువాత వెనక్కి పోయి ఉండాలి కదా అంటారా..? ఆర్మాక్స్ వాడి డబ్బు లెక్కల్లో ఆ అంచనా ఫిట్ కాదు… అంతే… సెకండ్ ప్లేస్ జూనియర్ ఎన్టీయార్ అట… సరే, ట్రిపుల్ ఆర్ హిట్ తరువాత పాపులారిటీ పెరిగిందీ అనుకుందాం… మూడో ప్లేసు ప్రభాస్ అట… సాహో తరువాత రాధేశ్యామ్ డిజాస్టర్… నాలుగో ప్లేసులో అల్లు అర్జున్ అట… నిజానికి ఫస్ట్ ప్లేసు రాదగిన పేరు అది… పుష్ప సక్సెస్ మామూలుది కాదు…
అక్షయ్ కుమార్ అయిదో ప్లేసు ఎందుకో మనకు అర్థం కాదు, వదిలేద్దాం… ఆరో ప్లేసు అజిత్ అట… మొన్నామధ్య ఏదో సినిమా ఎదురుతన్నింది… (వలిమై కావచ్చు… ఆ పేరేమిటో తనకే తెలియాలి…)… నిజానికి ఈ సంవత్సరం సూపర్ స్టార్ కన్నడ యశ్… కేజీఎఫ్-2 మామూలు హిట్ కాదు… కానీ ఆర్మాక్స్ వాడు ఏడో ప్లేసు ఇచ్చాడు… రాంచరణ్ ఎనిమిదో ప్లేసు కూడా రాంగే… ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో బాగా లబ్ధి పొందింది తనే… ఇక సూర్యను వదిలేస్తే మహేష్ బాబు సర్కారువారి పాట ఎబౌ యావరేజ్… కానీ మరీ పదో ప్లేసు మాత్రం కరెక్టు కాదు…
ఫిమేల్ స్టార్స్ విషయానికొస్తే…. పెద్ద పెద్ద హిందీ అందగత్తెలు కూడా లిస్టులోకి రాలేదు… సమంత ఫస్ట్ ప్లేసు అట… అసలు ఎన్నాళ్లయింది ఆమె ప్రధానంగా కనిపించి..? సరే, ఆర్మాక్స్ దందా అంటే అంతే అనుకుందాం… ఆలియా భట్ రెండో ప్లేసు… వోకే… గంగూభాయ్ సినిమా కారణంగా వోకే అనుకోవచ్చు… కానీ నయనతార మూడో ప్లేసు ఏమిటో, కాజల్ అగర్వాల్ నాలుగో ప్లేసు ఏమిటో సమజ్ కాదు… తల్లి, చెల్లి పాత్రలకు ఫిట్టయ్యే పొజిషన్లో, ఏదిపడితే అది ఒప్పేసుకునే కాజల్ నాలుగో ప్లేస్ అట…
అయిదో ప్లేసు దీపిక వోకే… ఆమధ్య అదేదో ఇంటిమేట్ సీన్లతో కూడిన సినిమా ఏదో విడుదలైంది కదా… రష్మిక ఆరో ప్లేసు అనేది కూడా కరెక్టు కాదు… పుష్ప సినిమాతో ఆమె ఇప్పుడు చాలా చాలా పాపులర్… ఏడో ప్లేసులో అనుష్క శెట్టి పేరు మరో అబ్సర్డ్… అసలు ఆమె దాదాపు తెరమరుగైంది… ఎనిమిదో ప్లేసు కత్రినా కైఫ్ అనేదీ కరెక్టు కాదు… అసలు ఆమె సినిమాలు ఏమున్నాయి…? మొన్న పెళ్లిచేసుకోవడం తప్ప ఆమె వార్తల్లోకి వచ్చి ఎన్నిరోజులైంది..? తొమ్మిదో ప్లేసులో ఉన్న కీర్తి సురేష్ మాటెలా ఉన్నా పూజా హెగ్డేను మరీ పదో ప్లేసులోకి నెట్టేయడం విశేషం… ఐరన్ లెగ్ సెంటిమెంట్ ఎలా ఉన్నా సరే, ప్రస్తుతం బ్రహ్మాండమైన రెమ్యునరేషన్‌తో వెలిగిపోతోంది ఆమె… మరీ అనుష్క, కాజల్‌కన్నా దిగువకు తోసేయడం ఏమిట్రా అంటారా..? అవును, నిజమే… ఆర్మాక్స్ వాడు అలాగే చేస్తాడు…!!
Share this Article