Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రాంక్, ఫేక్, స్టెంట్… ఇజ్జత్ పూర్తిగా పోగొట్టుకున్న ఈటీవీ, మల్లెమాల…

June 7, 2022 by M S R

హైపర్ ఆది అరెస్టు… అని ప్రముఖ సైట్లు ఎడాపెడా రాసేశాయి… ఏమిటయ్యా అంటే..? హైపర్ ఆది కారుతో ఒకడిని ఢీకొట్టాడట, వాడు చావుబతుకుల్లో ఉన్నాడట, శ్రీదేవి డ్రామా కంపెనీ షో మధ్యలో పోలీసులు ప్రవేశించి, ఆదిని అరెస్టు చేశారట… ఇదీ వార్త… నిజం ఏమిటయ్యా అంటే… అది ఈటీవీ వాడు అతి తెలివితో ప్రసారం చేసుకున్న ఓ పిచ్చి ప్రోమో… దిగజారిపోయిన మల్లెమాల క్రియేటివిటీకి ఓ సూచిక… అయితే అది ఫుల్లు ఎదురుతన్ని ఈటీవీ, మల్లెమాల ఇజ్జత్ మొత్తం గాలిలో కలిసిపోయింది…

సుడిగాలి సుధీర్‌ను అవమానకరంగా చానెల్ నుంచి, మల్లెమాల కంపెనీ నుంచి పంపించేశారు… శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు యాంకర్‌గా చేసేవాడు తను… తనతోపాటు ఇంద్రజ ఓనర్ కమ్ జడ్జి పాత్రలో ఉండేది… ఇద్దరూ వెళ్లిపోయారు… దాంతో ఢీ, జబర్దస్త్ షోలకు తోడుగా దీని రేటింగ్స్ కూడా ఢమాల్ అనే అనుమానమొచ్చి రష్మిని తీసుకొచ్చి యాంకర్‌ను చేశారు… రాగానే హిప్ డాన్సులతో హడావుడి స్టార్ట్ చేసింది… కానీ ఆమెకు బేసిక్‌గా యాంకరింగే సరిగ్గా చేతకాదు…

ఢీ నుంచి వెళ్లగొట్టిన పూర్ణను తీసుకొచ్చి నువ్వే జడ్జివి అన్నారు… ఇక మీ ఇద్దరే ఏలుకొండి అని హైపర్ ఆదికి, ఆటో రాంప్రసాద్‌కు చెప్పారు… సుధీర్, గెటప్ సీను వెళ్లాక తానేదో ఒంటరివాడయినట్టుగా ఓ డ్రామా స్కిట్ చేయించి, తెగ ఏడ్చేశాడు రాంప్రసాద్… కానీ ఇంకేదో మసాలా వేస్తే తప్ప షో నిలబడదు అని అర్థమైపోయి పిచ్చి ప్రోమోలకు సంకల్పించారు నిర్వాహకులు, కానీ అవైనా కాస్త ప్లానింగుతో చేస్తే బాగుండేది…

Ads

యూట్యూబులో చిన్నచిన్న పోరగాళ్లు కూడా చేసే ప్రాంక్ వీడియోలు కూడా కాస్త బాగుంటాయేమో… అదుగో, అంత నాసిరకం ప్రాంక్స్ స్టార్ట్ చేశారు మల్లెమాల వాళ్లు… నన్ను తాకుతావురా అని పూర్ణ ఇమ్మూను కసురుకోవడం… రాంప్రసాద్ మీదకు రష్మి స్పృహతప్పిపడిపోవడం… అలాంటివే… తీరా చూస్తే ఒరిజినల్ ఎపిసోడ్‌లో ఏమీ ఉండదుగా… ఫేక్, ప్రాంక్, స్టెంట్ అని అర్థమైపోయి జనం ఈ క్రియేటివిటీ, ఈ రేటింగ్స్ వెంపర్లాట చూసి పకపకా నవ్వుకుంటున్నారు…

అంతకుముందు ఎవడికో మల్లెపూల బాషింగం కట్టేసి, రష్మి పక్కన కూర్చోబెట్టి, సుధీర్ వదిలేసిన రష్మి ఇంకెవడినో పెళ్లి చేసుకుంది అనే కలర్ ఇచ్చారు… అది మరీ నాసిరకం డ్రామా అని తేలిపోయింది… ఈసారి హైపర్ ఆది మీదే ఓ ప్రాంక్ చేశారు… షో మధ్యలో పోలీసులు వచ్చి అరెస్టు చేయడం అదే… అయితే ఇది ఎందుకు ఇజ్జత్ తీసిందంటే..?

అసలు హైపర్ ఆదికి ఏ డ్రైవింగూ రాదు, అది తనే చెప్పాడు పలుసార్లు… సుధీర్, ఆది స్కిట్లు చూసే లక్షలాది మంది ప్రేక్షకులకు తెలుసు… మరి డ్రైవింగ్ రాని ఆది యాక్సిడెంట్ ఎలా చేశాడు…? ఇదే అడుగుతూ ఆ ప్రోమో వీడియోలో ఆడుకుంటున్నారు నెటిజనులు… ‘‘ఆదిని అరెస్టు చేస్తే టీవీ9 వాడు ఊరుకునేవాడా..? అదే ఈటీవీ స్టూడియో ఎదుట 12 కెమెరాలు పెట్టి, రచ్చ చేసేవాడు కాదా..? ఈమాత్రం కామన్ సెన్స్ లేదా ఈ ప్రాంక్ ప్రోమోలు చేసేవాడికి..?’’

…. ఇలాంటి వ్యాఖ్యలు, డిబేట్లతో మల్లెమాల స్టెంట్ వేషాలు నవ్వులపాలయ్యాయి… మొన్నామధ్య విష్వక్సేన్ సినిమా కోసం తీయబడిన ఓ ప్రాంక్, తరువాత కరాటే కల్యాణి ఎవడో ప్రాంక్ క్రియేటర్‌ను తన్నిన వీడియో బాగా కలకలం రేపాయి కదా… ఇప్పుడది ఏకంగా ఈటీవీ వంటి ప్రముఖ చానెళ్లకూ ఆదర్శంగా మారింది… షో ప్రమోషన్ కోసం మరీ ఈ స్థాయికి దిగజారాలా..? అదీ అసలైన విషాదం… ఈటీవీ ఇంకా దిగాల్సిన మెట్లు ఎన్ని ఉన్నాయో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions