ది వీక్… ఈ మ్యాగజైన్ ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కాస్త వీక్ అయిపోయింది… కానీ ఇంతకుముందు కాస్త పేరున్న మీడియా సంస్థే… పాపులరే… మనం మొన్నామధ్య ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… ఓ కాలమిస్ట్ ఇకపై ఆ మ్యాగజైన్‌కు ఏమీ రాయబోవడం లేదనీ, ఒక కాలమ్‌కు వీక్ ఎడిటోరియల్ టీం ఉపయోగించిన ‘కాళి’ బొమ్మ తనను నిర్ఘాంతపరిచిందని ప్రకటించాడు… సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు… ఏ కాలమ్‌కు ఏ ఇల్లస్ట్రేషన్ అవసరమో కూడా గుర్తించలేని మ్యాగజైన్ ప్రస్తుత ధోరణి, ఇంకా ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు గనుక, తనే ముందుజాగ్రత్త చర్యగా దానికి ఇకపై కాలమ్స్ రాయబోనని చెప్పాడు…
జరిగింది ఏమిటంటే… ఆయన పేరు వివేక్ దేవరాయ్… అల్లాటప్పా కాలమిస్ట్ ఏమీ కాదు… తెలుగు పత్రికల్లోలాగా ఏదో ఒకటి గీకేసి, పాఠకుల మొహాన కొట్టే టైపు కూడా కాదు… తను ప్రముఖ ఆర్థికవేత్త… రచయిత… ప్రధానమంత్రి ఆర్థికసలహామండలి (the Economic Advisory Council to the Prime Minister of India) అధ్యక్షుడు… ఆమధ్య తను ఓ ఆర్టికల్ రాశాడు… దానికి ‘‘అగ్గికి ఏడు నాలుకలు, అందులో ఒకటి కాళి’’ అని హెడింగ్ పెట్టారు… ఇదుగో ఇలా…
Ads
సరే.., అగ్గి నాలుక-కాళిక అనే పదాలు బాగానే ధ్వనిస్తున్నయ్… అయితే దానికి ఫీచర్డ్ ఇమేజీగా ఇదుగో ఈ బొమ్మను జతచేశారు… ఇది తాంత్రిక కాళి బొమ్మ… శివుడి ఛాతీ మీద కాలుబెట్టి చంపబోతున్నట్టుగా ఉంటుంది… అదీ మ్యాగజైన్ ఆ కాలమ్ కోసం గీయించిన బొమ్మేమీ కాదు… గూగుల్ సెర్చింగులో గెట్టీ ఇమేజెస్‌లో దొరికేదే… అసలు ఆ వ్యాసంలోని అంశాలకూ, ఈ బొమ్మకూ పొంతన ఉండదు… పైగా ఆ బొమ్మ చూడగానే వ్యాసం ఇంపార్టెన్స్, స్థాయి మీద కూడా ఓ తేలిక అభిప్రాయం కలిగే చాన్స్ ఉంది… సదరు ప్రముఖ కాలమిస్ట్ కూడా అదే ఫీలయ్యాడు…
సంపాదకుడికి ఓ లేఖ రాసి, ఇక వదిలేశాడు ఆ కాలమిస్ట్… కానీ అది చల్లారిపోలేదు… అసలు ఆ ఆర్టికల్ ఏమిటి..? ఆ బొమ్మ ఏమిటి..? అంటూ నెటిజనం సదరు మ్యాగజైన్ మీద దుమ్మెత్తిపోశారు… కొన్నాళ్లు సైలెంటుగా ఉండిపోయిన మ్యాగజైన్ చివరకు ఆ విమర్శల ధాటికి తలొగ్గింది… చివరకు బహిరంగంగా అపాలజీ చెప్పింది… ఏదో సైలెంటుగా ఆ బొమ్మ తీసేసి, చేతులు దులిపేసుకోకుండా, క్షమాపణను తమ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసింది…
‘‘సదరు కాలమ్‌కు మేం ఉపయోగించిన శివుడి, కాళి బొమ్మలు సరైనవిగా లేవు… అయితే మాకు వేరే దురుద్దేశాలు ఏమీ లేవు… సరైన ఇల్లస్ట్రేషన్ ఎంపికలో పొరపాటు… విజువల్ ఇమేజీ కంపెనీ గెట్టీ ఇమేజెస్ సమకూర్చిన ఫోటో అది… పాతకాలం నాటి కాంగ్రా పెయింటింగ్… అయితే ఇది మా పాఠకులు, ఇతరుల మనోభావాలను గాయపరిచిందని తెలిసింది… అందుకే మా క్షమాపణలు… బాధ్యతాయుత జర్నలిజానికి కట్టుబడినందున, ప్రతి మతం విశ్వాసాల్ని గౌరవిస్తాం గనుక క్షమాపణలు చెప్పడమే గాకుండా ఆ బొమ్మను కూడా తొలగిస్తున్నాం’’ అని పేర్కొంది…
The illustration was taken from the visual image company Getty Images, which describes it as a Kangra painting from Himachal Pradesh, circa 1820. We are genuinely sorry that it has hurt the sentiments of many of our readers and others. We humbly offer our sincere apologies for publishing the illustration and have since removed it from our website. THE WEEK has always been committed to balanced and responsible journalism, eschewing sensationalism. THE WEEK has respect for religious faith and beliefs of our country.
V.S. Jayaschandran, Editor-in-Charge, THE WEEK
Share this Article