Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…

June 5, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. ఈ సినిమా అనగానే నాకు మొదట గుర్తుకొచ్చేది అష్టలక్ష్ముల మీద హరికధే . అద్భుతమైన ఆలోచన , అందుకుతగ్గ చిత్రీకరణ , రెంటినీ మించి చిరంజీవి నటన .

శ్రీగజవదనం భవతరణం అంటూ సాగే ఈ హరికధ అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి వెళ్ళిపోయినా ఫరవాలేదు ; కానీ ధైర్యలక్ష్మిని మాత్రం వీడిపోవద్దు అని రాజు కోరుకుంటాడు . ఈ హరికధలో చిరంజీవి వెర్సటైలిటీ బ్రహ్మాండంగా కనిపిస్తుంది .

Ads

విజయ బాపినీడు దర్శకత్వంలో 1984 జూన్లో వచ్చిన ఈ మహానగరంలో మాయగాడు సినిమా నిజంగానే జనాల్ని చిరంజీవి మాయలో పడేసింది . జంధ్యాల గారు కధను చాలా బాగా నేసారు . కుటుంబాన్ని పోషించుకునేందుకు చిల్లర దొంగతనాలు చేసుకునే హీరో దొంగ సాక్ష్యం చెప్పి స్వంత బావనే హత్యానేరంలో ఇరికిస్తాడు . ఆ బావను రక్షించుకునే ప్రయత్నమే మిగతా సినిమా అంతా .

రొమాంటిక్ సినిమాలో సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ , క్రైం , థ్రిల్ , వగైరా దినుసులతో మాంచి మసాలా వండారు . ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా పాత్రల్ని మలిచారు . జంధ్యాల రచనా నైపుణ్యం తెలుస్తుంది . పోలీసులు తలచుకుంటే దొంగ కేసులు ఎలా బనాయిస్తారో , దారినపోయే అమాయకుల్ని ఎలా ఇరికిస్తారో , ఆ పోలీసుల వలయంలో నుండి బయటపడటం ఎంత కష్టమో గొప్పగా ఆవిష్కరించారు దర్శకుడు విజయ బాపినీడు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టయ్యాయి . ముఖ్యంగా టైటిల్ సాంగ్ . మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు పాట జనానికి ఊత పాట అయిపోయింది . ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మా యమ్మా అంటూ సాగే డ్యూయెట్ చిరంజీవి , విజయశాంతిల మీద హాట్ హాటుగా ఉంటుంది .

జయమాలిని , అనూరాధల మీద క్లబ్ పాట సరదాగా ఉంటుంది . తూగో జిల్లా పెద్దాపురం ఫేమస్ అంటూ రెండు గోదావరి జిల్లాలు , కృష్ణా జిల్లా , మా గుంటూరు జిల్లా తెనాలి అన్నీ కవరవుతాయి . చక్కటి చిత్రీకరణ . నూతన్ ప్రసాద్ మీద వెధవా ఒట్టి వెధవా పాట చవటాయను నేను నీకంటె పెద్ద చవటియని నేను పాటను గుర్తుకు తెస్తుంది . పాటల్ని వేటూరి , ఆత్రేయలు వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు శ్రావ్యంగా పాడారు .

చిరంజీవి తర్వాత ప్రేక్షకులు బాగా గుర్తుంచుకునే పాత్రలు అల్లు రామలింగయ్య , రావు గోపాలరావు పాత్రలు . సినిమా మధ్యలో ఉద్యోగాలలో స్థానభ్రంశం జరుగుతుంది . యస్సై హెడ్ అవుతాడు ,హెడ్ యస్సై అవుతాడు . బహుశా దీన్నే హలో బ్రదర్ సినిమాలో కోట శ్రీనివాసరావు , మల్లిఖార్జునరావుల మీద పెట్టి ఉంటారు .

గుర్తుండే మరో పాత్ర అల్లు అరవిందుది . చిరంజీవికి అసిస్టెంట్ దొంగగా బాగా నటించాడు . ఇతర ప్రధాన పాత్రల్లో విజయశాంతి , ఉదయకుమార్ , గిరిబాబు , సంగీత , మమత , నిర్మలమ్మ , నూతన్ ప్రసాద్ , సుత్తి వేలు , బాలాజీ , ప్రభృతులు నటించారు . నూతన్ ప్రసాద్ పిస్తా పహాడ్ డైలాగ్ వీర పాపులర్ అయింది . ఇప్పటికీ జనం వాడుతూనే ఉన్నారు . జ్యోతిలక్ష్మి , జయమాలినిలకు ఫుల్ లెంగ్త్ పాత్రలు లభించాయి . గ్లామర్ స్పేసుని విజయశాంతితో పాటు వీరిద్దరూ ఫిల్ చేసారు .

విజ్జి

కాశీ విశ్వనాధ్ డైలాగులు చాలా బాగుంటాయి . ఏ ఒక్క పదమూ వ్యర్థం కాకుండా , తూచి తూచి వాడారు . ఈ చిరంజీవి మాయ సినిమా ఇప్పటికీ కొత్త కొత్తగానే ఉంటుంది . అప్పుడప్పుడు ఏదో ఒక చానల్లో వస్తూనే ఉంటుంది .

యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు వెంటనే చేసేయతగ్గ సినిమా . చిరంజీవి అభిమానులు ఎన్ని సార్లయినా చూడవచ్చు . అంత మాయ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు (సినిమా బాగానే ఉన్నా ఎందుకో గాానీ పెద్దగా ఆడలేదు… ఏదో తేడా కొట్టేసింది…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions