రాంమాధవ్… హిందూపరివార్‌లో చాలా కీలకమైన వ్యక్తి… ఆర్ఎస్ఎస్‌లో ముఖ్యమైన పాత్ర… ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్‌లో నాన్-బీజేపీ భావజాలమున్న శక్తులతోనూ సంబంధాలు నెరిపి, బీజేపీ కొత్త దశకు డ్రైవర్‌గా పనిచేశాడు… కానీ ఏమైందో ఏమో తెలియదు… నిజానికి మోడీకి ఆర్ఎస్ఎస్ కోర్ శక్తులతో మోడీకి సత్సంబంధాలు లేవని తెలుసు… ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కొన్ని పరిమితుల్లో మాత్రమే మోడీకి సపోర్ట్ చేస్తుందనీ తెలుసు… ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, భజరంగ్‌దళ్ వంటి ఆర్గనైజేషన్లను మోడీ అండ్ షా తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడనీ తెలుసు… కానీ..?
దేశమంటే కేవలం అంబానీ, ఆదానీలేనా..? అది మోడీకి తెలుసో లేదో… కాకపోతే తన హవా నడుస్తోంది… సక్సెస్ తనను దూకుడుగా ముందుకు నడిపిస్తోంది… అలాగని మొత్తం హిందుత్వ శక్తులన్నీ తనకు బాసటగా ఉన్నాయని కాదు… టైమ్ బీయింగ్… సపోర్ట్ చేస్తున్నాయి… అదెంత కాలమో కాలమే చెబుతుంది… ఇదీ నేపథ్యం… ఇక్కడే రాంమాధవ్ వ్యాఖ్య ఒకటి ఇంట్రస్టింగు…
ఇవి పెద్దగా మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఆకర్షించవు… కానీ వాటి ప్రాధాన్యం వేరు… లోతుల్లోకి వెళ్తేగానీ సమజ్ కావు… బీజేపీలో మోడీకి, షాకు ఎప్పుడైతే రాంమాధవ్ ‘‘కానివాడు’’ అనగా, వాళ్లకు పనికిరానివాడు అయ్యాడో… వెంటనే తనను పక్కకు తప్పించారు… ఈకలు, తోకలు కత్తిరించారు… దాంతో అనివార్యంగా తను ఆర్ఎస్ఎస్ క్యాంపుకి వాపస్ వెళ్లిపోవాల్సి వచ్చింది… తను ఇప్పుడు ఏమంటున్నాడంటే..?
Ads
‘‘చైనాతో సరిహద్దు సమస్యల పరిష్కారంపై తొందరపడొద్దు, నా హయాంలోనే సమస్య పరిష్కారం కావాలి అనేది సరికాదు… అది తొందరపాటు ధోరణి… చైనాతో రష్యాకు ఉన్న సరిహద్దు సమస్యను బోరిస్ ఎల్స్‌తిన్ అనే తాగుబోతు ప్రెసిడెంట్ పరిష్కరించాడు… అది గుర్తుంచుకోవాలి… తను ఆ సమస్యను పరిష్కరిస్తాడు అని ఎవడూ ఊహించలేదు, కానీ తనే సాధించాడు, చరిత్రలో నిలిచాడు…’’ అని రాంమాధవ్ చెబుతూ పోయాడు… ఎక్కడ..?
చైనా బ్లడీస్ బుల్లెట్ లెస్ బార్డర్స్ అనే ఓ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు… ఇక్కడ కొన్ని సందేహాలు, పాత జ్ఞాపకాలు… అప్పట్లో ముషరఫ్ పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉండేవాడు… ఆగ్రాకు వచ్చాడు… మన అమాయక చక్రవర్తి వాజపేయి ప్రధాని… పాకిస్థాన్ సరిహద్దుల మీద ఏదో ఒప్పందం మీద సంతకానికి రెడీ అయిపోయాడు…
వాజపేయి డొల్ల… సారీ, భోళా తత్వం ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనీ, ముషరఫ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ నొటోరియస్ కేరక్టర్ అని తెలిసిన ఆర్ఎస్ఎస్ అడ్డుపడింది… సంతకాలు, ఒప్పందాలు లేకుండా అద్వానీని ముందుపెట్టి చక్రం అడ్డేసింది… తరువాత ముషరఫ్ ధూర్త కేరక్టర్ జనానికి తెలిసింది… (ఇప్పుడు చావుబతుకుల్లో ఉన్నాడు…) మరి ఇప్పుడు అదే స్టయిల్‌లో చైనాతో సరిహద్దు సమస్యకు హడావుడి ఒప్పందాలకు తొందరపడుతున్నది ఎవరు..? తను క్రెడిట్ తీసుకోవాలని తహతహలాడుతున్నది ఎవరు..? మోడీయేనా..?!
చైనా జీవితకాల అధినేత జిన‌్‌పింగ్‌ను ఆర్ఎస్ఎస్ ముషరఫ్‌కు భిన్నంగా ఏమీ చూడదు… కానీ మోడీకి దోస్త్… ఆ దోస్తీని అడ్డుపెట్టుకుని జిన్‌పింగ్ అనేవాడు మోడీని తప్పుదోవ పట్టించి, దేశ ప్రయోజనాలను భ్రష్టుపట్టిస్తాడనేది ఆర్ఎస్ఎస్ సందేహమా..? అందుకే ఈ ముందస్తు హెచ్చరికలా..? నిజంగానే అప్పట్లో ముషరఫ్‌ను వాజపేయి నమ్మినట్టే జిన్‌పింగ్‌ను మోడీ నమ్ముతున్నాడా..? ఆర్ఎస్ఎస్ ఇలాగే అనుమానిస్తోందా..? తొందరపడకు అని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోందా..? అలాంటప్పుడు రాబోయే ఎన్నికల్లో మోడీకి బదులుగా ఏ యోగినో ఆర్ఎస్ఎస్ బలంగా ప్రధాని అభ్యర్థిత్వానికి ముందుకు తీసుకురాగలదా..? నిజానికి యోగియే ఆర్ఎస్ఎస్‌కు విధేయుడు కాదు… తన బాట వేరు… తన ధిక్కార ధోరణి వేరు…
మరి ఒకవేళ ఆర్ఎస్ఎస్ గనుక మోడీ ‘చైనా సయోధ్య’ ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తే… మోడీషా క్యాంపుకూ, ఆర్ఎస్ఎస్ బేస్ క్యాంపుకూ నడుమ దూరం పెరుగుతుందా..? మోడీ విడిపోయి సొంతంగా ప్రయాణించగలడా..? భార్యను వదిలేసి, సంసారాన్ని త్యజించి, ఆర్ఎస్ఎస్ కమిటెడ్ కార్యకర్తగా తన జీవితాన్నే అంకితం చేసి పనిచేసిన మోడీ తన మాతృసంస్థకు వ్యతిరేకంగా పోగలడా..? పోయేంతగా మారిపోయాడా..? ఖలిస్థానీ శక్తులకు వెరిచి క్షమాపణలు చెప్పి, అరబ్ దేశాలకు తలొగ్గిన మోడీ మీద ఆర్ఎస్ఎస్ నిజంగానే కుతకుతలాడుతోందా..?! పోనీ, బలమైన కార్పొరేట్ శక్తుల మద్దతు ఉన్న మోడీకి ప్రత్యామ్నాయం ఏమిటో ఆర్ఎస్ఎస్ రెడీగా ఆలోచించి పెట్టుకుందా..?!
Share this Article