అనుపమ చోప్రా… సినిమాల సమీక్షకురాలు… బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్ ఎట్సెట్రా అన్ని భాషావుడ్ల స్టార్లు, దర్శకులు ఫాలో అవుతూ ఉంటారు… కాకపోతే ఆమె కాస్త హిందూ ద్వేషి… సినిమాల్లో హిందుత్వ ప్రముఖంగా కనిపిస్తే చిటచిట… చిరాకు… కశ్మీరీఫైల్స్, ఆర్ఆర్ఆర్ కూడా ఆమెకు హిందుత్వ ప్రమోట్ చేసిన సినిమాల్లాగే కనిపించాయి… అంతెందుకు..? తమిళహీరో మాధవన్ ఈమధ్య రాకెట్రీ అని ఓ సినిమా తీశాడు కదా… అది మన స్పేస్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితంలోని కొన్ని ఘట్టాల ఆధారంగా నిర్మించిన సినిమా…
పలుచోట్ల మరీ డాక్యుమెంటరీలా అనిపించినా, ఆయన కథలో పంచ్ ఉంది… మాధవన్ ప్రయత్నం బాగుంది… సైన్స్‌ను ప్రేమించే నవతరం చూడదగ్గ సినిమా… అదీ అనుపమకు నచ్చలేదు… అందులో నారాయణన్‌ను మరీ దేశభక్తుడిలా చూపించారట… హిందుత్వను ప్రమోట్ చేసిందట సినిమా… అసలు ఆ సైంటిస్టును హిందువుగా చూపించడమే ఓ సెక్షన్ రివ్యూయర్లకు నచ్చలేదు… సరే, ఏదేదో రాసేశారు… ఇంట్లో పూజ చేస్తూ కనిపిస్తాడు, కీలక సమయాల్లో దేవుడిని ప్రార్థిస్తాడు అంటూ…! అంతేకాదు, నంబిని మరీ వీరదేశ భక్తుడిగా చూపడమూ కొందరికి నచ్చలేదు… దేశం కోసమే నాసాలో కొలువును తిరస్కరించినట్టు చూపించడం కరెక్టు కాదట…. దీనిపై హీరో మాధవన్ ఏమీ స్పందించలేదు గానీ ఆ ఒరిజినల్ కథానాయకుడు నంబి నారాయణన్‌కు మాత్రం ఎక్కడో కాలింది… తను రియాక్టయ్యాడు…
Ads
డెక్కన్ వాహిని అనే మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘నవ్వొస్తుంది కొన్నిసార్లు… నన్ను హిందువుగా చూపిస్తే తప్పేమిటట..? సినిమాలో నంబి ఏదో ఉత్సవం చేస్తున్నట్టు, సుప్రభాతం చదువుతున్నట్టు చూపించారట, ఇంకా ఏదేదో చేశాడట… అది వాళ్లకు నచ్చలేదట… నంబి హిందువు, నంబి బ్రాహ్మిణ్… అంతా హిందుత్వ ప్రమోషన్ అన్నట్టుగా ఏదేదో రాశారు కదా… ఒక్కమాట సూటిగా అడుగుతున్నా వాళ్లను… ఎస్, నేను హిందువునే… సో వాట్..? హిందువును అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సింది ఏముంది..? ఏం..? హిందువుగా బతకడం ఓ నేరమా..? పాపమా..?
నేను హిందువును అయినప్పుడు, నా కథే చూపించినప్పుడు, హీరో సినిమాలో హిందువుగానే కనిపిస్తాడు కదా సహజంగానే… అంతేతప్ప మరో మతస్థుడిగా చూపించలేరు కదా… మరి ఈ రాతల్లో, ఈ మాటల్లో అర్థమేమిటి..? నిజానికి నేను బ్రాహ్మణుడిని కాను, ఐనా కథలో ఓ బ్రాహ్మణుడిగా చూపిస్తే తప్పేమిటట..? బ్రాహ్మణుడైతే తన ఐడెంటిటీని కట్ చేసేయాలా..? దేశం కోసం ప్రాణాలు వదిలిన బ్రాహ్మణులు బోలెడు మంది… అనవసరంగా ఓ రంగుపూయడం తప్ప ఈ రాతల్లో ఏముంది..?
నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు… కానీ నా పేరుతో సాగే ఇలాంటి రాతల రాజకీయాలే కరెక్టుగా లేవు… పరస్పరం సైద్ధాంతికంగా ఉత్తరదక్షిణ ధ్రువాలుగా ఉండే రాజకీయ నాయకుల నుంచి నాకు మద్దతు దొరికింది… అది కదా గొప్ప విషయం… నరేంద్ర మోడీని ప్రధానిగా కాదు, ఓసారి బీజేపీ నాయకుడిగా చూడండి, నాకు సపోర్టుగా నిలిచాడు… ఇటు కేరళ సీఎం విజయన్… నాకు బలమైన మద్దతునిచ్చాడు… ఇంకేముంది..? నాకు ఆయన సపోర్ట్ చేసినట్టు సినిమాలో చూపిస్తే ఇక నేను కమ్యూనిస్టును అని ముద్రవేయలేరు కదా…
Share this Article