వచ్చె, వచ్చె… పాయె పాయె… దీపిక పిల్లి ఈసారి బిగ్బాస్లో ఖాయం, మస్తు పైసలు ఇస్తామన్నారట… అరెరె, కాదు, కాదు, ఆమె ప్లేసులో వర్షిణిని తీసుకుంటారట… అసలు ఉదయభానును తీసుకోవడం దాదాపు ఫైనల్ అయిపోయి, చివరకు ఆగిపోయింది… ఇలా ఇప్పటికి అన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కలిసి ఓ వంద మందిని సెలెక్ట్ చేశాయి, తీసేశాయి, ఇంకా రాసేస్తూనే ఉన్నాయి… ఏదో వీళ్ల ఆత్రం గానీ నిజానికి ఇప్పటికి ఆ లిస్టు ఫైనల్ కానేలేదు…
ఫైనల్ అయ్యి ఉండవచ్చు, కానీ అందరితోనూ అగ్రిమెంట్ల కథలు ముగిసేవరకు కొంత కసరత్తు, డాక్యుమెంటేషన్ ప్రయాస ఉంటుంది… కరోనా, క్వారంటైన్ విషయంలోకి వెళ్లేముందు… ఇప్పటికి బాగా వినిపిస్తున్న పేర్లు ఓసారి చూద్దాం…
1. బాలాదిత్య, 2. యూట్యూబర్ ఆదిరెడ్డి, 3. హీరో అర్జున్ కళ్యాణ్ , 4. రాజశేఖర్ (కామన్ మేన్), 5. సుదీప- నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ 6. జబర్దస్త్ ఫైమా 7. జబర్దస్త్ చలాకీ చంటి 8. గలాటా గీతు 9. శ్రీహాన్ 10. సింగర్ రేవంత్ 11. దీపిక పిల్లి 12. వాసంతి కృష్ణన్ 13. ఇస్మార్ట్ అంజలి 14. తన్మయ్ 15. సీరియల్ నటి శ్రీ సత్య 16. అభినయ శ్రీ 17.రోహిత్, సీరియల్ నటుడు 18. మెరీనా అబ్రహాం, సీరియల్ నటి 19. ఆర్జే సూర్య (ఆప్షనల్ అట) 20. ఇనయ సుల్తాన- ఆర్జీవీ హీరోయిన్ (ఆప్షనల్ అట)…
Ads
నిజానికి ఇందులో సగం మంది వరకు కూడా ఫైనల్ లిస్టులో ఉంటారా లేదానేది డౌటే… వీరిలో రోహిత్, మెరీనా భార్యాభర్తలట… అబ్బే, వీళ్లు కాదు… ఇంకో ఖతర్నాక్ లిస్టు ఇస్తాం చదవండి అని మరో ప్రముఖ వెబ్సైట్ వేరే జాబితా ఒకటి వదిలింది… అందులో నటి ఆశా షైనీ, యాంకర్ మంజూష, యూట్యూబ్ యాంకర్ రోషన్, సింగర్ మోహన భోగరాజు, నటుడు చదలవాడ లక్ష్, ట్రాన్స్జెండర్ తన్మయి (ఎవరో ఓ ట్రాన్స్జెండర్ను తీసుకోవడం సెంటిమెంట్ అయిపోయిందా..?),
కొరియోగ్రాఫర్ పాపీ మాస్టర్, రివ్యూయర్ దాసరి విజ్ఞాన్, యాంకర్ పద్మిని, నటి సంజనా చౌదరి, యూట్యూబ్ నటి కళ్లపు కుషిత, యాక్టర్ మాస్టర్ భరత్, టీవీ యాక్టర్ కౌశిక్, టీవీ నటి కరుణ, నటుడు శ్రీమంగం, నటి ప్రతీ అస్రానీ, నటుడు సుమంత్ అశ్విన్, నటుడు గరికపాటి చైతన్య…. కంప్లీట్ డిఫరెంట్ లిస్టు…
మరో సైటు చదివితే ఈ రెండు లిస్టులకు ఇంకా భిన్నమైన జాబితా కనిపించవచ్చు… సరే, ఎవరయితేనేం..? ఈసారి కూడా హాట్స్టార్లో 24 గంటల ప్రసారం ఉంటుందట ప్లస్ మాటీవీలో గంట… బిగ్బాస్ నాన్ స్టాప్ OTT షోను ఇలా 24 గంటలు అని చెప్పి భ్రష్టుపట్టించారు… అశ్లీలం, అసభ్యత మోతాదు పెరిగింది… దాన్నలాగే కొనసాగిస్తే బిగ్బాస్-6 సీజన్ మరింత గలీజెక్కి, ఆ కంపు తెలుగిళ్లలో బలంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది… సీపీఐ నారాయణ తన పోరాటశక్తులన్నీ కూడదీసుకుని, ఇక భౌతిక దాడులకు రెడీ అయిపోతాడేమో…
సరే, దీన్ని పక్కన పెడితే… సెప్టెంబరు 4 నుంచి స్టార్ట్ కదా… సెలెక్టయిన కంటెస్టెంట్లను వారం రోజులపాటు స్టార్ హోటళ్లలో క్వారంటైన్లో ఉంచబోతున్నారు అనేదే ఎంతకూ సమజైత లేదు… అంటే ఆల్రెడీ ఈ క్వారంటైన్ స్టార్టయిందా..? నిజానికి క్వారంటైన్ ప్రక్రియ ప్రస్తుతం ఉందా అసలు..? రెండు డోసుల వేక్సినేషన్ ప్లస్ బూస్టర్ డోసులు అయిపోయాయి చాలామందికి…
కొందరైతే డబుల్ బూస్టర్లూ వేయించుకున్నారు… ఇప్పుడు మాస్కులు కూడా లేవు… జస్ట్, బిగ్బాస్ హౌజులోకి పంపించేముందు ఇన్స్టంట్ టెస్టు చేయిస్తే చాలు… ఇక ఏ డేంజరూ ఉండదు… మరి ఈ క్వారంటైన్ బాగోతం ఏమిటి..? అగ్రిమెంట్లు, డాక్యుమెంట్లు, కమిట్మెంట్లు, అడ్వాన్సుల పేమెంట్లు ఎట్సెట్రా..?! ఐనా ఈ బిగ్బాస్ టీంవన్నీ తలతిక్క నిర్ణయాలే ఉంటాయి కదా… వాటిల్లో ఇదొకటి… ఇక అసలు షో ఇంకెలా ఏడవబోతోందో…!! ఈసారి కనీసం హోస్టునైనా మార్చొచ్చుకదరా భయ్..?!
Share this Article