Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు రోహిణి కూడా జంప్… శ్యామప్రసాదుడా ఇదేమి దురవస్థ నీకు..?!

July 16, 2022 by M S R

చివరకు ఇంద్రజ, రష్మి, ఆటో రాంప్రసాద్ మాత్రమే మిగులుతారా జబర్దస్త్‌లో..? అవకాశమొస్తే ఇమ్మూ, నూకరాజు కూడా జంపేనా..? మల్లెమాల షెడ్డంతా ఖాళీ అయిపోయి బోసిపోవాల్సిందేనా..? మాటీవీ వాళ్ల ఓ తాజా ప్రోమో చూస్తే అదే డౌటొచ్చింది… ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీకి పోటీగా మాటీవీలో కూడా ఆదివారం మధ్యాహ్నం ఓ స్పెషల్ షో వేస్తున్నారు కదా… ఈసారి ఆ షో పేరు ‘‘అంటే సుందరానికీ’’…

ఎలాగూ సుధీర్ వచ్చాడు కదాని… తననే సెంటర్ పాయింట్‌గా సుదీర్ఘ స్కిట్ ప్లాన్ చేసి కుమ్మేశారు… ఆరేడుగురు అందగత్తెలు, డాన్సులు, పాటలు, మధ్యలో జోకులతో రక్తికట్టించే ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు… సరే, వాళ్ల వేషాలు వాళ్లవి, కానీ అందులో లేడీ కమెడియన్ రోహిణి కూడా కనిపించింది… మంచి టైమింగ్ ఉన్న నటి ఆమె… కాకపోతే లావు మీద శ్రద్ధ లేదు, ఈరోజుకూ… ఏమో, ఆ స్థూలత్వమే కామెడీకి పనికొస్తుందనే భ్రమలో ఉందేమో…

అంటే రోహిణి కూడా మల్లెమాల బంధనాలను తెంచుకుని స్వేచ్ఛను పొందిందన్నమాటే… ఓసారి తాజా శ్రీదేవి డ్రామా కంపెనీ కథేమిటో చూద్దాం… అట్లుంటది మనతోని అనే పేరుతో ఈ షో చేశారు ఈసారి… ఫాఫం… మల్లెమాలలో చేయడానికి ఎవడు మిగిలాడని..? అందుకని పలు సీరియళ్లలో నటించే నటుల్ని పట్టుకొచ్చి ఈసారికి కథ నడిపించేశారు…

Ads

సంఘవిని, ప్రగతిని కూడా పట్టుకొచ్చారు… అందరినీ ర్యాగింగ్ చేసే హైపర్ ఆది మీదే నాలుగు పంచులు సంఘవితో వేయించారు… కీర్తిభట్, నవ్య, సుహాసిని, నందిత శ్వేత కనిపిస్తున్నారు… ఎవడూ దిక్కులేకపోతే ఏం చేస్తారు…? అప్పుడప్పుడూ గెస్టుగా వచ్చేు భాస్కర్ తండ్రి కూడా ఇప్పుడు సీరియస్ పార్టిసిపెంట్ అయిపోయాడు… సుధీర్, రష్మి లవ్ ట్రాక్‌కు వరద గండి పడింది కదా… ఇప్పుడు ప్రవీణ్, ఫైమా లవ్ ట్రాకే దిక్కయింది…

ఒకవైపు బయట యూట్యూబ్ చానెళ్లలో ఒకరి మీద పడి ఒకరు పోటీలుపడుతూ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు… మాటలతో తన్నుకుంటున్నారు… తిట్టేసుకుంటున్నారు… మల్లెమాల బట్టలు విప్పేస్తున్నారు… ఆ ప్రభావం ఈటీవీ మీద కూడా పడుతుంది… ఇంకోవైపు ఒక్కొక్కరే మల్లెమాల షెడ్ నుంచి రెక్కలు కట్టుకుని మాటీవీ వైపు ఎగిరిపోతున్నారు… ఇదే సందర్భంలో జీటీవీ గనుక రంగప్రవేశం చేస్తే… మల్లెమాల కథ ఇంకా సూప్‌లో పడ్డట్టే… ఆటో రాంప్రసాద్‌ను చాన్నాళ్లు నమ్ముకోలేదు, ఆ పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు, ఆది ఆల్‌రెడీ రెక్కలు కట్టుకుని రెడీగా ఉన్నాడు… ఒక బూతు వినోద వైభవం భారీ వరదప్రవాహంలో చిక్కుకుంది…!! ఏడుకొండల్ని పిలవండి, హెలికాప్టర్‌లో వచ్చి రక్షిస్తాడేమో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…
  • ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!
  • వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!
  • ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…
  • తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!
  • బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…
  • ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!
  • ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
  • దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
  • సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions