బలుపు భాష అనే పదాల్ని వాడటానికి సందేహించడం లేదు… ఇప్పటికే రాజకీయాల్లో వాడబడుతున్న డర్టీ భాషతో సంస్కారం చిన్నబోతోంది… ఇక సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ వైరస్ వ్యాపించిందా..? వ్యక్తుల ప్రైవేటు సంభాషణల్లో దూషణలు గట్రా కొంతమేరకు వోకే… కానీ బహిరంగ వేదికల మీద, హుందాగా వ్యవహరించాల్సినచోట, కాస్త సంస్కారాన్ని కనబరచాల్సిన సందర్భాల్లో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి… తమ భాష, తమ వ్యాఖ్యలు, తమ బాడీ లాంగ్వేజీ అన్నీ ముఖ్యమే…
తెలియని భాషలో వాగే ప్రయత్నం చేయకపోవడం, తెలిసిన భాషలో తామేం చెప్పదలుచుకున్నారో వ్యక్తీకరించడం బెటర్… తన భావాన్ని తెలుగులో సరిగ్గా చెప్పలేక సాయిపల్లవి ఇటీవల ఇబ్బందుల్లో ఇరుక్కున్న సంగతి తెలుసు కదా… ఇప్పుడు అమ్మ రాజశేఖర్ అనే ఓ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ వ్యవహారశైలి మరీ నీచంగా ఉంది… విషయం ఏంటంటే..?
ఈయన తమిళంలోనే ఓ సాదాసీదా డైరెక్టర్, కొరియోగ్రాఫర్… తెలుగు సరిగ్గా రాదు… తను తెలుగు, ఇంగ్లిష్ కలిపి కొడుతుంటే అర్థం చేసుకోవడం ప్రపంచంలోనే ఎవడికీ సాధ్యం కాదు… ఈమధ్య హై ఫైవ్ అనే సినిమాకు దర్శకత్వం ఉద్దరించాడట… హీరో నితిన్ ఈ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు వస్తానని చెప్పి, రాలేదట… అది తనను అవమానించడం అట… ప్రిరిలీజ్ వేడుకలోనే ఈ దర్శకుడు నితిన్ మీద అగ్గిఫైరయిపోయాడు…
Ads
సరే, అసంతృప్తిని, కోపాన్ని వ్యక్తీకరించడం తప్పేమీ కాకపోవచ్చు… కాకపోతే అక్కడ తను వాడిన భాష అభ్యంతరకరం… నితిన్‌ను ఉద్దేశించి వాడు, వీడు, వేస్ట్ ఫెలో, వాడికి డాన్సే రాదు, నేను నేర్పించాను, నేను గురువుననే గౌరవం కూడా లేదు, ఒరేయ్, నేను హర్టయ్యానురా… ఇలా సాగింది తన ప్రసంగం… నిజంగానే నితిన్ రావాలని ఏముంది..? తన ఇష్టం…
తను రాకపోవడానికి ఏవో కారణాలు ఉండవచ్చు… లేదా కావాలనే తప్పించుకుని ఉండవచ్చు… ఆ ఫంక్షన్‌కు రావాలా వద్దానేది తన విచక్షణ… ఇందులో నిర్బంధం ఏముంది..? దానికి వేదిక మీద వాడు, వీడు అనే సంస్కారరాహిత్యం ఏమిటి..? నీ శిష్యుడైన ఆ నితిన్ నిన్ను ఫోరా అని తిరస్కరిస్తున్నాడంటే అది గురువుగా నీ వైఫల్యమే కదా మరి… ఐనా రాజశేఖర్‌కు ఇలాంటి మాటలు, ఈ పిచ్చి చేష్టలు కొత్తేమీ కాదు…
అన్నట్టు, ఇక్కడ గురువేంది..? శిష్యుడేంది..? అంతా డబ్బుల బంధమే కదా… గతంలో టక్కరి అనే సినిమాకు కూడా ఇదే రాజశేఖర్, ఇదే నితిన్ కలిసి పనిచేశారు… ఐనా వీళ్లు నేర్పేవి డాన్సులా..? నాలుగు పిచ్చిగెంతులు… అవి ఓ క్రమపద్ధతిలో ట్యూన్‌కు తగినట్టు కూర్చితే అది డాన్స్ అనాలా..? అది గొప్పతనమా..? ఆ గెంతులు నేర్పితే నువ్వు గురువైపోయావా..? అసలు సమస్య రాజశేఖర్ వ్యవహారశైలిలో, ఆలోచనధోరణిలో ఉంది…
బిగ్‌బాస్ ఏదో సీజన్లో పాల్గొన్నాడు… ఏం మాట్లాడతాడో ఎవడికీ అర్థం కాదు… ఏం చేస్తాడో అంతుపట్టదు… ప్రేక్షకులకు ఓ హింస… ఇక హౌజులో ఉన్నవాళ్లకు ఎలా ఉండాలి..? బాగా మండిపోయినట్టుంది… ఓ దశలో, ఓ ఎలిమినేషన్ టాస్కులో టీవీ9 దేవి ఆయన మెడలు పట్టుకుని, ఓ కృత్రిమ గేటు నుంచి బయటికి తోసేసింది… అవమానంగా ఫీలైన ఇదే రాజశేఖర్ పొర్లిపొర్లి ఏడ్చాడు… ఓవరాక్షన్, అతికామెడీ చేస్తే హీరోలు అనుకుంటున్నారా అంటూ యాంకర్ లాస్య కూడా ఇదే రాజశేఖర్‌ను అలాగే నెట్టేసింది…
చివరగా… నితిన్రెడ్డీ, ఇలాంటి కేరక్టర్లను ఎంకరేజ్ చేస్తే ఇదుగో, ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది… నీదే తప్పు…!! అవును, శ్రీ మంచు విష్ణు బాబు గారూ… నితిన్ మా అసోసియేషన్‌లో మెంబరే అనుకుంటాం… మరేమైనా స్పందిస్తావా..?!
Share this Article