విరాటపర్వం ప్రమోషన్లకు సంబంధించి… రెండు గంటలకోసారి ట్రెయిలర్‌కు వస్తున్న యూట్యూబ్ వ్యూస్ సంఖ్యను 4 మిలియన్లు, 5 మిలియన్లు, 6.5 మిలియన్లు అని చెప్పుకుంటున్నారు… నంబర్ వన్ ట్రెండింగ్ అని కూడా..! చివరకు దర్శకుడు వేణు కూడా… ఒకింత నవ్వొచ్చింది… అసలు యూట్యూబ్ వ్యూస్ అనేదే పెద్ద దందా… అది పాపులారిటీకి సరైన ఇండికేటర్ కాదు… అఫ్‌కోర్స్, విరాటపర్వం సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది… కానీ దానికి సరైన సూచిక ఇది కాదు… ఆ వ్యూస్ కూడా సినిమా వసూళ్ల లెక్కలంత ఫ్రాడ్…
ఓ ఉదాహరణ చెప్పుకుందాం… ఇండస్ట్రీలో భీకరమైన జాతీయవాదిని, నిజాయితీవాదిని అని ఘనంగా చెప్పుకునే కంగనా రనౌత్ థాకడ్ సినిమా… ఒకసారి ట్రెయిలర్ రిలీజ్ చేస్తే 3.7 కోట్ల వ్యూస్… మరోసారి సెకండ్ రిలీజ్‌కు 2.3 కోట్ల వ్యూస్… చివరకు ఆ ట్రెయిలర్ రిలీజ్ చేయడానికి ఆమె హెలికాప్టర్‌లో వచ్చిన వీడియోకు కూడా 11 లక్షల వ్యూస్… ఆమె వేసుకున్న ఆ చెత్తా డ్రెస్ మీద ఎవరో వీడియో చేస్తే 22 లక్షల వ్యూస్… కానీ..?
Ads
తీరా సినిమా రిలీజయ్యాక ఏం జరిగింది..? 90 కోట్లు పెట్టి ఆ సినిమా తీస్తే 2, 3 కోట్లు కూడా వాపస్ రాలేదు… ఎనిమిదో రోజున 20 టికెట్లు, 4400 రూపాయల వార్త అందరూ చదివారు కదా… ఇప్పటివరకు బాలీవుడ్ మొత్తం చరిత్రలో ఇంతటి డిజాస్టర్ సినిమా మరొకటి లేదు… చివరకు ఈ దెబ్బకు ఈ సినిమా కొనడానికి ఏ శాటిలైట్ చానెల్ గానీ, ఏ ఓటీటీగానీ ముందుకు రాలేదు…
ఈ ఘోర పరాజయానికి పూర్తిగా కంగనాయే కారణం కాకపోవచ్చు, రకరకాల రీజన్స్ ఉండవచ్చు… కానీ ఆమె ఓవర్ యాక్షన్ కారణంగా ఫెయిల్యూర్ దుమ్ముదుమారం ఆమె చుట్టూరా కేంద్రీకృతమైంది… (అందుకే ఎందులోనూ అతి చేయకూడదని పెద్దల మాట, చివరకు థాకడ్ ట్రెయిలర్ లాంచ్‌కు వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ పరమ చెత్త…)… ఆమె నటించిన తేజస్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది… ఆమె మీడియాను పెద్దగా దేకదు కదా… ఇదే థాకడ్ ప్రెస్‌మీట్‌లో కూడా రిపోర్టర్ల మీద వెటకారాన్ని దట్టించింది… దాంతో థాకడ్ ఫెయిల్యూర్ మీద ఎడాపెడా రాసేస్తూ నేషనల్ మీడియా పండుగ చేసుకుంటోంది…
ఆ ప్రభావంతో తేజస్ సినిమా కొనడానికి బయ్యర్లు రావడం లేదు… పోనీ, థియేటర్లను వదిలేసి ఓటీటీకి అమ్మేసి బయటపడాలని అనుకుంటే వాళ్లూ ముందుకు రావడం లేదు… ఏమి సేతురా లింగా అని నిర్మాతలు తలలుపట్టుకున్నారు… ఇందిరాగాంధీ మీద ఎమర్జెన్సీ అని ఓ సినిమా… మరో డిజాస్టర్ వస్తోంది అని మీడియా, సోషల్ మీడియా వెక్కిరింపులు అప్పుడే షురూ… ‘‘నో, నో, మణికర్ణిక 160 కోట్ల సినిమా… తరువాత తలైవి ఓటీటీలో సూపర్ హిట్… ఇప్పుడు చేస్తున్న లాకప్ అనే రియాలిటీ షో సూపర్ హిట్… ఇదే మీడియా నన్ను బాక్సాఫీస్ క్వీన్ అని రాసింది…’’ అని ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నది ఆమె ఇప్పుడు…
సో, ఇదంతా విరాటపర్వం సినిమాకు దిష్టి తీయడం కాదు, అశుభం కోరుకోవడమూ కాదు… కానీ కేవలం ట్రెయిలర్లకు యూట్యూబ్ వ్యూస్ అనే ఓ ఫేక్ దందా అక్కర్లేదు అని చెప్పడానికి..! టికెట్ల ధరలు తగ్గించాం అని నిర్మాత చెబుతున్నాడు కదా… అలాంటి పాజిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పుకోవడమే బెటర్…!!
Share this Article