Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ ఇతర ‘ఆంధ్ర’ పత్రికకైనా ఇలాంటి వార్త చేతనైందా..?

June 4, 2022 by M S R

దేశంలోనే టాప్ టెన్‌లో ఒకటి అని జబ్బలు చరుచుకుంటారు గానీ, ఎప్పుడైనా ఈనాడుకు ఇలాంటి వార్త ఒక్కటైనా రాసుకోవడం చేతనైందా..? దమ్మున్న నిప్పు పత్రిక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏనాడైనా ఒక్కటంటే ఒక్క వార్త ఇలాంటిది రాసుకోగలిగాడా..? ఈనాడుకు పోటీ, దీటు, పోటు, తోపు అని చెప్పుకుని నీలిగే సాక్షికి ఈ దమ్ముందా..? తెలుగులో సరే పోనీ.., డీసీ, హిందూ, ఎక్స్‌ప్రెస్ ఎట్సెట్రా పత్రికలు జాతీయ మీడియా అని ఫోజులు కొట్టడమే తప్ప ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయగలిగాయా..?

నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా… ఆంధ్రప్రభ ఓ మెగాసెసే ఐటమ్ ఫైల్ చేయగలిగింది… ఇదీ తన నిబద్ధతకు నిదర్శనంగా రాసుకుని చూపించింది… (ఇక్కడ మెగాసెసే అనగా, మెగా ఫ్యామిలీ, మెగా పార్టీలో ఉండటం వల్ల లభించే అవార్డు కాదు లెండి…) ఇంతకూ వార్త ఏమిటంటే..? హైదరాబాదులోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ విప్ కూడా..! ఆయన్ని ఆంధ్రప్రభ టీం వెళ్లి కలిసింది… అందులో సర్క్యులేషన్ ముఖ్యులు కూడా ఉన్నారట…

సో వాట్..? రిపోర్టర్లు ప్రజాప్రతినిధులను కలవడం కామనే కదా… పైగా ఇప్పుడు యాడ్స్ కోసం, వార్షిక చందాల కోసం కూడా తరచూ వెళ్లి కలవాల్సి వస్తోంది… మరి ఇందులో న్యూస్ ఏముంది అంటారా..? అవును అదే కదా విశేషం… అదే వార్తగా మారిపోయింది… రెండు ఫోటోలు… అయిదు కాలాలు…

Ads

prabha

వీళ్లంతా కట్టకట్టుకుని ఎమ్మెల్యే దగ్గరకు పోవడం ఏమిటో… జాతికి, వ్యక్తిగతంగా తనకు ఆంధ్రప్రభ చేస్తున్న నిరుపమాన సేవల్ని ఆయన ప్రస్తుతించడం ఏమిటో… పనిలోపనిగా ఓ పొలిటికల్ ప్రసంగం చేసేయడం ఏమిటో… అది ఐదు కాలాల వార్తగా తెల్లారే ప్రత్యక్షం కావడం ఏమిటో… ఈ జర్నలిజాన్ని ఏమనాలో… ఏ పేరుతో పిలవాలో… ఈ ఫీల్డులో తలలు బాగా తెల్లపండిన పెద్దలు ఓసారి ఆలోచించాలి… రాబోయే జర్నలిజం పాఠ్యపుస్తకాల్లో అదే పేరుతో ఓ అధ్యాయం రాయడానికి వీలుగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions