Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుడిగాలి సుధీర్… డాన్స్‌లో అదే ఎనర్జీ, హోస్టింగు… ఈటీవీ తప్పుచేసింది…

July 10, 2022 by M S R

మధ్యాహ్నం మాటీవీలో పార్టీ చేద్దాం పుష్ప అనే ప్రోగ్రాం వచ్చింది… నో డౌట్… అది ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్స్‌ను కొట్టేయడం కోసం ఉద్దేశించిన ప్రోగ్రాం… వీటికి ఫలానా కేరక్టర్ అనేమీ ఉండదు… తమ టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించే కమెడియన్లను కూర్చోబెట్టి, అప్పటికప్పుడు తోచిన ఏవో డాన్సులు, పాటలు, కామెడీ స్కిట్స్ గట్రా చేయించడమే… జస్ట్, ఎంటర్‌టెయిన్ చేయడం…

మాటీవీ షోలో సుడిగాలి సుధీర్ సెంటర్ పాయింట్… అబ్బురంగా ఓ డాన్స్ ఎపిసోడ్ చేశాడు… హోస్టింగ్ సరేసరి… ఇదేకాదు, కామెడీ స్టార్స్‌లో కూడా రాబోతున్నాడట… మాటీవీలోనే సూపర్ సింగర్… జీటీవీలో థాంక్యూ దిల్ సే… రైట్ రాయల్‌గా హోస్టింగ్ చేస్తూనే ఈటీవీ నుంచి పొందిన స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాడు… నిజంగా ఈటీవీ తనను వదిలించుకుని తప్పు చేసిందేమో…

పోయేదాకా పొగబెట్టారు… అవమానించారు… ఉంటే ఉండు, పోతేపో అన్నారు… చివరకు సుధీర్‌ను ఈటీవీ నుంచి, మల్లెమాల నుంచి తరిమేశారు… కానీ నష్టం ఎవరికి..? అది ఈటీవీకే… సుధీర్‌ మరింత రెమ్యునరేషన్‌తో, ఏ అగ్రిమెంట్ల బంధనాలు లేని స్వాతంత్య్రాన్ని పొందాడు… కామెడీ స్టార్స్ గానీ, పార్టీ చేద్దాం పుష్ప షో గానీ నాగబాబు పట్ల డప్పు ఒక్కటే ఇబ్బందికరంగా ఉంటుంది… కానీ మంచి క్వాలిటేటివ్ కమెడియన్లు చేరారు అక్కడికి… సరిగ్గా వాడుకోగలిగితే మాటీవీకి రేటింగ్స్ పండుగ… (కామెడీ స్టార్స్‌లో కిరాక్ ఆర్పీ అనే కమెడియన్ అయితే మరీ నాగబాబు పేరు చాతీమీద పచ్చబొట్టు వేయించుకున్నట్టు చూపించారు… అతి…)

Ads

sudheer

ఆదివారం 12, ఒంటి గంట నుంచి 3 గంటల వరకు మంచి ప్రైమ్ టైమే… ఇంటిల్లీపాదీ టీవీల ఎదుట కూర్చుని, ముచ్చట్లు పెట్టుకుంటూ వినోదం ఆశిస్తారు… శ్రీదేవి డ్రామా కంపెనీ, పార్టీ చేద్దాం పుష్ప వాళ్లను టార్గెట్ చేసే ప్రోగ్రామ్సే… జీ తెలుగు వాడికి ఎంతసేపూ మంత్రతంత్రాలు, పునర్జన్మల ఆడపెత్తనాల సీరియళ్లు లేదంటే పొద్దునపూ లక్ష మూఢ నమ్మకాల్ని బుర్రల్లో నింపే చెత్త షోలు తప్ప ఇలాంటి వినోదాత్మక ప్రోగ్రాములు పట్టవు… చేసిపెట్టే మంచి క్రియేటివ్ టీమ్ కూడా లేనట్టుంది…

జెమిని గురించి చెప్పడానికి ఏమీ లేదు… అది గాలికి వదిలేయబడిన చానెల్… అయితే ఒకవైపు మాటీవీలో పార్టీ చేద్దాం పుష్ప ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేస్తుంటే… మరోవైపు ఈటీవీలో అదే హైపర్ ఆది ర్యాగింగ్ విసుర్లు, అదే ఆటోరాంప్రసాద్ సోది కామెడీ… చివరకు తను డాన్సులు కూడా చేస్తున్నాడు… రష్మి హోస్ట్‌గా పెద్ద ఇంప్రెసివ్ కాదు… వెరసి వెలవెలాపోతోంది… కాకపోతే మాటీవీ పార్టీ చేద్దాం పుష్పలో అనసూయను మరీ నాగబాబు పక్కన జడ్జిగా చూడటం కాస్త ఇబ్బందిగా ఉంది… అయినా అంత మంచి యాంకరిణి, ఐటమ్ డాన్సర్‌ను మరీ అలా నిశ్చేష్టగా కూర్చోబెట్టడం ఏమిటో… అనసూయను వాడుకోవడం తెలియని పూర్ ప్రోగ్రామింగ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…
  • ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…
  • ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…
  • ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
  • టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…
  • విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…
  • ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
  • సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!
  • ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
  • ఈ పిచ్చిది ఏదో చెబుతుంది… గుడ్డిగా ఫాలో అయ్యారో, బుక్కయిపోతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions