ఆంధ్రజ్యోతిలో మాస్ట్ హెడ్ పక్కనే ఓ చిన్న వార్త కనిపించింది… అదెలా ఉందంటే..? అయిపోయింది, జగన్ పని అడుగంటిపోయింది… సర్వే చేస్తే దేశంలోని ముఖ్యమంత్రుల్లో జగన్ జనాదరణ స్థానం మరీ 20కి పడిపోయింది… అడుగు నుంచి ఆరో ప్లేసు… ఫస్ట్ ప్లేసులో నవీన్ పట్నాయక్ ఉన్నాడు… యోగీ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్ సీఎంలు కూడా టాప్ ఫైవ్‌లో ఉన్నారు… తెలంగాణ సీఎం కేసీయార్ 11వ ర్యాంకులో ఉన్నాడు…. ఇలా సాగిపోయింది వార్త…
వారెవ్వా… ఇంకెవరికీ దొరకని సర్వే వార్త ఆంధ్రజ్యోతికి భలే తెలిసింది అనిపించింది చూడగానే… ఆ వెంటనే డౌటొచ్చింది… ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్ అంటేనే అందులో ఏదో టీడీపీ మార్క్ మర్మం ఉంటుందీ అని… ప్రత్యేకంగా కేసీయార్ పదకొండో ర్యాంకు అనేసరికి ఆ డౌట్ మరింత పెరిగింది… మోడీ రేటింగ్ స్వల్పంగా పెరిగిందీ అని చదివేసరికి డౌట్ మూడు రెట్లయిపోయింది… మొన్ననే కుర్చీ ఎక్కిన మహారాష్ట్ర సీఎం, ఇంకాస్త ముందు కుర్చీ ఎక్కిన పంజాబ్ సీఎం టాప్ ఫైవ్ ప్లేసుల్లో ఉన్నారనేసరికి డౌట్ పన్నెండు రెట్లు పెరిగిపోయింది…
Ads
వైఎస్పార్సీపీ అభిమాని ఒకరు దీన్ని తవ్వాడు జాగ్రత్తగా… అసలు ఈ సర్వే చేసిందంటున్న సీఎన్‌ఓఎస్ ఎవరిది..? Whois లో చెక్ చేస్తే సదరు వెబ్‌సైట్ ఓనర్ Show Time Consulting అని తేలిపోయింది… ఆ కన్సల్టెన్సీ ఎవరిదీ అని zuabacorp లో చెక్ చేస్తే అది పంజాబ్‌లో రిజిష్టరైనట్టు తెలిసింది… కంపెనీలో ఓ డైరెక్టర్ పేరు రాబిన్ శర్మ అని తెలిసిపోయింది… ఎవరు ఈ రాబిన్ శర్మ…? ఇంకెవరు..? తెలుగుదేశం పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్టు… అంటే ఈ తంతు ఏమిటన్నట్టు..?
సింపుల్… తెలుగుదేశం స్ట్రాటజిస్టు తన కంపెనీ పేరిట ఓ ఫేక్ సర్వే చేయిస్తాడు… జనం నమ్మాలి కదా… అందుకని నవీన్ పట్నాయక్ ఫస్ట్ ప్లేసు… యూపీ సీఎం యోగి సెకండ్ ప్లేసు… ఇలా ర్యాంకులు ఇచ్చేశాడు… జగన్‌ను అట్టడుగుకు తోశాడు… టార్గెట్ అదే కదా… పనిలోపనిగా కేసీయార్‌కు పదకొండో స్థానం ఇచ్చాడు… ఇలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి, ముందే అనుకున్నట్టు ఆంధ్రజ్యోతికి పంపించాడు… వాళ్లు విధిగా కవర్ చేశారు… సేమ్, క్యాంపు కదా…
ఇదండీ సంగతి… వైసీపీ అభిమాని స్క్రీన్ షాట్లతోసహా ఫేస్‌బుక్‌లో పెట్టేశాడు… వెరసి రాబిన్ శర్మ, ఆంధ్రజ్యోతి ఇజ్జత్ సంయుక్తంగా గోదావరి వరదల్లో కొట్టుకుపోయింది… ఇక్కడే రాబిన్ శర్మకూ, ప్రశాంత్ కిశోర్‌కూ నడుమ తేడా… పీకే చేసే పనులూ ఇలాంటివే… ఫేక్ సర్వేలు, ఫేక్ బ్రాండింగులు, ఫేక్ క్యాంపెయిన్, ఫేక్ సోషల్ ఖాతాలు, ఫేక్ పోస్టుల పుషింగులు… కానీ జాగ్రత్తగా తెర వెనుక సాగుతూ ఉంటుంది యవ్వారం… రాబిన్ శర్మ ఇలా ఇట్టే తెలిసిపోయేలా చేసి దొరికిపోయాడు ఫాఫం… అందుకే వెనకబడిపోయినట్టున్నాడు…
అవునండీ శర్మ గారూ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎవరికెన్ని సీట్లు వస్తాయో సర్వే చేసినట్టుగా ఏమైనా అంకెలు కూర్చారా సార్… జగన్ పార్టీకి 26, పవన్ పార్టీకి 36, బీజేపికి 2, టీడీపీకి 111 సీట్లు వస్తున్నట్టు రిపోర్ట్ పంపిస్తున్నారా సార్… కాస్త త్వరగా పంపించండి, పత్రికలో స్పేస్ ఖాళీగా ఉంచుతాం… సరేనా..?! చివరలో డిస్‌క్లెయిమర్ ఏమిటంటే… ఇది తప్పుడు సర్వే కావచ్చుగాక… నిజంగానే జగన్ ప్రభ ఫీల్డులో అంతగొప్పగా ఏమీ వెలిగిపోవడం లేదు…!! కాకపోతే ఇదుగో, ఇలాంటి వేషాలతోనే తెలుగుదేశం గత ఎన్నికల్లో మట్టిగొట్టుకుపోయింది… పాఠాలు నేర్చుకోలేదు…!!
Share this Article