సీనియర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్నాళ్లుగా బొచ్చెడు వార్తలు… ఆమె పాత భర్త, పిల్లల గురించిన వార్తలు… నరేష్ పాత మూడు పెళ్లిళ్లు, పెళ్లాల వార్తలు… వాళ్లు ఇప్పుడు కలిసి తిరుగుతున్న వార్తలు… ఆమెకు విడాకులు అధికారికంగా రాగానే పెళ్లి చేసుకుంటారనే వార్తలు చాలామంది రాసేస్తున్నారు…
ఎస్, పెళ్లిళ్లు, విడాకులు ఇండస్ట్రీలో… కాదు, కాదు, సమాజంలోనే అధికమైపోయాయి కాబట్టి ఇదొక అసహజ పరిణామంగా ఏమీ చూడలేం… అరవై దాటాక నాలుగో పెళ్లేమిటోయ్ అని ఎవరూ అడగటానికి కూడా లేదు… ఆమె వయస్సు మరీ 43… సో వాట్ అంటారా..? అవన్నీ వదిలేస్తే… నరేష్ పెళ్లి మీద చేసిన వ్యాఖ్యల్ని ఓసారి మనం మాట్లాడుకోవాలి… తను ఏమంటాడంటే..?
‘‘మేం సెలబ్రిటీలం కాబట్టి మా విషయాలన్నీ బయటకు తెలుస్తాయి… బయటవాళ్లవి కనిపించవు…’’ నిజమే, సెలబ్రిటీల వార్తలకు పాఠకాసక్తి ఉంటుంది… సో, మీడియా ఫోకస్ చేస్తుంది… అదీ సహజమే…
Ads
‘‘ఏం మిగిలినవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం లేదా..? పెళ్లి అంటే ఆట కాదు, పెళ్లి అంటే లైఫ్… ఆ లైఫ్‌లో ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తే తప్ప వేరే పెళ్లి నిర్ణయానికి రారు…’’… నిజమే… నరేష్ సర్, మీ పాత మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడానికి పాత పెళ్లాలు మిమ్మల్ని అంతులేని మానసిక క్షోభ పెట్టారా..? మాకు కాబోయే నాలుగో పెళ్లాం అని చెప్పబడుతున్న పవిత్ర పాత భర్త సుచేంద్ర ప్రసాద్ వల్ల ఆమె క్షోభ అనుభవించిందా.?. అందుకే నీతో పెళ్లికి సై అంటోందా..? సరే, సరే, అంగీకరిద్దాం… మూడు పెళ్లిళ్లు కాలగతిలో కలిసిపోయి, నాలుగో పెళ్లికి రెడీ అయిపోతున్న నువ్వు పెళ్లి అంటే ఆట కాదు అని వ్యాఖ్యానించడం విచిత్రంగా లేదా..?
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ వ్యవస్థే తప్పు, పెళ్లయిన నెల రోజులకే భార్యాభర్తలు విడిపోతున్నారు… గతంలో ఒకే ఫ్యామిలీ కోర్టు ఉండేది… ఇప్పుడు 8 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి…’’…. నిజమే అనుకుందాం… వివాహ వ్యవస్థే తప్పు అని తెలియడానికి మూడు పెళ్లిళ్ల అనుభవాలు అక్కరకొచ్చాయి… అదీ సరే, మరి అలాంటి అభిప్రాయం ఉన్నవాడివి నాలుగో పెళ్లికి ఎందుకు రెడీ అవుతున్నట్టు..? ఒకవేళ అది నిజం కాకపోతే… నో, పవిత్రను నేను పెళ్లి చేసుకోవడం లేదు, చేసుకోను, ఇక జీవితంలో పెళ్లే చేసుకోను అని చెప్పొచ్చుగా… ఈ ద్వంద్వ పోకడ ఏమిటి..?
ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండేవాళ్లు ఉంటున్నారు… కొద్దిరోజులకే బ్రేకప్ అంటున్నవాళ్లు ఉన్నారు… పెళ్లయినా సరే ఇతరత్రా సంబంధాలు ఉన్నవాళ్లు బొచ్చెడు… వాళ్ల ఇష్టం… భారతీయ వివాహ వ్యవస్థ మీద అద్భుత వ్యాఖ్యానాలు చేసే నరేషయ్య గారూ… నీ ఇష్టమొచ్చినట్టు పెళ్లిళ్లు చేసుకుంటావు, వదిలేస్తావు… కొత్తవాళ్లను పట్టేస్తావు సరే… మరి పిల్లల మాటేమిటి..? కుటుంబం కలిగి ఉండే వాళ్ల హక్కు మాటేమిటి..? సొసైటీలో వాళ్లు ఎదుర్కునే వివక్ష మాటేమిటి..? వాళ్ల భద్రత మాటేమిటి..? నీ పాత పెళ్లాల పిల్లలు, నీ కాబోయే కొత్త పెళ్లాం పాత పిల్లల మాటేమిటంటావ్..? వాళ్ల ఖర్మ, కనిపారేయడం వరకే నా బాధ్యత అంటావా కొంపదీసి..?!
‘‘ఆర్టిస్ట్ అనేవాడికి స్థిరత్వం లేదు, సెక్యూరిటీ లేదు, టైమింగ్ లేదు, నా వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునేవాళ్లే నాతో ఉంటారు…’’… ఇదీ నిజమే అనుకుందాం… ముగ్గురు పాత పెళ్లాలు నీ వృత్తి జీవితాన్ని అర్థం చేసుకోలేదు సరే… అందుకే వదిలేశావు సరే… ఫాఫం, వాళ్ల ఖర్మ… మరి నాలుగో పెళ్లాంతో అదే సమస్య వస్తే..? పవిత్రకూ ఫాఫం అన్యాయం చేసేయడమేనా..? ఆమె అంతగా ఓ ఆర్టిస్టు వృత్తి జీవితాన్ని అర్థం చేసుకునేదే అయితే పాత భర్త సుచేంద్ర ప్రసాద్‌తో విడిపోయేది కాదు కదా… కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ ఎట్సెట్రా ఆదర్శ భర్తలను అడిగి ఇంకాస్త క్లారిటీ ఇవ్వు బ్రదర్…!! ఫాఫం, ఆమెను ఆగం చేయకు..!!
Share this Article