కొన్ని పాత పాటల్ని మ్యూజిక్ షోలలో గానీ, పోటీల్లో గానీ అటెంప్ట్ చేయడానికి సింగర్స్ ట్రై చేయరు… సాధన కష్టం… క్లిష్టమైన ట్యూన్, ఎక్కువ క్లాసికల్ టచ్ ఉన్ పాటలయితే వాటి జోలికే వెళ్లరు… సీనియర్లు కూడా ఎందుకోగానీ అలాంటి పాటల్ని పాడి మెప్పించాలని ప్రయత్నించరు… ఉదాహరణకు ‘శివశంకరీ శివానందలహరి’ పాట… సినిమాలో పాడిన ఒరిజినల్ సింగర్ ఘంటసాల ఎక్కడా మళ్లీ ఆ పాట పాడలేదు… వేలాది పాటలు పాడి, వేలాది కచేరీలు చేసిన అనితరసాధ్యుడు ఎస్పీ బాలు కూడా ఆ పాట జోలికి పోలేదు…
కొన్నిపాటలు అంతే… శ్రీ తుంబుర నారద నాదామృతం కూడా ఆ కోవలోనిదే… మహాప్రాణదీపం పాట కూడా క్లిష్టమైనదే కానీ చాలామంది తన మెరిట్ ప్రూవ్ చేసుకోవడానికి స్టేజీల మీద దీన్ని పాడుతుంటారు… కానీ మెప్పించినవాళ్లు తక్కువ… అంతెందుకు..? ఈ పాటను సినిమాలో పాడిన ఆ శంకర్ మహాదేవనే మళ్లీ ఎక్కడా దాన్ని సరిగ్గా పాడలేకపోయాడు… తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మొన్న సింగర్ కార్తీక్, శ్రీరామచంద్ర కలిసి సాగర సంగమం సినిమాలోని వేదం అణువణువున నాదం పాట ఆలపిస్తుంటే ఆనందమేసింది…
అదే సినిమాలో నాదవినోదం నాట్యవిలాసం పాట కూడా క్లాసికల్ క్లాసిక్… పేరుమోసిన సింగర్స్ ఈ పాట అటెంప్ట్ చేయడానికి జంకుతుంటారు… కానీ ఓ జూనియర్… పేరు నేహ… ఇంకా గొంతులోని పసిఛాయలు కూడా పూర్తిగా పోలేదు… భలే పాడింది… ఆమె పాడుతుంటే సింగర్స్ చిత్ర, శంకర్ మహదేవన్, కల్పన, ఎస్పీ చరణ్, కమల్ హాసన్ ఆశ్చర్యంగా, అభినందనగా చూస్తున్నారు… తమ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు కూడా…
Ads
చాలామంది పాడుతుంటారు… చాలా పోటీలు జరుగుతుంటాయి… అది కాదు ప్రస్తావించుకునేది… ఆ పాటలో తప్పులు దొర్లకుండా ఆ అమ్మాయి చేసిన సాధన అభినందనీయం… మంచి గురువు దొరకాలి, తమ రొటీన్ ర్యాంకుల కేంద్రిత చదువుల ఒత్తిడిలోనూ టైమ్ తీసుకుని, ఈ సాధనకు కేటాయించాలి… కాన్సంట్రేట్ చేయాలి… అంతమంది సీనియర్ల ఎదుట, లక్షల మంది టీవీలో చూస్తున్నారనే ఒత్తిడిలోనూ ఇలా పాడటం చిన్న టాస్కేమీ కాదు… (ఇది సూపర్ సింగర్ జూనియర్ షో… తమిళంలో స్టార్ విజయ్‌లో ప్రసారం అవుతోంది… ఇలాంటిదే తెలుగులో స్టార్ట్ చేశారు… కానీ సంగీతంకన్నా ఇతరత్రా ‘కళలు’ ఎక్కువైపోయాయి అందులో… తెలుగు స్టార్ మా క్రియేటివ్ టీంది ఇలాంటి విషయాల్లో దరిద్రపు టేస్ట్…)
తెలుగులోనూ మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ టీవీల్లో పెరుగుతున్నాయి… ఆడిషన్స్ పెడితే వేల మంది వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు… రకరకాల పాటలు సాధన చేస్తున్నారు… పిల్లల్లో మ్యూజిక్, డాన్స్ వంటి కళల పట్ల మళ్లీ ఆసక్తి కనిపిస్తోంది… ఎటొచ్చీ ఈ షోలు ప్రేక్షకాదరణ పొందాలంటే పోటీదారుల ఎంపికే ముఖ్యం… అట్టహాసాలు, ఆడంబరాలు, లెక్కకుమిక్కిలి మెంటార్స్, జడ్జిలతో మాత్రమే షో రక్తికట్టదు… పాడేవారిలో దమ్ముండాలి… యాంకర్స్‌తో నాలుగు పిచ్చి జోకులు వేయించి, వాళ్లతో చెత్తా డ్రెస్సులు వేయించి, స్వరజ్ఞానం వీసమెత్తు లేని హోస్టులతో పిచ్చి డాన్సులు చేయించి ఆహా ఓహో అని షో నిర్మాతలే జబ్బలు చరుచుకుంటే ఒరిగేదేమీ లేదు… అదే స్టార్ విజయ్ షోలో ఓ అబ్బాయి పాట లింక్ ఇది… (జూనియర్, జూనియర్)…
https://youtu.be/PDQ_xEqVkQA
https://www.youtube.com/watch?v=PDQ_xEqVkQA
Share this Article