Priyadarshini Krishna….. Runway 34…. రన్‌వే 34 ఏప్రెల్ లో రిలీసైనప్పుడు థియేటర్‌లో చూడలేకపోయాను. అజయ్ దేవ్‌గన్ డైరెక్షన్ డెబ్యూ అనగానే నాకు క్యూరియాసిటీ పెరిగింది. మిస్సయ్యనే అని ఫీలైనా OTTలో రిలీస్ కోసం ఎదురుచూసాను. ప్రైమ్ లో రిలీసయింది. చూసాను. నచ్చింది. దీనిగురించి కొంచెం రాయాలనిపించింది.
మొత్తం సినిమా చూసాక నేను షాకయ్యాను. దానిమీద అంటే ఈ సినిమాకి సంబంధించిన వార్తల మీద రిసెర్చ్ చేసాను… నిరాశ మిగిలింది. ఇక్కడ కథ చెప్పదల్చుకోలేదు. నన్ను డిస్ట్రబ్ చేసిన విషయాలు చెప్పదల్చుకున్నాను…
2016 లో Sully: Miracle on the Hudson అనే మూవీ హాలివుడ్ లో రిలీసయింది. Clint Eastwood డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కమర్షియల్ కాప్టెన్ చెస్లీ సల్లీ గా Tom Hanks నటించాడు. ఒకరోజు ఎమర్జెన్సీ లాండింగ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు విమానంలో ఉన్నవారిని సురక్షితంగా లాండ్ చేసే క్రమంలో రివర్ హడ్సన్ పై క్రాష్ లాండింగ్ చేస్తాడు…
Ads
ఆ క్రమంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ సురక్షితంగా చేరుస్తాడు. కానీ…. ఏవియేషన్ బ్యూరో, ఏవియేషన్ కంపెనీలు మాత్రం కెప్టెన్ సల్లీని తప్పుపట్టి అతని వల్లనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఎంక్వైరీ కమిషన్ ముందు దోషిగా నిలబెడతారు. అతను ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి వస్థుంది. కాని తన కాన్ఫిడెన్స్, తన విధినిర్వహణలో వుండే నిబద్ధత, డెడికేషన్, చాకచక్యత వల్ల ఆ దుర్ఘటన నుండి అంతమందిని ఎలా సురక్షితంగా చేర్చాడో కమిషన్ ముందు నిరూపించుకుంటాడు….
రన్‌వే34 లో మక్కీకి మక్కీ ఇదే వుంది… కానీ మనకు హడ్సన్ రివర్ లేదు కదా అందుకని ఉదృతమైన వర్షాలను పాయింట్‌గా వాడారు. ప్రొడ్యూసర్ కూడా ఐన అజయ్ దేవ్‌గన్ ఎక్కడా తాను రీమేక్ చేస్తున్నట్లు ప్రస్తావించలేదు. కానీ సినిమా ప్రమోషన్ అప్పుడు మాత్రం ఇది నిజమైన సంఘటన ఆధారంగా తీసినది అన్నాడే గానీ వివరాలివ్వలేదు.
కానీ చాలామంది జర్నలిస్టులు ఈ సంఘటన 2015 లో కొచ్చీలో ఎమర్జన్సీ లాండింగ్ జరిపిన జెట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్ కథ అని రాసిన కొన్ని కథనాలు చదివాను… కానీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. క్రెడిట్స్ లో రైటర్ గా వచ్చిన సందీప్ కేవ్‌లానీ కి ఎన్ని గట్స్… ఎత్తికొట్టిన కథని అంత ధైర్యంగా ఒప్పించగలిగాడు. పైగా స్క్రీన్‌ప్లే డైలాగ్స్ కూడా అతడే… హౌ… ఎలా సాధ్యం… I need some tuition classes from him yaaaaaaaaaa…. ఎత్తికొట్టడానిక్ కాదు, హీరోని ప్రొడ్యూసర్‌ని ఒప్పించడానికి !
Share this Article