ఆదివారం… రాత్రి 9.30 గంటలు దాటింది… ఒక్కసారి నాలుగు ప్రధాన తెలుగు చానెళ్లను ఓసారి చూద్దాం… సండే ప్రైమ్ టైమ్ కదా, ఎవరి ప్రోగ్రాం ఏమిటో, ఎవరి టేస్టేమిటో చూద్దాం… ఫస్ట్, జీతెలుగు… సరిగమప అని సంగీత పోటీ… సారీ, సినిమా పాటల పోటీ… నలుగురు పెద్ద పేర్లున్న జడ్జిలు… యాంకర్ శ్రీముఖి వచ్చింది స్టేజీ మీదకు… ఆమె డ్రెస్సు చూసి కాస్త వెగటు పుట్టిన మాట వాస్తవం…
ఈరోజుల్లో ఆమె డ్రెస్సు పెద్దగా వెగటు కేటగిరీలోకి రాదని అంటారేమో కొందరు… కానీ అక్కడి ప్రోగ్రాం సాంగ్స్ కంపిటీషన్… దాని ప్రధాన హోస్ట్ అలాంటి డ్రెస్సు వేసుకోవడం ఆ షోకు ఔచిత్యం కాదు… ఇంకేదైనా పిచ్చి ప్రోగ్రామ్‌కు సూటవుతుందేమో… అదీ డౌటే… హేమిటో, శ్రీముఖీ, గట్ల తయారవుతున్నవేంది నిన్నియాళ… ఏమైంది నీకు..? ఇదీ జీతెలుగు వాడి అభిరుచి… ఈ షో డైరెక్టర్ ఎవరో గానీ, నీకో దండంరా బాబూ…
Ads
ఫాఫం, ఇదే షోకు సినిమా ప్రమోషన్ కోసం సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం నిండు డ్రెస్సులో, హుందాగా వచ్చింది… సరే, వేరే చానెల్ ట్యూన్ చేద్దాం… స్టార్ మాటీవీ… అక్కడా సినిమా పాటల పోటీలే… కాకపోతే పిల్లలు… దానికి సుధీర్, అనసూయ జాయింట్ హోస్టింగు… అనసూయ కూడా విచిత్రంగా నిండు డ్రెస్సుతో పద్ధతిగా కనిపించింది…
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసే అనసూయ పలుసార్లు జబర్దస్త్‌లో కూడా పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం మీద బోలెడంత ట్రోలింగ్ నడిచింది… నా డ్రెస్సులు నా ఇష్టం, వెక్కిరించడానికి మీరెవర్రా అంటూ ఆమె రివర్స్ తిట్టిపోసేది… ఆమె తన పద్ధతి మార్చుకుందా…? లేక మరీ పిల్లల ప్రోగ్రాం కదా, బాగుండదులే అని జాలితో వదిలేసిందో తెలియదు… కానీ ఈ ఒక్కరోజు మాత్రం పద్ధతిగానే డ్రెస్ చేసుకుంది… అనసూయ అభిరుచిని శ్రీముఖి అందిపుచ్చుకుంది… ఖర్మ…
చెప్పుకోవాల్సింది ఉదయభాను గురించి… జెమిని టీవీలో బొమ్మా బొరుసా వస్తోంది… అదొక పిచ్చి ప్రోగ్రాం… తమ చానెల్ సీరియళ్లలో నటించే వాళ్లతో ఆ సీరియల్ పేర్లతోనే పార్టిసిపేట్ చేయించి, ఓ కిట్టీ పార్టీ తరహాలో నడిచే షో… అన్ని టీవీలూ చేస్తూనే ఉంటయ్… కానీ దాదాపు యాభయ్యేళ్ల ఉదయభాను హుందాగా, ఒకప్పటి ఉదయభానులాగే కనిపించింది… మేకప్‌లో ఎంత కవర్ చేసినా సరే ఒరిజినాలిటీ ముఖ్యం కదా… అప్పుడెప్పుడో తాతల కాలం నాడే యాంకరింగ్, టీవీ షోల హోస్టింగ్ స్టార్ట్ చేసి, ఒక దశలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది…
కొన్ని సినిమాల్లో చేసింది… తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆటుపోట్లు కావచ్చు, కెరీర్ ప్లానింగులో లోపాలు కావచ్చు ఆమెను తెరమరుగు చేశాయి… ఇప్పుడిప్పుడే మళ్లీ తెరమీదకు వస్తోంది… కానీ ఆ ఉచ్ఛదశ కష్టం… బహుశా యాంకర్ సుమ వయస్సులో కాస్త పెద్ద కావచ్చు… ఆమే యాంకర్‌గా, సినిమా ఫంక్షన్ల వ్యాఖ్యాతగా తన డిమాండ్ తగ్గకుండా ఉండటానికి చాలా కష్టపడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా… యంగ్ జనరేషన్ వస్తోంది… ఉదయభానుకు అంత ఈజీ ఏమీ కాదు… కానీ ఒకప్పటి ఉదయభాను తెలిసిన ప్రేక్షకులకు మళ్లీ ఆమెను బుల్లితెర మీద చూడటం బాగుంది…
ఇదేసమయంలో ఈటీవీలో కూడా సాంగ్స్ ప్రోగ్రామే వస్తోంది… పాడుతా తీయగా… ఓ ఇద్దరు జడ్జిలు… హోస్ట్ ఎస్పీ చరణ్… అదోరకం… షో గురించి, తన హోస్టింగు గురించి చెప్పడానికి పెద్దగా ఏమీలేదు… ఇంకా నయం, వీళ్లు కూడా జీటీవీ వాడిలాగే ‘‘అతి పొట్టి’’ బట్టలేసుకున్న ఓ కో-హోస్టునో ప్రవేశపెట్టలేదు… అక్కడికి సంతోషం…!!
Share this Article