నిజానికి విజయసాయిరెడ్డి చాలా బాగా మాట్లాడతాడు… తన మాటతీరులో మర్యాద, మన్నన వినిపిస్తాయి… తన రాజకీయ ప్రసంగాల్లో ఎప్పుడూ పెద్దగా పరిశీలించలేదు గానీ బహిరంగంగా బూతులు పెద్దగా వాడినట్టు విమర్శలయితే లేవు… కానీ తన ట్విట్టర్ ఖాతా మాత్రం ఓ పెద్ద వెగటు పురాణం… వంద జబర్దస్త్లు చూస్తున్నట్టుగా ఉంటుంది… ప్యూర్ ఏపీ పాలిటిక్స్ భాషను పుణికిపుచ్చుకున్నట్టుగా వెకిలితనం, దుర్గంధం పోటీపడుతుంటయ్… మరీ పట్టాభి స్థాయికి వేగంగా ఇలా దిగజారిపోయావేమిటి సార్..?
ఏ నాయకుడికైనా తన సోషల్ మీడియా ఖాతాలు మెయింటెయిన్ నిర్వహించేవాళ్లు ఒక అదనపు బలంగా పనిచేయాలి… భాష, భావం, సందర్భం, స్థాయి అన్నీ చూసుకోవాలి… అది నాయకుడి వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ఉండకూడదు… కానీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో కేర్లెస్గా ఉన్నట్టు కనిపిస్తోంది… తనేమీ సొంతంగా ట్వీట్లు రాస్తూ కూర్చోడు… కానీ సోషల్ మీడియా టీం ఎలా పనిచేస్తున్నదో ఓసారి చూసుకోవాలి… ఎప్పటికప్పుడు ఆ ట్వీట్ల నాణ్యత తను గౌరవాన్ని దెబ్బతీస్తుందా సమీక్షించుకోవాలి… ప్చ్, అదేమీ లేదు…
ఆమధ్య బండ్ల గణేష్తో ట్వీట్ల వైరం వైసీపీ అభిమానుల్నే చికాకుపెట్టింది… బండ్ల గణేష్ స్థాయి ఏమిటి..? తన స్థాయి ఏమిటి..? సాయిరెడ్డి పార్టీ కీలకనేత… ఢిల్లీతో పార్టీ అనుసంధానం విషయంలో ముఖ్యుడు… పార్టీ అనుబంధ విభాగాలు (పనిచేస్తున్నట్టయితే…) అన్నింటికీ చీఫ్… ప్రత్యేకించి సోషల్ మీడియాకు… సేమ్, అలాంటిదే మరో ట్వీట్ కనిపించింది… ఇదుగో…
Ads
బాయ్య లోకెల్లా అతి పెద్ద బాయ్య… వాడి పేరు చింతకాయ!
ఈ కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్గాడు, తాగేది మందు… దూరేది సందు… చెప్పేది శ్రీరంగనీతులా? ఈ అడ్డగాడిద మత్తు అడ్డంగా దింపేసే టైమ్ దగ్గర పడింది…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 31, 2022
బాయ్య అట… ఏం భాష ఇది..? అయ్యన్నపాత్రుడి మీద ఈ దాడి… అందుకే నేరుగా చింతకాయ అని రాసేశాడు… కానీ ఆ పదాలు చూడండి… కొజ్జా రికార్డింగ్ డాన్సర్ గాడు, తాగేది మందు, దూరేది సందు…
సరే, నిజమే అనుకుందాం… అయ్యన్న వాడే భాష, కంటెంటు నీచంగానే ఉంటున్నాయని అనుకుందాం… అంగీకరిద్దాం… తను నోరు విప్పితే ఉచ్ఛం, నీచం ఏమీ ఉండవ్ అనేది కూడా ఒప్పేసుకుందాం… కానీ సాయిరెడ్డి మరీ ఆ స్థాయికి పడిపోవాల్సిన పనిలేదు కదా… తన సంస్కారాన్ని విప్పిపారేసి, ట్విట్టర్ బజారులో కొట్లాటకు రెడీ అంటే ఎలా..?
కనకపు సింహాసనం మీద అయినా, కలియుగ వైకుంఠంలో అయినా కుక్కది ఒకటే బుద్ధి…వీడు తిరుమలలోను అదేలా కాలెత్తి పోశాడు. pic.twitter.com/DUBM3ULOea
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2022
ఇంకొన్ని చదువుతారా..? ఇదుగో… ‘‘కుక్క రోడ్డుమీద మొరుగుతుంది. వీడు కెమెరా ముందు మొరుగుతాడు. కుక్క గంజి తాగుతుంది– వీడు గంజాయి తాగుతాడు. కుక్క పాలో నీళ్ళో తాగుతుంది. వీడు నాటు సారా తాగుతాడు. కుక్క– వీడు ఒకటే తింటారు! ఇలాంటి వెధవ నోట మంచి మాటలు ఎందుకు వస్తాయి?
ఓరినీ అయ్య…న్న! నిన్ను సృష్టించేటప్పుడే దేవుడు నీకు అన్నం తినేది కింద, అశుద్ధం పేగు పైన పెట్టాడు. కాబట్టే నువ్వు ఏం మాట్లాడినా నీ కంపునోటినిండా పెంటపెంటే!’’….. హేమిటో మరి…!!
Share this Article