నిజానికి అందరూ అమీర్‌ఖాన్ లాల్‌సింగ్‌చద్దా, అక్షయ్‌కుమార్ రక్షాబంధన్, తాప్సీ దొబారా డిజాస్టర్ల గురించి… వాటి మీద బాయ్‌కాట్ ప్రభావాల గురించి మాట్లాడుకుంటున్నారు… కానీ నిజానికి మాట్లాడుకోవాల్సింది రాబోయే బ్రహ్మాస్త్ర సినిమా గురించి..! లాల్‌సింగ్‌దేముంది..? 150 కోట్ల బడ్జెట్‌లో సగానికి పైగా అమీర్ పారితోషికమే అయి ఉంటుంది, పైగా తను కూడా డబ్బులు పెట్టాడు… అక్షయ్ రక్షాబంధన్ పెద్ద బడ్జెట్టేమీ కాదు… దొబారా గురించి ప్రస్తావనే అనవసరం…
కానీ బ్రహ్మాస్త్ర 500 కోట్ల బడ్జెట్… ఇది పార్ట్ వన్ (శివ) ఖర్చు అట… తన కంపునోటితో వెగటు వాసనను వ్యాపింపచేస్తున్న కరణ్ జోహార్ ఒక నిర్మాత కాగా, ఆలియా భట్ మొగడు రణబీర్‌కపూర్ మరో నిర్మాత… ఇంకో ముగ్గురున్నారు… విశేషమేంటో తెలుసా..? లాల్‌సింగ్‌ను అక్కున చేర్చుకున్న చిరంజీవిలాగే తెలుగులో బ్రహ్మాస్త్రను రాజమౌళి, ధనుష్ దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు… ఏళ్లుగా నిర్మాణం, వాయిదాల్లో ఉన్న ఈ భారీ సినిమా జయాపజయాలు వర్తమాన హిందీ సినిమాల స్థితిగతులను నిర్దేశించబోతోంది…
ఇందులో అమితాబ్, రణబీర్‌కపూర్, ఆలియాభట్, నాగార్జున, షారూక్‌ఖాన్ (అతిథిపాత్ర), డింపుల్ కపాడియా ఎట్సెట్రా ఉన్నారు… 2019లో కావచ్చు, కుంభమేళా దగ్గర 150 డ్రోన్లను ప్రయోగించి గగనంలో సినిమా ప్రమోషన్ దృశ్యాలను అద్భుతంగా ప్రదర్శించారు… కార్తికేయలాగే ఇదీ ఓ ఫాంటసీ… దీనికి శివ పేరు పెట్టారు గానీ… బ్రహ్మాస్త్ర, వానరాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, నందిఅస్త్ర, ఆగ్నేయాస్త్ర వంటి అస్త్రాలు, శక్తిని డిస్కస్ చేస్తూ సాగే ఓ సూపర్ నేచురల్ స్టోరీ…
Ads
సరే, ఆ సినిమా సెప్టెంబరులో రిలీజ్ అంటున్నారు… దాని మీద చర్చ ఇంకా లోతుల్లోకి వద్దులే గానీ… మొన్నమొన్నటిదాకా చర్చ ఏమిటి..? ‘‘పీకే రిలీజ్ సమయంలో ఆమీర్‌ఖాన్ ఇష్టముంటే చూడండి, లేకపోతే నా సినిమాలు చూడకండి అన్నాడు… సేమ్, కరీనాఖాన్ కూడా ఆమధ్య అలాగే పొగరుగా మాట్లాడింది… తీరా లాల్‌సింగ్ బాయ్‌కాట్ సెగ తగిలేసరికి, దయచేసి పాతవి మరిచిపొండి, ఈ సినిమా చూడండి అని బతిమిలాట మొదలు పెట్టారు… దొబారాకు బాయ్‌కాట్ సమస్య లేదు, కానీ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సి కావాలని గోక్కున్నారు… అది కాస్తా పుండై పోయింది… అర్జున్ కపూర్ మాటలు కూడా అంతే…’’ ఇదే కదా చర్చ…
ఇప్పుడు ఇక ఆలియా భట్ వంతు… ఆమె మీద ట్రోలింగ్ సాగుతూనే ఉంది… నిజానికి పెద్ద కారణాలు లేవు… కరణ్ జోహార్ మీద కోపం, తనే బ్రహ్మాస్త్ర ప్రధాన నిర్మాత, బాలీవుడ్ మాఫియా సభ్యుడని ఆరోపణ… అలాగే ఆలియా భట్ స్టార్ కిడ్… అంటే వారస హీరోయిన్… వాస్తవంగా ట్రోలింగ్‌కు ఇవి కారణాలు కాకూడదు… అర్థం లేని విషయాలకు బాయ్‌కాట్స్, ట్రోలింగ్ చేస్తే, ఇక వాటి శక్తే పోతుంది… నిజమైన సమస్య వచ్చినప్పుడు బాయ్‌కాట్స్ పిలుపుల్ని ఎవరూ పట్టించుకోరు… కానీ నెటిజనానికి చెప్పగలిగేవాడు ఎవడు..?
