85 సంవత్సరాలు… అవును… విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వయస్సు అది… స్టిల్ యాక్టివ్… యాక్టివ్ అనుకునే ఏడాది క్రితం మమత తనను పార్టీలో చేర్చుకుంది… కారణం, మోడీ వ్యతిరేకి కాబట్టి… బీజేపీ మీద పగబట్టి ఉన్నాడు కాబట్టి… మోడీ బ్యాచ్ తనకు పొగబెట్టి బయటికి తరిమేశారు కాబట్టి… దేశంలో మోడీకి ఎదురుగా పోరాడేది మమత అనే భ్రమల్లో ఉన్నాడు కాబట్టి… తను పార్టీలో చేరినా సరే పెద్దగా ఏ పదవులూ ఆశించలేడు కాబట్టి… వయస్సైపోయినవాడు కాబట్టి… కానీ..?
మమతకు అనుకోకుండా మైండ్‌లో స్ట్రయికైంది… ఎలాగూ మోడీ పొగచూరిన కేరక్టర్ కదా యశ్వంత్… తన పార్టీకి పెద్దగా యూజ్ లేదు… పార్టీలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు… జీవితమంతా కాషాయ శిబిరంలో గడిపాడు… మాజీ ఐఏఎస్ బ్యూరోక్రాట్… కేంద్ర మంత్రిగా కూడా చేశాడు… మోడీషా అద్వానీతోపాటు థింక్ ట్యాంక్ అనబడే లూప్ లైన్లోకి తనను కూడా తరిమేశారు కాబట్టి… ఎలాగూ విపక్షాలకు ఎవరూ దొరకడం లేదు కాబట్టి… చివరకు ఆ పోటీకి పెద్దగా పనికిరాని ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి పోటీ మాకు అక్కర్లేదు అని చెప్పేశారు కాబట్టి…
సమయానికి ఇంకెవరూ దొరకడం లేదు కాబట్టి… ఈ యశ్వంత్ అనే గత జీవితపు కాషాయ కేరక్టర్ గెలిచినా ఓడినా తనకు ఏమీ ఫరక్ పడదు కాబట్టి… తన పార్టీ పెత్తనమే నడవాలి కాబట్టి… ఒప్పుకుంటే ఒప్పుకొండి, లేకపోతే మీ చావు మీరు చావండి అన్నట్టుగా మమత చాలా తెలివిగా యశ్వంత్‌ను పోటీకి ప్రోత్సహించింది… అసలే పొగచూరిన బతుకు కదా… పగతో సై అనేశాడు… పోయిందేముంది..? గుట్టకు వెంట్రుక కట్టి లాగడం… వస్తే వరం… రాకపోతే ఓ వెంట్రుక… ఇప్పుడు తన జీవితంలో పెద్దగా ఉద్దరించేది కూడా ఏమీ లేదు కదా…
Ads
తను గెలుస్తాడనే భ్రమలు తనకు ఏమీ లేవు… మమత పెట్టిన మీటింగుకే 4 పార్టీలు డుమ్మా… తీరా తదుపరి మీటింగుకు ఆమె రానని చెప్పింది… శరద్ పవార్ నేను మీటింగు పెడతానులే అన్నాడు… ఈలోపు రాహుల్ ఈడీ విచారణ సీరియస్ అయిపోతూ వాళ్లు కాన్సంట్రేట్ చేయలేని దుస్థితి… మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోతూ శరద్ పవార్ కిక్కుమనలేని దురవస్థ… ప్రధాన విపక్షాల్లో ఏడెనిమిది పార్టీలు లైట్ తీసుకుంటున్న పరిస్థితి… సో, సిట్యుయేషన్, లెక్కలు, నంబర్లాట తెలియనంత అమాయకపు పక్షి ఏమీ కాదుగా…
ఐనాసరే, పగతో ఉన్నాడు… ఇంత మేధావిని నన్ను మోడీ మక్కీఛూజ్ అని తీసి పారేస్తాడా..? పార్టీ పట్టించుకోదా..? మరి నా విలువ ఏమిటి అని రగిలిపోతున్నాడు కొన్నాళ్లుగా… అందుకే టీఎంసీలో చేరాడు… జస్ట్, ఏడాది క్రితమే… మళ్లీ వార్తల తెర మీదకు వస్తాడు… ఈ వయస్సులో మళ్లీ పాపులారిటీ… ప్రజాస్వామిక వాతావరణం, విపక్ష ఐక్యత, యాంటీ మోడీ ఎట్సెట్రా లక్ష్యాలకు ప్రతీక అవుతాను అనుకున్నట్టున్నాడు… సై అన్నాడు… ఇప్పుడు రాహుల్, సోనియా ఇబ్బందికరంగా ఫీలవుతున్న నేషనల్ హెరాల్డ్ కేసును బయటికి తవ్విన ఆ సుబ్రహ్మణ్య స్వామే ఇదే యశ్వంత్ సిన్హా మీద అప్పట్లో యూటీఐ స్కాం ఆరోపణలు చేశాడు… ఏమో, గుర్రమెగురావచ్చు అంటారా..? కానివ్వండి, మంచిదేగా… మోడీని గిల్లీ గిల్లీ అవస్థ పెట్టే రాష్ట్రపతి వస్తే థ్రిల్లేగా మరి..!!
Share this Article