Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… నయనతార పెళ్లి వెనుక ఈ మంచి విశేషాలూ ఉన్నాయా..?!

June 10, 2022 by M S R

అబ్బా… అంటే సుందరానికీ..! కథ కాదురా భయ్… అదేదో దిక్కుమాలిన కథ, కథనం… దాన్ని అలా వదిలెయ్… నాకు పిల్లలు పుట్టరు, ఆమే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి ఇతడు హాంఫట్ అనిపిస్తాడట… నాకు వాడివల్లే కడుపొచ్చింది అని ఆమె అబద్ధం ఆడి అబ్రకదబ్ర అంటుందట… హసీమజాక్ అయిపోయిందిర భయ్… దాని ఖర్మానికి వదిలేస్తే… మనం నయనతార, విఘ్నేష్ పెళ్లి గురించి మాట్లాడుకుందాం…

ఫోటోలు పబ్లిష్ చేస్తున్నారు… ఎడాపెడా బోలెడు ఫోటోలు కుమ్మేస్తున్నారు… అదేదో సీతారామకల్యాణం తరహాలో ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా మీడియా తెగ హంగామా చేస్తోంది… అరె, ఏముందిర అందులో… ఆమెకు లవ్వులు కొత్త కాదు… చాలా కథలున్నయ్… ఇదే విఘ్నేషుడితో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది… పెళ్లి ఒక్కటే తక్కువ… ఆ పెళ్లికి ఈ ప్రాధాన్యం ఏందిరా అనడక్కండి… అదంతే… రేప్పొద్దున ఆమె కడుపు ఫోటోలు, వార్తలకు ప్రిపేరైపోవాలి వాళ్లంతా… అసలు ఆ కడుపే ఆమె అర్జెంటు పెళ్లికి కారణం అనీ అంటున్నారు కదా…

nayan

Ads

సరే, ఆమె పెళ్లికి వచ్చిన సెలబ్రిటీల గురించి రాశారు తప్ప… మర్యాదకు వచ్చిపోతారు, పిలిస్తే కాదంటారా ఏం..? కానీ, ఒక్కడైనా ఆమె పెళ్లికి ఆ దంపతులు రాష్ట్రవ్యాప్తంగా చారిటీ ప్రోగ్రామ్స్ నిర్వహించారు, ఎవడైనా రాశాడా..? అనాథాశ్రమాలు, గుళ్లు, వృద్ధాశ్రమాల్లో కనీసం లక్ష మందికి భోజనాలు పెట్టించారు… ఎస్, పెళ్లికి వచ్చిన ఆహుతులకు ఎవడైనా భోజనాలు పెట్టిస్తారు… కానీ రాష్ట్రంలో మంచి భోజనం కోసం ఎదురుచూసే లక్ష కడుపులకు పెళ్లిభోజనం పెట్టించడం గ్రేట్ కదా…

nayan

సరే, అదీ వదిలేద్దాం… మంచి రాస్తే, దాన్ని మీడియా అని ఎందుకంటారు..? పెంట వాసన కొడితేనే మీడియా కదా… డయానా మరియమ్ కురియన్ అలియాస్ నయనతార… క్రిస్టియన్ కదా, మరి హిందూ పద్ధతిలో తాళి కట్టించుకుందేమిటి… వెంటనే తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకుంది… (ఇక్కడా వివాదమే, చెప్పులతో పోయిందట… గుడిలోకి పోయిందా, లేదు కదా… ఏదో ఒకటి కంపు కంట్రవర్సీ…) తన మతాన్ని ఆమె వదిలేసిందా..? ఫాఫం, సమంతలాగా అక్కినేని కుటుంబం తలలు లేదా మెడలు వంచి, చైతన్య అనేవాడు ఎలాగూ తన మాయల కొంగున కట్టేయబడి ఉన్నందున ఇటు హిందూ పద్ధతిలో… అటు క్రిస్టియన్ పద్ధతిలో ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనడిగాడు ఓ మిత్రుడు…

పైన ఫోటో చూసి భయపడకండి… సినిమా తారలు అలాగే ఉంటారు… విషయానికొస్తే… ఆమె ప్రస్తుతం క్రిస్టియన్ కాదు… హిందువే… అప్పట్లో ప్రభుదేవాను పడేసింది కదా… తన భార్యను విడాకులు కూడా ఇచ్చేశాడు ఈమెను పెళ్లిచేసుకోవడానికి… బాపు తీసిన శ్రీరామరాజ్యం సినిమాలో చివరిరోజు కన్నీళ్లు పెట్టుకుంది… ఇక నా కెరీర్‌కు ఫుల్ స్టాప్ అని చెప్పింది… సీన్ కట్ చేస్తే… అదే ప్రభుదేవాకు బైబై చెప్పింది… తను పిచ్చోడై పోయాడు…

కాకపోతే ఒకటి మాత్రం నిజం… తమిళంలో నంబర్ వన్ స్టార్ ఆమె… శింబుతో ప్రేమ గురించి గానీ, ప్రభుదేవాతో బ్రేకప్ గురించి గానీ ఆమె బ్లఫ్ చేయలేదు… ఉన్నదున్నట్టు చెప్పింది… అంతేకాదు, ప్రభుదేవాతో పెళ్లి కోసం మతం మారింది… క్రిస్టియానిటీ నుంచి హిందూమతంలోకి మారింది… చెన్నైలోని ఆర్యసమాజ్‌లో శుద్ధికర్మ చేయించుకుంది… (అసలు ఈ శుద్ధికర్మ హైందవంలో ఉందా, సమర్థనీయమేనా, శాస్త్రీయమేనా అనే చర్చ కూడా కొన్నాళ్లు నడిచింది, అది వేరే కథ…) సో, అర్థమైంది కదా… ఆమె పెళ్లి హిందూ పద్ధతిలో ఎందుకు జరిగిందో..!! ఇన్నాళ్లూ కలిసే ఉంటున్నారు, అర్జెంటుగా ఈ పెళ్లి వెనుక కడుపు కథ ఉందా..? ఆమె మళ్లీ సినిమాల్లో నటించకూడదని విఘ్నేష్ తల్లి షరతు పెట్టిందట, ఆమె అంగీకరించిందట నిజమేనా అనడక్కండి… బోలెడు గొట్టపు వార్తలు దొరుకుతయ్… ప్లీజ్ ట్యూన్ దెమ్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions