ఒక సమాచారం ఆసక్తికరంగా అనిపించింది… నిర్మాతల మండలి సభ్యులు ఇటీవల సమావేశమై నిర్మాణవ్యయం తగ్గింపు మీద చర్చించారట… ఆర్టిస్టులు ఉదయం 7 గంటలకే సెట్‌కు వచ్చేయాలని నిబంధన పెట్టబోతున్నారట… నిజానికి అదికాదు ఆకర్షించింది… నటులు సాయికుమార్, మురళీశర్మలను పిలిచి, నిర్మాతలకు కాస్త సహకరించాలని కోరారట… ఎందుకు..?
ఎస్, ఈమధ్య మురళీశర్మ చాలా పాపులర్… విలన్ కమ్ కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే నటులు కొందరే ఉన్నారు… ప్రకాష్‌రాజ్ ఎట్సెట్రా విలన్లకు క్రేజ్ పడిపోయింది… మొనాటనీ దానికి కారణం… ప్లస్ ప్రకాష్‌రాజ్ పొలిటికల్ యాక్టివిటీ మరో కారణం… రావుగోపాలరావు కొడుకు రావురమేష్ వంటి ఆర్టిస్టులకు సరైన ప్రోత్సాహం లేదు… ఇంకా చాలామంది ఉన్నారు, ప్రయోగం చేయాలంటే బోలెడు కొత్త ఆర్టిస్టులకు కొదువ లేదు…
కానీ మురళీశర్మ మాత్రమే దేనికి..? ఎస్, తను మెరిట్ ఉన్న ఆర్టిస్టు… సందేహం లేదు… కానీ తనను బుక్ చేస్తే నిర్మాతకు ఖర్చు తడిసి మోపెడు అవుతోందట ఈమధ్య… ప్రత్యేక కార్వాన్, వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు ఎట్సెట్రా… ఒకప్పుడు సినిమా అంటే బ్రహ్మానందం కంపల్సరీ, ఈమధ్య వెన్నెల కిషోర్ కంపల్సరీ, అదో సెంటిమెంట్… అలాగే మురళీశర్మ కూడా… అదీ తనకు అలుసు…
Ads
తనను కాస్త కంట్రోల్‌లో ఉండాలని చెప్పడం వరకూ వోకే… కానీ, సాయికుమార్..? తను కూడా అంతేనా..? వోకే… వీళ్లిద్దరు జస్ట్, చిన్న నటులు ప్రస్తుతానికి… వాళ్ల ఖర్చులు ఏమూలకు..? అసలు వాచిపోయేది హీరోయిన్, హీరోల ఖర్చులు కదా… హీరోల రెమ్యునరేషన్లు కదా సినీ ఇండస్ట్రీకి పెద్ద శాపం… మరి వాళ్లను ఏమీ అనలేక, వాళ్ల పాదపూజ మానలేక ఇలాంటి ఆర్టిస్టులపై కత్తి ఝలిపిస్తే ఎలా..? ఆ మాట అంటేనే దిల్‌రాజు అండ్ అదర్ నిర్మాతలకు కోపం…
హీరో సెంట్రిక్… తెలుగు ఇండస్ట్రీ అంటేనే హీరో స్వామ్యం… తను చెప్పినవాడే కథకుడు, డైౌలాగ్ రైటర్, సంగీత దర్శకుడు, హీరోయిన్, ఇతర ఆర్టిస్టులు… చివరకు తను చెప్పినట్టే కథ నడవాలి… మరీ నీచం ఏమిటంటే ఏ గాయకుడు లేదా గాయని పాడాలో కూడా హీరోయే డిసైడ్ చేస్తున్నాడు… అవసరమైతే వాడే మెగాఫోన్ పడుతున్నాడు… ఇంతకన్నా దారుణం ఏముంది..? దర్శకుడికి స్వేచ్ఛ ఏముంది..? సినిమా ఫ్లాపయితే ఫస్ట్ నిందించేది వాడినే… ఫస్ట్ బకరా వాడే…
నిర్మాణవ్యయం తగ్గాలంటే ముందుగా హీరో అనేవాడి పైత్యాలు తగ్గాలి, వాడే సినిమాకు శాపం… ఎంత తోపు హీరో అయినా సరే, సినిమా హిట్ అవుతుందీ అనుకుంటే అది ఓ భ్రమ… అది చాలా సందర్భాల్లో రుజువైంది… ఐనా సరే, ఈ నిర్మాతలు వాళ్ల పాదపూజ మానరు… ఆ డబ్బంతా ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవాలని భావిస్తారు… పనికిమాలిన బిల్డప్ స్టోరీలు, రొడ్డకొట్టుడు ఫార్ములా కథలు, ఎదవ పైత్యాలు… జనం ఈడ్చి తన్నినా సరే నిర్మాతలు మారరు… అసలు రోగం అక్కడే ఉంది… దరిద్రం ఏమిటంటే..? స్టెప్పులు కూడా హీరోయే డిసైడ్ చేస్తాడు… ఆ దరిద్రుడు ముసలి హీరో అయితే కొరియోగ్రాఫర్‌కు అదో అగ్నిపరీక్ష… సదరు హీరోయిన్‌కు ఎంత అవస్థ… అసలే ముసలి కంపు, పైగా వీపుకు బద్దలు కట్టిన హీరోయిజం…
కానీ ఒక హీరోను నువ్వు రెమ్యునరేషన్ తగ్గించుకో దేవుడా అనడిగే తెలివి, సోయి, దమ్ము, ధైర్యం లేవు ఈ నిర్మాతలకు… తలకుమాసిన హీరోలు సైతం ఒక ఫైటర్, ఒక డాన్సర్, ఓ సింగర్ ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తున్నారు… వాళ్లను వదిలి మురళీ శర్మ ఖర్చు పెరిగింది, సాయికుమార్ పైత్యం పెరిగింది అనే ముద్రలు దేనికి..? అవి తగ్గితే నిర్మాణవ్యయం తగ్గుతుందా..? దీన్నే దిల్‌రాజు మార్క్ భావదారిద్య్రం అంటారు…
చిల్లర ఆలోచనలు… సెట్‌లో భోజనాల ఖర్చు, సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టుల ఖర్చు తగ్గడం కాదు… సింహభాగం సినిమా నిర్మాణవ్యయానికి ప్రధాన బాధ్యుడు హీరో… వాడూ దిక్కుమాలిన లయబులిటీ ఇండస్ట్రీకి… అది కదా తగ్గాల్సింది… అది చేతకాదు ఈ నిర్మాతలకు… ఎదగండిరా..!!
Share this Article