సైలెంటుగా ఉండీ ఉండీ ఆలియా ఇక స్పందించింది… సేమ్, తను కూడా గతంలో ఆమీర్, కరీనా చెప్పినట్టే… ‘‘మీకు ఇష్టం లేకపోతే నా సినిమా చూడకండి’’ అని ‘‘మిడ్-డే’’ ఇంటర్వ్యూలో పరుషంగా వ్యాఖ్యానించింది… ‘‘నేను కోరుకుని, అడిగి ఫలానా కుటుంబంలో జన్మించానా..? ఐనా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబాల్లో పుడితే ఎంట్రీ వరకే ఆ నేపథ్యం పనిచేస్తుంది… ఆ కుటుంబాల్లో పుట్టడమే తప్పంటే ఎలా..?’’ ఇదీ ఆమె వాదన…
https://twitter.com/Bollyhungama/status/1561641639516389377?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1561641639516389377%7Ctwgr%5E524c19e07a8a814cbf294e4a9ab56abaa4b53056%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.opindia.com%2F2022%2F08%2Fafter-kareena-kapoor-alia-bhatt-dont-like-me-dont-watch-me-ahead-of-brahmastra-release%2F
నిజం… ఆలియా వాదన కరెక్టు… కాకపోతే సినిమా రిలీజుకు ముందు నోరు అదుపులో ఉండాలి… లేకపోతే చాలా లెక్కల్ని దెబ్బతీస్తుంది… మీ ఇష్టముంటే చూడండి, లేకపోతే లేదు వంటి వ్యాఖ్యలు పొగరుగా ధ్వనించి, ప్రేక్షకుడిని దూరం చేస్తాయి… అసలే హిందీ సినిమాలు తట్టుకోలేని దురవస్థలో కొట్టుకుంటున్నాయి… ఈమెకు పెద్దగా చదువూసంధ్యా లేవు కదా… పన్నెండు డ్రాపవుట్… తరువాత మొత్తం ఫీల్డే… లౌక్యం, లౌకిక విషయాల్లో పూర్… కానీ మెరిట్ పరంగా సూపర్… పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తుంది…
ఐనాసరే, ప్రేక్షకుడే అల్టిమేట్… కీలకమైన సినిమా రిలీజుకు సిద్ధంగా ఉన్నప్పుడు… మరీ విజయ్ దేవరకొండలాగా మాట్లాడకూడదు… బ్రహ్మాస్త్ర పెద్దలు ఆలియాభట్‌కు ఈ జాగ్రత్త చెప్పడం మరిచిపోయినట్టున్నారు… అఫ్‌కోర్స్, సినిమా ఏకాస్త బాగున్నా సరే, ఈ వివాదాలన్నీ ఇట్టే కొట్టుకుపోతాయి..!!
Share this Article