అంతకుముందు మేజర్, కేజీఎఫ్-2, సర్కారువారిపాట, రన్‌వే, జెర్సీ తదితర సినిమాల కోసం అడివి శేషు, మహేశ్‌బాబు, యశ్, అజయ్ దేవగణ్ షాహిద్ తదితరులతో ఎన్ఎంనీహారిక చేసిన ప్రమోషనల్ వీడియో బిట్స్ కోట్ల వ్యూస్ సంపాదించాయి కదా… విపరీతమైన వైరల్… సరదాగా సరదాగా, ఆయా హీరోలను ఆటపట్టించబోయి చివరకు తనే బుక్కయిపోయినట్టుగా ఉండే చిన్న బిట్స్‌లో క్రియేటివిటీ ఉంటుంది… ఓ డిఫరెంట్ ప్రమోషన్ కూడా… నవ్వు పుట్టిస్తూనే సినిమాను మన బుర్రలకెక్కిస్తాయి…
ఏదో తెలుగు పత్రికలో ఆమె ఇంటర్వ్యూ చూశాక, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు ఏమైనా ప్రమోషన్ బిట్ చేసిందాని సెర్చ్ మొదలుపెట్టామో లేదో అలా ప్రత్యక్షమైపోయింది… చూస్తే ఎప్పటిలాగే నవ్వొచ్చింది… అయితే గత వీడియో బిట్స్‌లో ఉన్న ఆ స్పార్క్ లేదనిపించింది… కానీ విజయ్ దేవరకొండను మాత్రం రెండు అంశాల్లో భలే వెక్కిరించినట్టుగా ఉంది… విజయ్ కూడా సరదాగా లైట్ తీసుకున్నట్టున్నాడు… మరీ మన పెద్ద పెద్ద స్టారాధిస్టార్లకు ఉండే ‘‘సంకుచితత్వం’’ తనకు లేదు కాబట్టి…
తన రూట్స్ చెన్నై, పెరిగింది బెంగుళూరు, ఇప్పుడు ఉండేది లాస్‌ఏంజిల్స్ అని చెబుతుంది గానీ… చెన్నైలో స్థిరపడిన తెలుగు రూట్స్ కావచ్చు… చాలా వీడియో బిట్స్‌లో అనుకోకుండా ఒకటీరెండు తెలుగుపదాలు ఫ్లోలో వచ్చేస్తుంటయ్… లైగర్ బిట్‌లో కూడా… విజయ్ ఓచోట ‘ఏందీ’ అంటాడు… మరోచోట ఈమె ‘నైస్ ఉంది’ అంటుంది… వీడియో విషయానికివస్తే…
Ads
విజయ్, నీహారిక ఇద్దరూ సరదాగా లైగర్ సినిమాలోగా ఫైట్ చేస్తుంటారు… విజయ్ బాడీ టచ్ చేసి, వెంటనే హత్తుకుంటుంది… విజయ్ ఏయ్, ఏయ్ అని దూరం పెడుతుంటాడు… ఫ ఫ అని నత్తిగా సీరియస్ అవుతూ… అంతే నత్తిగా ఆమె కూడా ఫ ఫ అంటూ పలు పదాల్ని గుర్తుచేస్తూ వాదనకు దిగుతుంది… ఇక్కడ ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే..?
మామూలుగా విజయ్ భాషలో ఫ- పదం అలవోకగా దొర్లిపోతూ ఉంటుంది… అప్పట్లో అర్జున్‌రెడ్డి సినిమా సమయంలో కూడా ఆ పదమే తన మీద విమర్శలకు కూడా దారితీసింది… యాటిట్యూడ్, రౌడీ హీరో అనే ముద్ర కూడా వేసింది… ఈ ప్రమోషన్ వీడియోలో కూడా సేమ్… నీహారిక కాసేపు తమ సరదా వాదనను ఆ ఫ అనే అక్షరం చుట్టూ తిప్పిన తీరు ఇంట్రస్టింగుగా ఉంటుంది… ఫ్లోర్, ఫింగర్, ఫాదర్ ఎట్సెట్రా పదాల్ని వాడుతూ మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటుంది… ఎప్పటిలాగే ఈ బిట్ కూడా స్థూలంగా వోకే… కానీ కేజీఎఫ్-2 బిట్ మాత్రం అదిరిపోయింది… దాంతో పోలిస్తే లైగర్ బిట్ కాస్త పేలవమే…!!
Share this Article