ముందుగా వివాదం ఏమిటో చదువుదాం… నిత్యామేనన్ మొన్నామధ్య ఓ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఓ విషయాన్ని వెల్లడించింది… సాధారణంగా పెళ్లి కాని హీరోయిన్‌కు మన దిక్కుమాలిన సినిమా జర్నలిజం తరఫున పదే పదే ఎదురయ్యే ప్రశ్న ‘‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు..?’’… ఇక్కడా ఆ ప్రశ్నే ఎదురైంది… అంతకుముందే ఓ జాతీయ పత్రిక ఓ ప్రముఖ మలయాళ స్టార్ హీరోతో నిత్య ప్రేమలో పడిందనీ, త్వరలో పెళ్లి జరగబోతోందనీ ఏదో గాసిప్ గీకిపారేసింది…
దాని ఆధారంగా కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు, హిందీ మీడియా ఏవేవో రాసేశారు… ఫలానావాడు కావచ్చు అంటూ ఊహాగానాలు చేశాయి… పాన్ ఇండియా గాసిప్… సో, మొన్నటి ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు కావాలనే సమాధానం చెప్పాలని నిత్య అనుకుంది… (ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా తక్కువ)…
‘‘ఈ పెళ్లి వార్తలన్నీ ఉత్త రూమర్స్ మాత్రమే… తరచూ ఇలాంటి గాసిప్స్ సంతోష్ వర్కే అనే యూట్యూబర్ స్టార్ట్ చేస్తుంటాడు, ఆరేళ్లుగా నన్ను మానసికంగా వేధిస్తున్నాడు… ప్రేమిస్తున్నాను అంటాడు, పెళ్లి చేసుకుందాం అంటాడు… నన్నే కాదు, అమ్మకు, నాన్నకు కూడా ఫోన్లు చేస్తుంటాడు… దాదాపు 30 ఫోన్లు బ్లాక్ చేశాను… ఐనా మనిషి మారలేదు… ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాడు… క్షమతో మాత్రమే నేను ఎవరికీ ఫిర్యాదు చేయలేదు… కేసు పెట్టలేదు…’’
……. ఇలా వివరంగా చెబుతూ పోయింది… సంతోష్ కూడా వెంటనే స్పందించాడు… ‘‘ఆమె ఆరోపణల్లో నిజం లేదు… ఒక దశలో ఆమెను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుంటానని ఆమెకే చెప్పాను… అంతే… ఇప్పుడీ అకారణ విమర్శలేమిటో అర్థం కావడం లేదు… ఒక మనిషి పేరిట 25, 30 సిమ్ కార్డులు ఇస్తారా ఎవరైనా..? మీకు అర్థమవుతోంది కదా ఆమె అబద్ధాలు ఆడుతోందని…! ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చినా నేను చేసుకోను… ఆమె ఇలాంటిది అని గ్రహించలేకపోయాను… నామీద లైంగిక వేధింపుల కేసు పెడతారట… ఇలాంటిది అని తెలిస్తే అసలు ప్రేమించేవాడినే కాదు’’ అని వివరణ ఇచ్చాడు…
Ads
నిజానికి ఈ వ్యవహారంలో నిత్యా మేనన్ తప్పే కనిపిస్తోంది… ఆధ్యాత్మిక వాసనలు కలిగిన వ్యక్తిత్వం ఆమెది… అబద్ధాలు, అనవసర వివాదాలు, ఇతర హీరోయిన్లలా అడ్డగోలు యవ్వారాల్లో వేలుపెట్టదు… అదేసమయంలో ఈ సంతోష్ వర్కే మీద బోలెడు విమర్శలున్నాయి… నాట్ ఫెయిర్… చిల్లర యూట్యూబర్ తను… సినిమా రివ్యూలు చేస్తుంటాడు… తను చెబుతున్న వివరణతోనే అర్థమవుతోందిగా తను ఎలాంటివాడో… ఇక్కడ నిత్య తప్పు ఏమిటంటే..? పోలీస్ కేసు పెట్టకపోవడం..!
అనవసర ఔదార్యం, క్షమ అనేవి ఎదుటివాడికి అలుసు ఇస్తున్నాయనీ, దాంతో మరింత నష్టం జరుగుతోందని ఆమె గ్రహించలేకపోయింది… ఒకడి వీపు పగిలితే కదా ఇంకొందరు సెట్ రైట్ అయ్యేది… ఇష్టారీతిన రాతలు, కూతలు కాదు, చివరకు వ్యక్తిగతంగా స్టార్ల జీవితాల్లోకి కూడా యూట్యూబర్లు ఎలా చొచ్చుకుపోతున్నారో నిత్యా మేనన్ అనుభవాలు చెబుతున్నాయి… ప్చ్, ఇప్పటికైనా తన దగ్గర తాజా ఆడియో రికార్డింగ్ ఏమైనా ఉంటే… నిత్య ఓ కేసు పెట్టాల్సింది… కేరళలో కాదు, హైదరాబాదులో..!! #Isupportnithya
Share this Article