కొన్నాళ్లుగా ఆమీర్‌ఖాన్ గురించి చర్చ జరుగుతోంది కదా… ఈ మనిషి ఫస్ట్ నుంచీ ఇదే టైపా అని కాస్త అవీఇవీ సెర్చిస్తుంటే… గిరిజ ఎపిసోడ్ ఓచోట కనిపించింది… గిరిజ ఎవరు అంటారా..? 1989 నాటి గీతాంజలి సినిమాతో ఓ వెలుగు వెలిగిన నటి… గిరిజ ఎమ్మాజెన్ షెత్తార్… మరి ఆమీర్‌ఖాన్ ప్రస్తావన ఏమిటంటే..? గిరిజకు బాగా పాపులారిటీ రావడంతో 1992లో తను హీరోగా నటించే ‘‘జో జీతా వోయీ సికిందర్’’ సినిమాకు హీరోయిన్‌గా తీసుకున్నారు… అంటే 30 ఏళ్ల క్రితం…
ఇప్పుడంటే త్రిష వంటి హీరోయిన్లు తమ కంట్రాక్టులకు భిన్నంగా ఎవరైనా నిర్మాతో, హీరో వ్యవహరిస్తే… ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్’’ పేరిట హుందాగా తప్పుకుంటున్నారు… ఆచార్య నుంచి అలాగే తప్పుకుంది కదా… ఇండస్ట్రీలో తొక్కాలని చూసినా ఎదుర్కోగలను అనే ధీమా ప్లస్ ఇప్పటికే వెల్ సెటిల్డ్… ఇప్పుడు ఎవరైనా నాకు నష్టం ఏం చేయగలరులే అనే ఫీల్… రాధిక ఆప్టే, తాప్సి వంటి తారలైతే వేరే తరహాలో దూరం జరిగేవారేమో… కానీ 30 ఏళ్ల క్రితం… ఇంకా ఆడతారల్ని మరీ అంగడిసరుకుల్లా చూసే ఆ రోజుల్లో… మాట్లాడే సీనే ఉండేది కాదుగా…
అలాంటిది ఈ గిరిజ సదరు హిందీ సినిమా నిర్మాతలను కోర్టుకు లాగింది… తన కంట్రాక్టుకు భిన్నంగా ఎక్స్‌పోజింగ్ సీన్ల కోసం ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించింది… చివరకు నిర్మాత పరిహారం కట్టి, ఆ కోపంతో ఆమె మీద కక్ష తీర్చుకోవడానికి ఆమెను సినిమా నుంచి తప్పించాడు… హీరో వత్తాసు… ఆమె ప్లేసులోకి ఆయేషా జుల్కాను పట్టుకొచ్చారు… గిరిజ కూడా ఎడమకాలితో ఆ సినిమాను తన్నేసింది… తరువాత బ్రిటన్ వెళ్లిపోయింది… ఆ సినిమాలో ఒక్క పాటలో మాత్రం ఆమె కనిపిస్తుంది…
Ads
నిజానికి గిరిజ కంప్లీట్ డిఫరెంట్ కేరక్టర్… స్వతహాగా బ్రిటిషర్… తండ్రి కన్నడిగ, డాక్టర్… తల్లి బ్రిటిషర్, బిజినెస్ వుమన్… ఇండియా గురించి విని, గిరిజ ఇక్కడికి వచ్చింది… క్రికెటర్ శ్రీకాంత్ సోదరి శ్రీకళ భరత్ దగ్గర భరతనాట్యం నేర్చుకునేది… తన ప్రపంచం వేరు… భారతీయ కళలు, సంస్కృతి, ప్రత్యేకించి భారతీయ తత్వశాస్త్రం (వేదిక్ ఫిలాసఫీ) ఆమె ఫేవరెట్ సబ్జెక్టులు… అరబిందో మార్గం మీద ఆసక్తి… యోగా చేసేది… గుళ్లు, ఊళ్లు తెగతిరిగేది… ఓసారి మణిరత్నం, సుహాసిని పెళ్లికి శ్రీకళతో కలిసి వెళ్లినప్పుడు, ఈ ఆఫర్ వచ్చింది ఆమెకు… ‘‘మా గీతాంజలి సినిమాలో హీరోయిన్‌గా చేస్తావా..? నటన మీద ఆసక్తి ఉందా..?’’
దాందేముంది, చేద్దాం అనేసింది ఆమె… నిజానికి ఆమె కోరుకున్న కెరీర్ కాదు… ఓ సరదా… ఆమె రెగ్యులర్ స్పిరిట్యువల్ ప్రయాణానికి అడ్డంకులేమీ లేకుండానే… చేసింది, అదెంత సూపర్ హిట్టో తెలుసు కదా… మలయాళంలో వందనం మరో హిట్… హృదయాంజలి అని మరో సినిమాలో చేసింది, కానీ అది 1992 పూర్తయితే అనేక కారణాలతో, పదేళ్ల తరువాత, అంటే 2002లో రిలీజైంది… ఈలోపు ఆమీర్ ఖాన్ సినిమా చేదు అనుభవంతో దేశమే విడిచిపెట్టి వెళ్లిపోయింది… అలా వెళ్లిపోయినందుకు ఎప్పుడైనా చింతించావా అనడిగితే… అసలు అది నేను ఎంచుకున్న మార్గం అయితే కదా బాధపడటానికి అని నవ్వేసేది… దటీజ్ గిరిజ…
బేసిక్‌గా తన ప్రపంచం వేరు… బ్రిటన్ తిరిగి వెళ్లిపోయాక పీహెచ్‌డీ చేసింది… ఇండియన్ ఫిలాసఫీ మీద వ్యాసాలు రాసేది… జర్నలిస్టుగా మారింది… గీతాంజలి తరువాత మణిరత్నం నుంచే మరో సినిమా, రజినీకాంత్ ఇంకో సినిమా ఆఫర్లు సహా ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇక అంగీకరించలేదు… కానీ గీతాంజలికి సీక్వెల్ తీస్తే, అందులో మాత్రం మళ్లీ నటిస్తే బాగుండు అనిపించేదట అప్పుడప్పుడూ… ఆమెకు 53 ఏళ్లు ఇప్పుడు… పెళ్లి చేసుకోలేదు… ప్రపంచంలో ఆమెకు ఇష్టమైన ప్లేస్ అరవిందాశ్రమం..!!
Share this Article