రెండు చిత్రాలను పోల్చుదాం ఓసారి… పోల్చాలి… పాతాళంలో కొట్టుమిట్టాడే తెలుగు సినిమా కథల్ని, కొత్త ప్రయోగాలకు పట్టం కట్టే ఇతర భాషల చిత్రాలను… హీరోల ప్రయారిటీలను పోల్చకతప్పదు… ఎందుకంటే..? ఫాఫం, అంతటి దర్శకుడు టి.కృష్ణ కొడుకు ఎక్కడికి జారిపోయి, కొట్టుకుంటున్నాడో, సగటు తెలుగు దరిద్రపు ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా కథల్లో తనను తాను ఎలా కెరీర్‌ను ధ్వంసం చేసుకున్నాడో… ఏళ్లుగా హిట్ లేక, ఫస్ట్ షోకు కూడా పెద్దగా జనం లేని ‘పక్కా కమర్షియల్’ అనబడే తన కొత్త సినిమా దురవస్థకు కారణాలేమిటో అన్వేషించుకోలేని దుస్థితిని చెప్పుకోవాలి… గోపీచంద్ పనైపోయింది అనే పరిస్థితికి కారణమేంటో కూడా చెప్పుకోవాలి…
సేమ్, ఒక మాధవన్ తీసిన రాకెట్రీ గురించి కూడా చెప్పుకోవాలి… ఇద్దరూ సేమ్ రేంజ్ హీరోలు… కానీ గోపీచంద్ ఇప్పటికీ అదే తొక్కలో నాసిరకం తెలుగు సినిమా ఫార్ములా నుంచి బయటికి రాలేడు… అవేమీ వర్కవుట్ కావు… చివరకు ఒకప్పటి బూతు దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీని, హీరోయిక్ యాక్షన్‌ను కలగలిపిన ఓ తిక్క వంటకం కుదర్లేదు… ఆ సినిమా గురించి పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీలేదు… ఇటీవల థియేటర్‌కు ప్రేక్షకులు రాక, ఫట్‌మని పేలిపోయే బుడగల్లో ఇదీ ఒకటి…
దాని రివ్యూ అనవసరం… ఆ కామెడీ ఏమిటో, ఆ యాక్షన్ ఏమిటో, ఆ కథ ఏమిటో…. తీసిన దర్శకుడికి, హీరోకు, నిర్మాతకే తెలియాలి… ప్రేక్షకులు మాత్రం ఫిక్సయిపోయారు… ఫాఫం, గోపీచంద్… ఎంత మంచి నటుడు అయితేనేం..? ఏ ఒక్క కోణంలోనూ ఆ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పడానికి ఏమీ లేదు… మరొక్క సినిమా ఇలాంటిది పడితే… ‘‘అప్పట్లో గోపీచంద్ అనే ఓ మంచి నటుడు ఉండేవాడు’’ అని చెప్పుకోవాల్సిందే…
Ads
మరి రాకెట్రీ..? అదీ చెప్పుకోవాలి… ఇది బయోపిక్స్ సీజన్… దేశభక్తి రంగరించిన కథల సీజన్… ఒక మేజర్ ఘనవిజయం తెలుసు కదా… దటీజ్ అడవి శేషు… రాజకీయాల్లోని రౌడీ ఎలిమెంట్స్‌ను హీరోలుగా ఎలివేట్ చేసే బురద దర్శకుల డప్పు బయోపిక్స్ కూడా చూస్తున్నాం కదా… వీసమెత్తు ప్రయోజనం లేని, నయాపైసా స్పూర్తి కలిగించలేని స్వార్థ క్రికెటర్ల బయోపిక్స్ కూడా చూశాం కదా… ఈ దుర్దినాల్లో దేశం కోసం రాజీపడని ఓ సైంటిస్టు కథను చెప్పడం మాధవన్ టేస్ట్… తనే నిర్మించాడు, తనే నటించాడు…
అయితే ఈ రాకెట్ పరిజ్ఞానం మీద డిబేట్, క్రయోజనిక్ ఇంజన్ల ప్రాధాన్యం గట్రా సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు… తొక్కలో ఫార్ములా కథలకు అలవాటుపడిన కళ్లకు ఆనదు… కానీ రావాలి… ఇలాంటి కథలు కావాలి… ప్రేక్షకుడికి అలవాటు చేయాలి… ఈ సినిమా రియల్ హీరో నంబి నారాయణన్ చేసిన పోరాటం స్పూర్తి తెరకెక్కాలి… తనను దోషిగా చేసి, వేధించిన ప్రభుత్వాల మీద కూడా పోరాడిన వైనం తెలియాలి…
అఫ్కోర్స్, నంబిని వేధించి, ఇరికించిన శక్తులేమిటో, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ దేనికో, ఏ అంతర్జాతీయ శక్తులు తన మీద కుట్ర చేశాయో మాధవన్ సరిగ్గా హింట్స్ కూడా ఇవ్వలేకపోయాడు… జేమ్స్‌బాండ్ స్థాయిలో ఏదో సాధించాడని ప్రచారం చేసినా సరే, సినిమాలో అంత సీన్ పెద్దగా కనిపించదు… ఐనా ప్రయత్నం అభినందనీయం… తన ప్రయాస, తన శ్రమ, తన రిస్క్ ప్రశంసనీయం… కమర్షియల్‌గా సక్సెస్ అవుతుందా అంటే అది వేచి చూడాలి… కానీ మెచ్చుకోక ఉండలేం… చిల్లర కామెడీ, దానికి తోడుగా పిచ్చి పాటలు, తిక్క ఫైట్ల పక్కా కమర్షియల్ సినిమాలకన్నా బెటరే కదా…!! ఇవే కదా ఫ్యామిలీ, పిల్లలతో సహా వెళ్లి చూపించాల్సిన సినిమాలు…!!
Share this Article