బ్రూస్లీ సినిమాల్ని, మార్షల్ ఆర్ట్స్ సినిమాల్ని, జాకీ చాన్ వంటి మార్షల్ హీరోల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటారు… ఎంటర్ ది డ్రాగన్ వంటి సినిమాలు అనేక దేశాలు మార్షల్ ఆర్ట్స్ పట్ల విశేష ఆదరణను పెంచాయి… అలాంటి అభిమానులందరూ ఒక్కసారి సిగ్గుతో తలదించుకోవాలి… వర్మ అనే ఓ మురికి కేరక్టర్ మార్షల్ ఆర్ట్స్ పేరిట, బ్రూస్లీ పేరు వాడుకుంటూ, డ్రాగన్ పేరును అపవిత్రం చేస్తూ తీసిన లడ్కీ, అమ్మాయి అనే చెత్త సినిమాను చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చిన ప్రతి అమ్మాయి ఓసారి వర్మకు నివాళి అర్పించాలి…
నిజానికి చెత్త అనే పదం వర్మలోని మురికిని, కంపును పూర్తిగా ప్రతిబింబించదు… 50 వేలు, 60 వేల సినిమాల్లో రిలీజ్ అని ఏదో వాగినట్టున్నాడు కదా… అవతార్, టైటానిక్, డైనోసార్ వంటి సినిమాల దర్శకులు నా ముందు ఎంత అన్నట్టుగా బురద మాటలు ఏవో చెప్పాడు కదా… పొరపాటునో, గ్రహపాటునో ఆ సినిమాకు, ఆ థియేటర్ల వైపు వెళ్లేరు సుమా… వర్మ బుర్రలోని కంపుతో కంపించిపోతారు… ఒక పాన్ వరల్డ్ సినిమా గురించి ఇంత హార్ష్‌గా చెప్పే సందర్భం బహుశా మళ్లీ రాదేమో… కానీ వర్మ లడ్కీ (అమ్మాయి) అనే సినిమా గురించి ఇలా రాయడంలో తప్పేమీ లేదు…
అదేమంటే… నా సినిమా నా ఇష్టం, చూడమని అడిగానా అంటాడు తనకే పెద్ద తెలివి ఉన్నట్టుగా…. బట్టలిప్పి బజారులో వెళ్తూ, చూడమని నిన్నెవడు అడిగాడు అంటే సొసైటీ ఊరుకుంటుందా..? ఊరుకోవాలా..? వర్మ ఆ నీలి వెబ్సైట్లలో రిలీజ్ చేసుకోవచ్చుగా తన సినిమాల్ని… నడుముకు ఓ చిన్న పీలిక… ఛాతీ చుట్టూ మరో పీలిక… అంతే… ఇక మొత్తం దేహాన్ని తెరకు అప్పగించేస్తుంది కథానాయిక… అవునా..? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సు వేసుకోవాలా..? వేసుకుంటారా..? ఎంత దరిద్రం..?! జస్ట్, ఆ ఫైట్లు చేస్తుంటే బికినీకన్నా చిన్నగా ఉండే బట్టపేలికలతో ఆ అమ్మాయి అందాలన్నీ స్లోమోషన్లో మరీ చూపించడమే వర్మ మురికి ఆలోచన…
Ads
అంతకుమించి ఇందులో కథ ఉండదు, కాకరకాయ ఉండదు… అసలు తనలోని క్రియేటివ్ దర్శకుడు మరణించి చాన్నాళ్లయింది… ఇదుగో ఇలాంటి వికట, వెగటు జీవి మిగిలాడు తనలో… హీరోయిన్‌ది ఏముందిలెండి పాపం, డబ్బులిస్తే అలా చేసేవాళ్లు బోలెడుమంది ఇండస్ట్రీలో… ఏదో బతుకుతెరువు… ఆ సినిమాలోని చెత్త ఇమేజీలను పోస్ట్ చేయడానికి కూడా మనస్కరించడం లేదు… అంత అశ్లీలం, అంత గలీజ్… ఈ ఉద్దరణకు తోడు కొన్ని నెత్తిమాసిన సీన్లకు సంస్కృత శ్లోకాల్ని బ్యాక్‌డ్రాప్‌లో వినిపించాడట… సెన్సారోళ్లే దిగ్గున వణికిపోయి, కత్తిరించిపారేశారు… సో, బహుపరాక్… అపరిశుద్ధం వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి… అసలే వర్షాకాలం, లేనిపోని రోగాలు చుట్టుకుంటాయి…!!
Share this Article